రామ్ చరణ్ కి గుడి కట్టబోతున్న ప్రముఖ స్టార్ కమెడియన్

మన టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తొలి సినిమా తోనే స్టార్ హీరో సినిమా రేంజ్ వసూళ్లను సాధించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్, రెండవ సినిమా మగధీర తో ఇండస్ట్రీ రికార్డ్స్ ని ఎలా బద్దలు కొట్టాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,అలా అతి తక్కువ సినిమాలతోనే విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న రామ్ చరణ్ కి ఒక్క తెలుగులోనే కాదు హిందీ తమిళం లో కూడా మంచి క్రేజ్ ఉంది, ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు అయితే రామ్ చరణ్ సినిమాలను ఎగబడి మరీ చూస్తారు,అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి తో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, షూటింగ్ ప్రారంభం నుండే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది, ఇది ఇలా ఉండగా టాలీవుడ్ టాప్ కమెడియన్ సత్య ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

కమెడియన్ సత్య కి ఇప్పుడు టాలీవుడ్ లో ఎంత డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇప్పుడు ఏ పెద్ద సినిమా లో చూసిన సత్యనే ఉంటున్నాడు, ఒక్కప్పుడు సునీల్ ని చూడంగానే ఎలా అయితే నవ్వు వచ్చేదో, కమెడియన్ సత్య ని చూస్తే కూడా అంతే నవ్వు వస్తది అనడం లో ఎలాంటి సందేహం లేదు, అయితే ఇటీవల ఈయన నటించిన శ్రీకారం చిత్రం విడుదల అవ్వగా, ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది, ఆయన మాట్లాడుతూ ‘రామ్ చరణ్ గారు ఎప్పుడు ఇతరులకు సహాయం చెయ్యడం లో ముందు ఉంటారు, అఆయన చేసిన సహాయాలు ఎప్పుడు కూడా బయట చెప్పుకోడానికి ఇష్టపడడు,నేను ఆర్టిస్టు గా కెరీర్ ప్రారంభం లో ఘోరమైన స్ట్రగుల్స్ ని ఎదురుకున్నాను, ఆ సమయం లో రామ్ చరణ్ నాకు డబ్బు సహాయం కూడా ఎంతో చేసాడు, ఇలా ఆయన ఎంతో మంది ఆర్టిస్టులకు సహాయం చేసాడు, గెటప్ శ్రీను కి కూడా రామ్ చరణ్ ఆర్థికంగా ఎంతో సహాయం చేసాడు, గెటప్ శ్రీను అయితే రామ్ చరణ్ కి గుడి కట్టే పని లో ఉన్నాడు’ అంటూ రామ్ చరణ్ ని ఆకాశానికి ఎత్తేసాడు సత్య.

ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పటికే రామ్ చరణ్ కి సంబంధించిన టీజర్ కి అటు అభిమానుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇక మార్చి 27 వ తారీఖున రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం అల్లూరి సీత రామ రాజు గెటప్ లో రామ్ చరణ్ పోస్టర్ ని విడుదల చెయ్యబోతున్నారు అట, ఈ విషయాన్నీ స్వయంగా ఆ చిత్ర బృందం ప్రకటించింది,ఇప్పటికే టీజర్ లో రామ్ చరణ్ లుక్ ని చూసి ఫుల్లు హ్యాపీ గా ఉన్న అభిమానులు అల్లూరి సీతారామ రాజు గెటప్ లో రామ్ చరణ్ ఎలా ఉంటాడో చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా రామ్ చరణ్ పుట్టిన రోజునే జరగబోతున్నట్టు సమాచారం, ఇక వీటితో పాటు రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న ఆచార్య సినిమాలో ఒక్క ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా ఈ ఏడాది మే 13 వ తేదీన విడుదల కాబోతుంది.