మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ కుటుంబ ఆస్తి ఎంతో మీకు తెలుసా?

మెగా కాంపౌండ్ హీరోలలో దాదాపు ఏడుగురు హీరోలు ఉన్నారు. వారిలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు విజయదుర్గ కుమారుడే సాయిధరమ్ తేజ్. యువ హీరోలలో అతడికి మంచి క్రేజ్ ఉంది. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన రేయ్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినా తొలుత విడుదలైన సినిమా మాత్రం పిల్లా నువ్వు లేని జీవితం. ఆ సినిమా సాయిధరమ్ తేజ్‌కు మంచి సక్సెస్ అందించింది. ఆ తర్వాతే రేయ్ సినిమా విడుదలైంది. ఆ సినిమా సరిగ్గా ఆడకపోయినా సాయి ధరమ్ తేజ్‌ కెరీర్‌కు ఇబ్బందేమీ రాలేదు. దిల్ రాజు బ్యానర్‌లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం అనే సినిమాలను చేయగా అవి విజయం సాధించాయి. దీంతో టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో మంచి రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న మార్కెట్‌కు అనుగుణంగా సాయిధరమ్ తేజ్ ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాయిధరమ్ తేజ్ కుటుంబానికి చాలా ఆస్తులు ఉన్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. మెగాస్టార్ కుటుంబానికి ఏ మాత్రం తీసిపోని విధంగా సాయిధరమ్ తేజ్ కుటుంబానికి స్థిరాస్తులు ఉన్నాయట. హైదరాబాద్ నగరంలోని సాయిధరమ్ తేజ్ కుటుంబానికి మూడు సొంత ఇళ్లు ఉన్నాయట. అలాగే స్థలాలు కూడా భారీ మొత్తంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయిధరమ్ తేజ్ కుటుంబానికి మొత్తం 150 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. పైగా తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో వైష్ణవ్ తేజ్‌కు కూడా నిర్మాతలు మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. రెండో సినిమా కొండపొలం మూవీకి వైష్ణవ్ తేజ్ రూ.3కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా అన్నదమ్ములు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.