మోనాల్ సోదరి హిమాలికి అభిజీత్ స్పెషల్ గిఫ్ట్ షాక్ లో మోనాల్….

ఈ కరోనా లాక్ డౌన్ వేళా అసలు తెలుగు బిగ్ బాస్ సీసన్ 4 స్టార్ట్ అవుతుందా లేదా అనే అనుమానం అందరికి కలిగింది, అలాంటిది బిగ్ బాస్ సీసన్ మొదలు పెట్టారు కూడా 16 మంది ఇంటి సభ్యులను హౌస్ లోకి పంపించారు.. తరువాత 3 వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది, అయితే అందరు ఈసారి కొత్తవాళ్లే సోషల్ మీడియా సెలెబ్రిటీలను హౌస్ లోకి తీసుకువచ్చారు ముందు చాలా చక్కగా అనిపించింది హౌస్ లో వాతవరణం తరువాత కాస్త గొడవలు వచ్చాయి ముఖ్యం గా ఇంటి సభ్యుల గొడవలు, వివాదాలు, రిలేషన్ టాస్క్ లు ఇవ్వని కూడా హౌస్ పై మరింత ఇంటరెస్ట్ ని కలిగించేలా చేసాయి ముఖ్యం గా రెండవ వారం నుంచి మంచి హైప్ వచ్చిందనే చెప్పాలి..

ప్రతిదాన్ని గురించి నాగార్జున కూడా ప్రశ్నించడం హైలెట్ అయింది.. హోస్ట్ గా అయిన పూర్తీ సక్సెస్ అయ్యారు ఇక ఇంట్లోని కచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తే మోనాల్ గురించి చెప్పాలి ముందు అభిజీత్ తో సరదాగా క్లోజ్ గా ఉండేది ఇద్దరు లవ్ లో ఉన్నారేమో అని అందరు అనుకునేవారు తరువాత మోనాల్ అభిజీత్ తో కాకుండా అఖిల్ తో ప్రేమాయణం సాగించినట్టు భావించారు తరువాత అభిజీత్ ని పక్కన పెటేసింది… పూర్తిగా అఖిల్ తోనే సావాసం చేసింది ఈ సమయం లో అభిజీత్ కూడా మోనాల్ ని అసలు పటించుకోలేదు హారిక తో సరదాగా ఉండేవారు వీళ్ల ఇద్దరినీ చూసి వీళ్లు ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారేమో అని అందరు భావించారు కానీ బిగ్ బాస్ కెమెరాలు మనకి చూపించింది ఒక్కటి అక్కడ జరిగిన రిలేషన్ ఒక్కటి ..

మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత ఈ వ్యవహారం పై ఒక క్లారిటీ వచ్చింది.. హారిక ని అభిజీత్ చెల్లిలాగా చూస్తునాను అని చెప్పారు అయితే మోనాల్ అంటే ముందు నుంచి అభిజీత్ కి కాస్త మంచి అభిప్రాయం ఏ ఉండేది మంచి ఫ్రెండ్ గా కూడా భావించారు కానీ కొన్ని పరిస్థితులు మోనాల్ ని అభిజీత్ కి దూరం చేసాయి.. మొత్తానికి అభిజీత్ అయితే మోనాల్ తో ఇపుడు చాలా సరదాగా ఉన్నారంట.. ఇంకా మోనాల్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత తన చెల్లి పెళ్లి పనిలో బిజీ అయింది.. ఈ సమయం లో బిగ్ బాస్ హౌస్ లో తనతో ఉన్న ప్రతిఒక్కరిని కూడా తన చెల్లి హిమాలి తన పెళ్ళికి ఆహ్వానించింది..

ఈ సమయం లో అభిజీత్ కూడా పంజాబ్ వెళ్లారట ఆమె పెళ్ళికి హిమాలి పెళ్లి సమయం లో మోనాల్ సందడి చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.. ఈ సమయం లో ఆమెకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన్నట్టు తెలుస్తుంది, హిమాలి పెళ్ళిలో ఆమెకు నచ్చినట్టు వంటి చిన్ననాటి ఫోటోని ఫ్రేమ్ గా ఇచ్చారట అందులో మోనాల్ , హిమాలి ఇద్దరు కలిసి చిన్నపుడు దిగిన ఫోటో ఉంది.. ఈ విషయాన్ని మోనాల్ హౌస్ లో ఉన్నపుడు చెప్పింది.. ఆ విషయాన్ని అభిజీత్ బాగా గుర్తుంచుకున్నాడు, అదే ఫోటో ని తన చెల్లికి గుర్తుగా ఇవ్వడానికి మోనాల్ దగ్గర నుంచి తీసుకున్నాడు.. హిమాలికి పెళ్లి రోజు సర్ప్రైజ్ గా ఈ గిఫ్ట్ ని అందుచేశారట ఈ విషయాన్ని సోషల్ మీడియా లో తెలియ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..