రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ బిసినెస్ కి ఎన్ని కోట్లు అయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు ?

ఆర్ఆర్ఆర్ పేరుతో ఎన్టీఆర్,రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పీరియాడిక్ యాక్షన్ ఫీల్ తెరకు ఎక్కుతున్న సంగతి తెలిసిందే, ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలుగు చారిత్రక వీరులు అయినా కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు లో నటిస్తున్నారు వీరికి జంటగా ఇంగ్లీష్ యాక్టర్ ఒలీవియా మోరిస్ హిందీ యాక్టర్ అలియా భట్ నటిస్తున్నారు.. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు ఒక 8 నెలలు వాయిదా పడింది, ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది అది ఆలా ఉంటె ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అనే విష్యం తెలిసిందే దీనితో ఈ సినిమాకు సంబంధించి ప్రీ -రిలీజ్ బిసినెస్ ఎన్నడూ జరగని తీరులో జరుగుతుంది.

ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు బారి మొత్తానికి అమ్ముడు అయినట్లు తెలుస్తుంది ప్రముఖ ఓటిటి సమస్త జీ5 ఆర్ఆర్ఆర్ అన్ని బాషల సాటిలైట్ డిజిటల్ హక్కులను సుమారు 325 కోట్లు రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది అయితే ఇంత బర్రిగా ధరకు ఒక సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పలకడం ఇదే మొదటిసారి అంటున్నారు దీనితో సినిమా ప్రీ – రిలీజ్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు అన్ని భాషలో తెలుగు తో పాటు తమిళ్,హిందీ ,కన్నడ, మలయాళం అన్ని భాషలో రానుంది అలానే తమిళనాడు, కేరళ, హిందీ, కర్ణాటక, ఓవర్సీస్ హక్కులు సాటిలైట్ డిజిటల్ రైట్స్ బిసినెస్ మొత్తం సుమారు 900 కోట్లు చేరిందని సమాచారం దీనితో ఇప్పటివరకు ఇండియా లో ఏ సినిమా కి జరిగాని బిసినెస్ ఈ సినిమాకి జరిగింది అంటున్నారు దీనిపై అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది.

ఇక్కడ గమనించాల్సిన మరో విష్యం ఏంటంటే ఆ మధ్య ఈ సినిమా కి సంబందించిన నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్ తో పాటు సాటిలైట్ రైట్స్ ని బాలీవుడ్ నిర్మాణ సమస్త పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ బారి మొత్తానికి దక్కించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడం ఏ కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ శాఖ సాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్లు గా ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ టీమ్ ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ ,రామ్ చరణ్ తో పాటు మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు దీనితో ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా బారి క్రేజ్ నెలకొని ఉండగా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకు ఎక్కిస్తున్నారు.

ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం దసరా పండగ సందర్బంగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది అయితే కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ లో చిత్ర బృందం ఇంకా చిత్రీకించాల్సిన భాగం చాలానే మిగిలి ఉందట రెండు పాటలు కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయాలనీ సమాచారం.. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడుతున్నట్లు తాజా సమాచారం దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ ,తమిళ్, కన్నడ ,మలయాళం భాషలో విడుదల కానుంది రాజమౌళి దర్శకత్వం లో సినిమా అంటే ఎంత పేరు ఉందొ ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ సినిమా పై బారి అంచనాలు ఉన్నాయ్ ఫాన్స్ ఎంతో ఎదురుచూస్తునారు అని తెలుస్తుంది.