లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమాకుల చేసిన పనికి చిరంజీవి గారు ఏం చేసారో తెలుసా !

2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నాగరాజు క్యారెక్టర్ లో నటించి తెలంగాణ భాషలో మాట్లాడి అందరిని ఆ క్యారెక్టర్ తో అక్కటుకునేలా చేసారు సుధాకర్ కొమాకుల.. తన మొదటి సినిమా మనసుతో, సీనియర్ నటుడు బ్రహ్మానందం గారితో ఒక వీ చిత్రం లో సపోర్టింగ్ రోల్ లో నటించారు ఆ తరువాత సినిమాలకి కాస్త దూరం గా ఉన్నారు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తో ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా మంచి హిట్ ని ఇచ్చింది ఆ తరువాత హ్యాంగ్ అప్, ఉందిలే మంచికాలం ముందు ముందునా, కుందనపు బొమ్మ, నువ్వు తోపు రా సినిమాలో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు అటు ఆక్షన్ ఆ కాకుండా డాన్స్, సింగర్ గా కూడా మంచి గుర్తుమ్పు వచ్చింది .

సుధాకర్ హీరో విజయ దేవరకొండ కి క్లోజ్ ఫ్రెండ్ లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ తో పాటు సుధాకర్ కలిసి నటించారు. సుధాకర్ హారిక అనే అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ప్రస్తుతం వీళ్ల ఇద్దరు అమెరికా లో ఉంటున్నారు. సుధాకర్ కి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం ఇటీవలే చిరంజీవి గారి 65వ పుట్టినరోజు సందర్బంగా చిరు గారి ఛాలెంజ్ సినిమాలో ఇందువదనా పాటకి సుధాకర్ వాలా భార్య హారిక తో కలిసి డాన్స్ చేసి చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం తో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఆ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది. ఆ పాట చిరంజీవి గారు చూసి స్వయం గా సుధాకర్ తో మాట్లాడి అతని భార్య హారిక ని చాలా కూడా ఎంతో ప్రశంసించారు.

ఇండస్ట్రీ తో ఎటువంటి సంబంధం లేని ఒక ఐటీ ప్రొఫెషనల్ అమ్మాయి ఇంత పర్ఫెక్ట్ గా స్టెప్స్ వేయడం అనేది చిరంజీవి గారికి ఎంతో ఆనందం కలిగించింది అని ఈ జంటను పొగిడేశారు. చిరంజీవి గారి పాటకి డాన్స్ వేసి ఆయనతో ప్రశంసలు పొందటం మాములు విష్యం కాదని ప్రేక్షకులు అభిమానం పొందటం కూడా చాలా సంతోషంగా ఉందని సోషల్ మీడియా తో వీడియో షేర్ చేసారు.. సుధాకర్ గారి సపోర్ట్ వల్ల విజయ్ దేవరకొండ సినిమాలో ఇండస్ట్రీ కి రావడం అనేది చాలా సపోర్ట్ ఇచ్చారని మూవీ ప్రమోషన్ లో తెలియ చేసారు.. సుధాకర్ ఫోటోషూట్ తీయడం వల్ల సినిమాలో అవకాశాలు బాగా వచ్చాయి అని గొప్ప వ్యక్తి అంటూ ఎప్పటికి తోడుగా ఉంటారని విజయ్ దేవరకొండ నువ్వు తోపు రా సినిమా ప్రమోషన్ లో తెలియ చేసారు.

బిగ్ బాస్ షో అంటే సుధాకర్ కి చాలా ఇంటరెస్టింగ్ గా ఉందని ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని అన్ని సీసన్ లు చూసారు, అయితే బిగ్ బాస్ 4 తో తన ఫేవరెట్ అభిజీత్ అని 9 సంవత్సరాల నుండి స్నేహితులు గా ఉన్నారని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా రాకముందు సంవత్సరం ముందు నుంచి పరిచయం అని చెప్పారు.. అభిజీత్ కంటెస్టెంట్ గా రావడం అనేది చాలా హ్యాపీ గా ఉందని బయట ఆలా ఉన్నాడో ఇంట్లో కూడా అలానే ఉన్నాడని బాగా ఆడుతున్నారని, విన్నర్ అవ్వాలని చాలా సపోర్ట్ చేసారు చాలా డీసెంట్ గా ఉంటూ పెద్దలకి గౌరవం ఇస్తారని తనకి సొంత కంపెనీ ఉందని చాలా డీసెంట్ గా హేండిల్ చేసారని బిగ్ బాస్ తో రైట్ పర్సన్ అని చెప్పారు. ఇక అభిజీత్ విన్నర్ అయ్యాక చాలా ఆనందపడ్డారు. తన సక్సెస్ ని ఫాన్స్ తో పంచుకున్నారు ఆ ఫొటోస్ సోషల్ మీడియా తో వైరల్ అవుతున్నాయి.