రాపాక వరప్రసాద్ పరిస్థితి ఎలా మారిపోయిందో మీరే చూడండి

2019 సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఘోరమైన పరాజయం పాలైన సంగతి మన అందరికి తెలిసిందే, స్వయంగా ఆ పార్టీ అద్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం ఆయన అభిమా ఆకులను తీవ్రమైన దుఃఖం లోకి నెట్టేసింది,ఈ ఎన్నికలలో కేవలం రాజోలు నియోజకవర్గం నుండి రాపాక వరప్రసాద్ మాత్రమే జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యే గా గెలుపొందాడు, అయితే ఎన్నికలలో గెలిచినా తర్వాత నేను గాజు గ్లాస్ గుర్తు మీదనే గెలిచాను, జీవితాంతం పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లోనే నేను నడుస్తాను అంటూ చెప్పొచ్చాడు, కానీ అతను చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు ఎక్కడ పొంతన కనపడకుండా పోవడం మొదటి రోజు అసెంబ్లీ సమావేశం లోనే అర్హం అయ్యిపోయింది, అసెంబ్లీ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నేటి వరుకు ఆయన వైసీపీ పార్టీ తరుపనే మాట్లాడుతూ వచ్చాడు, అటు జనసేన పార్టీ కి రాజీనామా చెయ్యకుండా ఆ పార్టీలోనే ఉంటూ జగన్ జపం చేస్తూ జనసేన పార్టీ కి తీరని న్బస్తాం కలిగించేలా చేసాడు రాపాక వరప్రసాద్, ఈయన నేరుగా అధినేత పవన్ కళ్యాణ్ పైనే వ్యంగ్యాస్త్రాలు సంధించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి, నేను నా నియోజక వర్గం లో ఒంతగా గెలిచాను అని, పవన్ కళ్యాణ్ బలంతో గెలవలేదు అని, ఆయనే తన సొంత స్థానాల్లో గెలవలేకపొయ్యాడు అని రాపాక వరప్రసాద్ అప్పట్లో చేసిన ఒక్క వీడియో సోషల్ మీడియా లో ఎలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే పంచాయితీ ఎన్నికలు రానే వచ్చాయి, రాజోలు నియోజక వర్గం పరిధిలో ఉన్న ప్రతి గ్రామం తిరిగి వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా రాపాక వరప్రసాద్ ప్రచారం చేసాడు, కానీ ఎవ్వరు ఊహించని విధంగా 45 పంచాయితీ స్థానాలు గల రాజోలు నియోజక వర్గం లో జనసేన పార్టీ ఏకంగా 26 స్థానాలను కొల్లగొట్టి రాపాక వరప్రసాద్ కి కంటి మీద కునుకు లేకుండా చేసింది, జనసేన ఓడిపోయిన స్థానాల్లో కూడా కేవలం ఒక్కటి రెండు వోల్టా తేడా తోనే ఓడిపోయింది, కేవలం తన బలంతోనే గెలిచాను అని ఊహల్లో తేలుతున్న రాపాక వరప్రసాద్ ని నెల మీదకి నిల్చునేలా చేసారు రాజోలు ప్రజలు, ఈ ఫలితాల దెబ్బకి రాపాక వరప్రసాద్ ఊర్లల్లోకి కూడా అడుగుపెట్టలేదు అట, ఇటీవల రాజోలు నియాజక వర్గం లో జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెంలా మనోహర్ నిర్వహించిన భారీ బహిరంగ సభకి రాపాక వరప్రసాద్ ని రావొద్దు అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిన సంగతి మన అందరికి తెలిసిందే, రాపాక వరప్రసాద్ వర్గీయుల నుండి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడడం తో రాపాకి కి తన భవిష్యత్తు ఏమిటో అర్థం కాక సతమతం అవుతున్నాడు అట.

సొంత నియోజగా వర్గం లో రాపాక వరప్రసాద్ కి ఏర్పడిన వ్యతిరేకత చూసి వైసీపీ పార్టీ అతనిని మెల్లగా దూరం పెట్టె ప్రయత్నం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం, ఇక ఇతను చేసిన పనికి జనసేన పార్టీ నుండి కూడా తదుపరి ఎన్నికలలో టికెట్ రావడం అసంభవం, ఇక తన రాజకీయ భవిష్యత్తు కనసాగడం ఎలా అని రాపాక వరప్రసాద్ తన సన్నిహితుల మధ్య వాపోయాడు అట,అనవసరం గా జనసేన పార్టీ లో ఉంటూ వైసీపీ కి సపోర్టు చేసి చాలా పెద్ద పొరపాటు చేశాను, పవన్ కళ్యాణ్ గారికి జనాల్లో ఇంత ఆదరణ ఏర్పడింది అని నేను గ్రహించలేకపొయ్యాను అంటూ రాపాక వరప్రసాద్ వాపోతున్నాడు అట, ఎలా అయినా వైసీపీ పార్టీ ద్వారానే తదుపరి ఎన్నికలలో ఎమ్యెల్యే సీటు దక్కించుకోవాలనే కుతుహులం తో రాపాక వరప్రసాద్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం, కానీ జగన్ మాత్రం రాపాక ని ఇప్పుడు పట్టించుకోవట్లేదు అట, పాపం రాపాక పరిస్థితి ఇలా తిరగబడిపోతుంది అని ఆయన కలలో కూడా ఊహించి ఉండదు.