యాక్టర్ ప్రకాష్ రాజ్ మరియు శ్రీహరి మధ్య ఉన్న సంబంధం ఏంటి ?

తెలుగు సినీ ఇండస్ట్రీ లో ప్రకాష్ రాజ్, శ్రీహరి వీళ్ల ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు గా విల్లన్ గా హీరో గా నటించారు.. ప్రకాష్ రాజ్ కంటే శ్రీహరి రియల్ స్టార్ గా తనకంటూ మాస్ తో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు అంతకముందు శ్రీహరి తెలుగు సినీ పరిశ్రమలో విల్లన్ గా ఎంట్రీ ఇచ్చి కామెడీ విల్లన్ గా నవ్వులు కురిపించారు, ఆ పై హీరోగా టర్న్ తీసుకుని ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనదైన యాక్టింగ్ తో తాను ఏంటో నిరూపించుకున్నాడు. శ్రీహరి ఈ పేరు చెబితే మంచి పాత్రలు గుర్తుకొస్తాయి పోలీస్ గా మొదలైన అయినా హీరోయిజమ్ భద్రాచలం, గణపతి, అయోధ్య రామయ్య, విజయ రామరాజు వంటి అనేక పాత్రలో రాణించింది. నువ్వోస్తానంటే నేనోడ్డంటనా సినిమాలో మల్లి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారదు ఈ చిత్రం తో అయినా నటుడిగాను నంది అవార్డు సైతం వరించింది.

ఇక యాక్టర్ శ్రీహరి 1986 లో దర్శకుడు దరసారి నారాయణ రావు గారు తెరకు ఎక్కించిన బ్రహ్మనాయుడు ద్వారా సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. దాసరి శిషుడుగా చెప్పుకున్నా శ్రీహరి అగ్రగణ్యుడు కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు ఎన్నో వేసి మెప్పించారు అందులో భాగంగా అనేక చిత్రాల్లో అయినా నటించారు. ముఠామేస్త్రి ,మేజర్ చంద్రకాంత్, రౌడీ ఇన్స్పెక్టర్, అల్లరి ప్రియుడు, బావ గారు బాగున్నారా, హలో బ్రదర్ వంటి చిత్రాల్లో వేసినవి చిన్న పాత్రలే అయినా ప్రేక్షకులకు గుర్తుంది పోయేలా నటించారు వీటిలో ఎక్కువశాతం కామెడీ విల్లన్ ని పండించి మంచి నటుడిగా పేరు సాధించారు. బెస్ట్ విల్లన్ గా ఎన్నో నంది అవార్డు లు సాధించారు.. ఇక ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎటువంటి పాత్రకి అయినా ప్రాణం పోసి చేసే నటుడు ఎవరంటే మనందరికీ గుర్తుకు వచ్చేది ముందు ప్రకాష్ రాజ్ పేరు అనే చెప్పాలి.

మోనార్క్ వంటి తండ్రి అయినా బొమ్మరిల్లు ఫాదర్ అయినా దూకుడు వంటి నాన్న పాత్ర అయినా పోకిరి లో విల్లన్ క్యారెక్టర్ అయినా ప్రకాష్ రాజ్ నటన ముందు సలాం చేయాల్సిందే. తెలుగు లో ఎస్.వి. రంగ రావు, సత్యనారాయణ, రావ్ గోపాల్ రావు, కోట శ్రీనివాస్ రావు తరువాత అంతటా క్రేజ్ సంపాదించిన వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న ప్రకాష్ రాజ్ యాక్టింగ్, టాలెంట్ ఒక టాలీవుడ్ మాత్రమే కాదు కోలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని ఫిదా అయ్యాయి ఏ సినిమాలో ఎలాంటి పాత్ర అయినా వాస్తవిక గా నటిస్తారు. పవన్ కళ్యాణ్ హీరోగా ప్రకాష్ రాజ్నటించిన వకీల్ సాబ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పటికే ఎన్నో జాతీయ అవార్డులు గెల్చుకున్న ప్రకాష్ రాజ్ తో ఒక నటుడు ఏ కాదు మంచి నిర్మాత దర్శకుడు కూడా ఉన్నారు అటు విల్లన్ గా హీరో గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చూపించిన వీళ్ల ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది..

శ్రీహరి భార్య డిస్కో శాంతి ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి ఇద్దరు అక్క చెల్లెలు వీళ్ల నాన్న సి.ఎల్ ఆనంద్ కన్నడ , తమిళ్, మలయాళ ఇండస్ట్రీ లో హీరో గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటుడిగా విల్లన్ గా నటించి మెప్పించాడు ఈయన కూతురిలో పెద్ద అమ్మాయి లలిత కుమారి ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకున్నారు రెండో అమ్మాయి డిస్కో శాంతిని శ్రీహరి పేర్మించి పెళ్లి చేసుకున్నారు.. ఈ రకంగా ప్రకాష్ రాజ్, శ్రీహరి ఇద్దరు తోడు అల్లుడులు అయ్యారు అయితే ప్రకాష్ రాజ్ తాను లలిత గారితో విడాకులు తీసుకున్న విష్యం తెలిసిందే. ఇక ఈ రకంగా వీళ్ల ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది వీళ్ల ఇద్దరు పలు సినిమాలో కూడా కలిసి నటించారు బృందావన్ సినిమాలో అన్న తమ్ముడు ల కలిసి నటించారు అంటే కాదు తెలుగు తో పాటు హిందీ, తమిళ్,కన్నడ భాషలో కూడా వీళ్ల ఇద్దరు కలిసి నటించడం మరో విశేషం అనే చెప్పాలి.