రాజమౌళి మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఇదేనా?

మన టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ ఒక్క ఎత్తు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క ఎత్తు, కెరీర్ ప్రారంభం నుండి నేటి వరుకు ఆయన ప్రతి ఒక్క సినిమాని మాములు డైరెక్టర్ తో చేసి హిట్లు కొట్టినవే, స్టార్ డైరెక్టర్స్ అందరూ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ సినిమాలు చేస్తుంటాడు, ఈయన కెరీర్ మొత్తం మీద పని చేసిన అగ్ర దర్శకులు ఎవరైనా ఉన్నారా అంటే అది పూరి జగన్నాథ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే, వీళ్ళతో తప్ప ఇప్పటి వరుకు పవన్ కళ్యాణ్ మరో అగ్ర దర్శకుడితో సినిమా చెయ్యలేదు, ఇండస్ట్రీ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకొని కేవలం తన బ్రాండ్ ఇమేజి మీద కలెక్షన్స్ ని రప్పించుకోగల సత్తా ఉన్న డైరెక్టర్ రాజమౌళి గారు కూడ పవన్ కళ్యాణ్ తో సినిమా తియ్యడానికి అనేక ప్రయత్నాలు చేసాడు, పంజా సినిమా షూటింగ్ సమయం లో పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కలిసి స్టోరీ ని కూడా వినిపించాడు, ఆయనకీ ఆ కథ బాగా నచ్చినా కూడా ఇప్పటి వరుకు ఎందుకో ఆ సినిమా కార్య రూపం దాల్చలేదు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం తో వీళ్లిద్దరి కాంబినేషన్ మొత్తానికి అట్టకెక్కింది.

అయితే పంజా సినిమా సమయం లో పవన్ కళ్యాణ్ కి చెప్పిన స్టోరీ ఇదేనని ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక్క వార్త జోరుగా ప్రచారం సాగుతుంది,ఇక వివరాల్లోకి వెళ్తే అప్పట్లో పవన్ కళ్యాణ్ తో రాజమౌళి ఛత్రపతి శివాజీ జీవిత కథని తీద్దాం అనుకున్నాడు అట, భారీ స్కేల్ తారాగణంతో పాన్ ఇండియన్ మూవీ గ కనివిని ఎరుగని రీతిలో ఈ సినిమా తీద్దాం అనుకున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఇందులో నటించేందుకు ఆసక్తి చూపాడు, కానీ 2013 తర్వాత ఆయన పోలియుకెల్ ఎంట్రీ ఇవ్వడం, పొలిటికల్ ఎంట్రీ తర్వాత వేరే సినిమాలు కమ్మిట్ అవ్వడం , ఇక రాజమౌళి ప్రభాస్ తో బాహుబలి సినిమా ఒప్పుకోడం, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది, ఒక్కవేల ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో చేసిరి ఉంటె చరిత్ర లో ఎప్పటికి మర్చిపోలేని సినిమా గా మిగిలేది, అయితే గత కొద్దీ రోజుల నుండి పవన్ కళ్యాణ్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో ఒక్క సినిమా రాబోతుంది అని,రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ ని కూడా సిదాం చేసేసాడు అని వార్తలు వినిపిస్తున్నాయి, ఓపక్కవేల వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తే ఛత్రపతి శివాజీ స్టోరీ తోనే పోతారా, లేకపోతే వేరే కథ తో ప్రేక్షకుల ముందుకి వస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

ఇది ఇలా ఉండగా రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ తో ఆర్ ఆర్ ఆర్ సినిమా తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతుంది, దీని తరువాత ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చేయనున్నాడు, ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాత రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడు అని విశ్వసనీయ వర్గాల సమాచారం,ఈ కాంబినేషన్ కోసం అభిమానులు దాదాపుగా ఒక్క దశాబ్దం నుండి ఎదురు చూస్తున్నారు,ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే నెల 9 వ తారీఖున విడుదలకి సిద్ధం గా ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే,దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్నా పవన్ కళ్యాణ్ సినిమా కావడం తో ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయికి చేరాయి, గత రెండు రోజుల నుండి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభించేసాడు, మరి భారీ అంచనాల నడుమ వచ్చే నెల విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఫాన్స్ ని ఎలా అలరిస్తుందో చూడాలి.