యాక్టర్ హరితేజ డెలివరీ అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగ కి గురైంది అసలు కారణం ఏంటి?

బిగ్ బాస్ ఫేమ్ హరితేజ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షాకింగ్ వీడియో ని షేర్ చేసింది ఇటీవల ఆడ బిడ్డకి జన్మనిచ్చిన హరితేజ కోవిద్ వల్ల పడిన ఇబ్బందులు అన్ని తెలియ చేసింది సరిగ్గా డెలివరీ సమయం లో తనకి కరోనా సోకింది అనే విషయాన్ని తెలియ చేసింది తనతో పాటు తన కుటుంబం అందరికి కరోనా రావడంతో ఎలా బయపడింది తన బిడ్డ ని ఎలా కాపాడుకుంది అని చెప్తూ ఎమోషనల్ అయ్యింది హరితేజ నాకు పాపా పుటిందని చాలా ఆనందం లో ఉన్నాను చాలామంది విషెస్ అందించారు అందరికి ధన్యవాదాలు అయితే అందరికి సమాధానం ఇచ్చే పరిస్థితిలో అపుడు నేను లేను అందుకే ఇపుడు చెబుతున్నాను అయితే ఎందుకు నేను ఆ పరిస్థితిలో లేను అని చెప్పడానికి ఆ విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను నిజానికి పంచుకోవాల్సిన అవసరం లేదు కానీ బయట ప్రపంచం లో పరిస్థితులు చూస్తుంటే న్యూస్ చూస్తుంటే ఒకోకరు ఫోన్ చేసి ఇన్సిడెంట్స్ చెబుతుంటే భయం వేస్తుంది.

నేను కూడా కొన్ని చెప్పాలని అనుకున్నాను ఎందుకంటే నాకు జరిగింది చెప్తే కొంతమంది అయినా జాగ్రత్తలు పాటిస్తారని మారుతారని ఆలోచిస్తారేమో అని ఈ వీడియో చేస్తున్నాను. నాకు 9 నేలెలా ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు చాలా జాగ్రత్తగా ఉన్నాను మంచి ఆహారం తీసుకుంటూ ,యోగ చేస్తూ చాలా ఆరోగ్యం గా ఉన్నాను డెలివరీ కి వారం ముందు చెకప్ కి వెళ్ళినపుడు అంత బాగుంది నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు కరెక్ట్ గా వారం లో నా బిడ్డ బయటకి వస్తుందని చాలా కలలు కన్నాను అయితే ఎలా జరిగిందో ఎవరి ద్వారా జరిగిందో తెలీదు కానీ మా ఇంట్లో అందరికి కోవిద్ పాజిటివ్ వచ్చింది నేను కూడా టెస్ట్ చేపించుకున్నాను నాకు కూడా పాజిటివ్ వచ్చింది నాకు వెంటనే మైండ్ బ్లాక్ అయ్యింది ఏ స్టెప్ తీసుకోవాలో తెలియ లేదు కలలో కూడా ఊహించనిది జరిగింది ఎంత జాగ్రత్తగా ఉన్నాను అని పక్కన పెడితే మనకి రాలేదులే వచ్చినపుడు చూసుకుందాం అని ఉంటుంది చాలామందికి అలాంటి నాకు కూడా జరిగింది.

నేను జాగ్రత్తగా లేను ఏమో అని ఆ క్షణం లో అనిపించింది ఆ తరువాత నాకు సమస్యలు మొదలు అయ్యాయి డెలివరీ చేయము ఎందుకంటే మీకు కరోనా పాజిటివ్ కాబట్టి అన్నారు కోవిద్ హాస్పిటల్ లోకి వెళ్లామన్నారు బేబీ కోసం చాలా టెస్టులు చేసారు చాలా నిద్ర లేని రాత్రులు గడిపాను ఎమర్జెన్సీ సెక్షన్ చేయాలి నార్మల్ చేయడం కుదరదు అని అన్నారు తప్పని పరిస్థితిలో ఆపరేషన్ చేసారు నిజానికి డెలివరీ అంటే ఫామిలీ మెంబెర్ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కానీ నా డెలివరీ కి నేను నా భర్త ఇద్దరం మాత్రమే ఉండాల్సి వచ్చింది నాకు దైర్యం చెప్పేవాళ్ళు లేరు నేను ఒక్కదాన్ని పోరాడాల్సి వచ్చింది నాతో దీపు ఉన్నారు కానీ తాను ఒక్కరే చాలా చేయాల్సి వచ్చింది కోవిద్ వార్డ్ లో ఉండాల్సి వచ్చింది బేబీ పుట్టిన వెంటనే నా దగ్గర నుంచి తీసుకెళ్లిపోయారు ఎందుకు అంటే బేబీ కి నెగటివ్ వచ్చింది నాకు పాజిటివ్ కాబట్టి ఎఫెక్ట్ అవుతుందని తీసుకుపోయారు బేబీ కి పాలు కూడా ఇవ్వలేకపోయాను వీడియో కాల్స్ లో చూడాల్సి వచ్చింది.

ఆ సమయం లో చాలా బాధ అనిపించింది ఇంటికి వచ్చిన తరువాత కూడా అందరు ఐసొలేషన్ లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయం లో ఎవరి ఆరోగ్యం గురించి అడగలేని పరిస్థితి నా ఫ్రెండ్స్ దీపు ఫ్రెండ్స్ తోడు గా ఉన్నారు ఏదైనా మనకి జరిగితేనే కానీ జాగ్రత్త పదం ఇంత జరుగుతున్నా కూడా మనకి రాదులే అని ఫీలింగ్ ఉంటుంది అలాంటిది వద్దు వచ్చిన తరువాత బాధ పడేకంటే రాకుండా ఉండేలా చూసుకోవాలి ముఖ్యం గా ప్రెగ్నన్సీ తో ఉన్న ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా జరిగిన కూడా భయపడడు సమస్య వచ్చిన దానికి పరిస్కారం ఉంటుందని తెలుసుకోండి ఇంత జరుగుతున్నా కూడా చాలామంది మాస్క్లు లేకుండా బయట తిరుగుతున్నారు జాగ్రత్తలు పాటించండి ఎవరిని కలవాడు శక్తీ ని పెంచుకునే ఆహారం తినండి అని తెలియ చేసింది ప్రతి ఒక్కరిని కరోనా ఇలానే ట్రీట్ చేస్తుంది అని అనుకోలేం మా ఇంట్లో అందరికి నెగటివ్ వచ్చింది అందరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకొచ్చింది రవితేజ.