యాక్టర్ సీత నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారో తెలుస్తే కన్నీరు పెడతారు..

సినిమాలో హీరోయిన్లుగా చేసిన కొందరు వారి గ్లామర్ తగ్గక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవుతున్నారు అలా చాలామంది ఇపుడు సైడ్ రోల్స్ చేస్తున్నవారు ఒకపుడు స్టార్ హీరోయిన్లు గా నటించారు అలాంటివారిలో సీత ఒక్కరు సీత దశాబ్దకాలంగా చాలా సినిమాలో నటించి ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్నారు అయితే ఆమె ఒకపుడు హీరోయిన్ గా కూడా నటించారు అనే విష్యం చాలామందికి తెలీదు, అచ్చం తెలుగు అమ్మాయిలాగా కనిపించే సీత కుటుంబం చెన్నై లో స్థిరపడింది. యాక్టర్ ఏ కాకుండా నిర్మాత కూడా చేసింది ఆమె నాన్న మోహన్ బాబు తమిళ నటుడు తల్లి చంద్రావతి 1985 సంవత్సరం లో సీత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తరువాత 1986 సంవత్సరంలో ఆడదే ఆధారం అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు అలా తెలుగు, తమిళ, మలయాళం భాషలతో పాటు కన్నడ సినిమాలో కూడా నటించారు.

1990 లో పార్థిబాన్ అనే నటుడిని వివాహం చేసుకున్నారు సీత ఆ తరువాత చాలా సంవత్సరాలు వెండితెరకు దూరంగా ఉన్నారు వీళ్లకి ముగ్గురు పిల్లలు ఉన్నారు కీర్తన, అభినయ, రాధా కృష్ణ వీరిలో కీర్తన హీరోయిన్ సిమ్రాన్ నటించిన అమృత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అయితే కొన్ని కారణాల వల్ల పార్థిబాన్ సీత 2001 సంవత్సరం లో విడాకులు తీసుకుంది. ఆ తరువాత టీవీ సీరియల్స్ లో నటిస్తూ 2010 లో టీవీ నటుడు సతీష్ ని పెళ్లి చేసుకుంది అయితే కొన్ని కారణాల వల్ల వీరు ఇద్దరు కూడా 6 సంవత్సరాలు తరువాత విడిపోయారు అయితే ఫ్యామిలీ భారం మోస్తూనే సీత పలు సినిమాలో నటించారు. గంగోత్రి, సింహాద్రి, బన్నీ, మాస్క్ రభస, దిల్ లాంటి సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో ఆఫర్లు విపరీతంగా వచ్చాయి.

సీత కి మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో సీత లాంటివారు కొద్దిమందే ఉండటం తో ఆమెకు ప్రాధాన్యత పెరిగింది. ఇక ఆమె 2002 చిత్రం మారన్ చిత్రంతో చిత్ర పరిశ్రమకు తిరిగి వచ్చింది. ఆమె 2005 లో రైటా తప్పా చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఆమె సినిమాలతో పాటు సీరియల్స్ తమిళ లో వేలం, సమరసం, పెన్, జననం,ఇదయం, తంతు విట్టన్ ఎన్నై వెబ్సెరీస్ లో దానితో పాటు మై పర్ఫెక్ట్ హస్బెండ్ అనే సిరీస్లో నటించింది అలానే ఇక మలయాళంలో స్వంతం మాలొట్టి , పెన్నింటే కథ, చేచియమ్మ లో నటించింది. ఇక సీత కి ఇద్దరు సోదరులు పండు, దుశ్యంత్ ఉన్నారు ఆమె తండ్రి మోహన్ బాబు కి నాటకాలు వేసిన అనుభవం ఉండటంతో అయినా సినిమాలో చిన్న పాత్రలు చేస్తుండేవారు ఆ విధంగా సీత కి కూడా సినిమాలో ఇంటరెస్ట్ చూపించింది.

ఆమె అద్భుతంగా నటిస్తుంది ఆమె నటనకు నంది అవార్డు లు సాధించింది, సీత కి అన్ని ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథ చిత్రాలు రావడం మొదలయ్యి కొన్ని ఏళ్ల పాటు తెలుగు, తమిళ భాషలో కొనసాగిన సీత ఆ తరువాత ఇతర హీరోయిన్లతో పోటీపడలేక చెల్లెలు, కోడలు అలా ఇతర పాత్రలో నటించింది మొదటినుంచి పద్దతిగానే ఉన్నారు కీర్తన తండ్రి వద్ద ఉండగా అభినయ తల్లి సీత దెగ్గర పెరిగింది. కీర్తన పెళ్లి కోసం సీత తన విభేదాలు అన్ని పక్కన పెట్టి పెళ్లి కార్యక్రమంలో పలుగొంది ఈ సందర్బంగా తల్లిదండ్రులు హోదాలో అన్ని ఆచారాలు పాటించారు. ఇక సీత ఒకపుడు హీరోయిన్ గా ఎంత పేరు సాధించిందో అలానే ఇపుడు తల్లి క్యారెక్టర్ లో కూడా చాలా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది అలా అందరు హీరోయిన్లు తల్లి పాత్రలు చేస్తున్నారు సీత కూడా వరస సీరియల్ ల ఆఫర్లతో దూసుకుపోతోందని చెప్పాలి.