లాక్ డౌన్ సమయంలో బయటకి వచ్చిన హీరో నిఖిల్ ని పోలీసులు ఎం చేసారో తెలుసా?

తెలంగాణ సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు చాలా రోజుల నుండి పోలీసులు రాష్ట్రంలో కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు ఉదయం పది గంటల తరువాత రోడ్ల పైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు లాక్ డౌన్ సమయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు సరైన కారణం లేకుండా ఎవరైనా రోడ్ల పై ప్రయాణిస్తుంటే వారి వాహనాలను పట్టుకుంటున్నారు. ఈ పాస్ తీసుకుని బయటకి రావాలి అంటున్నారు కరోనా కట్టడి కోసం పోలీసులు ఈ కఠినమైన నియమాలను తెలంగాణలో అమలు చేస్తున్నారు ఎవరిని బయటకి రాకుండా నియంత్రిస్తున్నారు తాజాగా ఈరోజు తమవారికి అత్య అవసరమైన మందులు వైద్య సామాగ్రి అవసరం కావడంతో వాటిని తీసుకుని కార్ లో ప్రయాణిస్తున్న హీరో నిఖిల్ వాహనాన్ని పోలీసులు ఆపారు అని తన అనుభవాన్ని హీరో నిఖిల్ సోషల్ మీడియాతో పంచుకున్నారు.

ఉప్పల్ నుండి కిమ్స్ మంత్రి రహదారికి అత్యవసరంగా ప్రాణాలను రక్షించే మందులను అందించేందుకు కార్ లో బయలుదేరాను ప్రిస్క్రిప్షన్ మరియు పేషెంట్ వివరాలని పోలీసులకు తాను అందించినప్పటికీ నన్ను ఆపారు ఈ పాస్ పొందామని అడిగారు దీనితో ఆన్‌లైన్ లో 9 సార్లు ప్రయత్నించాను కానీ సర్వర్ డౌన్ అయ్యింది వైద్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితిలో అనుమతించ పడుతాయి అని నేను అనుకున్నాను అంటూ హీరో నిఖిల్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. లాక్ డౌన్ లో కరోనా కట్టడికి పోలీసులు ఈ పాస్ తీసుకుని బయటకి రావాలి అంటున్నారు. నిఖిల్ ట్వీట్ చేసిన వెంటనే హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్ లో స్పందించారు ప్రియమైన సర్ దయ చేసి మీరు ఉన్న ప్రదేశాన్ని పంచుకోండి మేము సమస్య పరిష్కరించడానికి సంబంధిక స్థానిక పోలీసులకు తెలియ చేస్తాము ధన్యవాదాలు అని ట్వీట్ చేసారు.

అవసరమైన వివరాలను తాను మెయిల్ చేశాను అని నిఖిల్ తెలిపారు. నిఖిల్ సమ్యసను పోలీసులు తీర్చి ఆయనకి పంపించడంతో సమస్య పరిష్కారం అయ్యింది అవసరమైన వారికీ హీరో నిఖిల్ మందుని అందు చేసారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ వైద్య సామాగ్రి అవసరమైన వారికీ బంధువులు, సహాయం కావలిసిన వారికి హీరో నిఖిల్ సహాయం చేస్తున్నారు కోవిద్ రోగులకు మరియు వారి బందువులకు నిఖిల్ మందులు ఇతర అవసరాలను తీరుస్తున్నారు.ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2 , 18 పేజెస్ సినిమాలు చేస్తున్నారు లాక్ డౌన్ కారణంగా ఈ షూటింగ్ వాయిదా పడాయి. ఇక నిఖిల్ సిద్ధార్థ్ హైదరాబాద్ లో పుట్టి పెరిగారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు, ఆ తరువాత ముఫాఖం జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసారు.

నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా నిఖిల్ ప్రారంభించాడు. శేఖర్ కమల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ చేసే ముందు వివిధ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు.స్వామి రారా సినిమాతో పేరు తెచ్చుకున్నారు. కార్తికేయ సినిమా మంచి హిట్ ని తెచ్చింది.ఆ తరువాత సూర్య ,ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు 38 కోట్లు వాసులు చేసింది అలానే కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం,కేశవా, యువత, వీడు తేడా,డిస్కో ఓం శాంతి, ఆలస్యం అమృతం,శంకరాభరణం,కలవారు కింగ్ అలా చాలా సినిమాలు చేసినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రమే హిట్ ని తెచ్చాయి. నిఖిల్ సినిమాలో హీరో నే కాదు నిజ జీవితం లో కూడా హీరోగా అందరికి సహాయం చేయాలనీ ప్రయత్నిస్తున్నారు నిఖిల్ మాత్రమే కాదు తన ఫాన్స్ కూడా కోవిద్ బారాణా పడిన వారు కూడా త్వరగా అందరు కోలుకోవాలని తన ఫాన్స్ కూడా కోరుకుంటున్నారు.