వంటలక్క భర్త ఎవరో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుధి

తెలుగు బుల్లితెర పై కొన్ని సీరియల్స్ ని అన్ని వర్గాల పేక్షకులు ఎలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ప్రేక్షకుల ఆధారణని బట్టి ఆయా సీరియల్స్ సంవత్సరాల కొద్దీ నడుస్తూనే ఉంటాయి, అలాంటి సీరియల్స్ ని మనం చిన్నప్పటి నుండి ఎన్నో చూసి ఉంటాము,ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ కూడా అదే స్థాయి లో విజయం సాధించిన సీరియల్స్ లో ఒక్కటిగా గుర్తించవచ్చు, సాధారణంగా సీరియల్స్ ని లేడీస్ మాత్రమే ఎక్కువ చూస్తుంటారు అని అందరూ అంటూ ఉంటారు, కానీ ఈ కార్తీక దీపం సీరియల్ ని మగవాళ్ళు కూడా ఎగబడి చూడడం విశేషం, స్టోరీ లైన్ మామూలుడే ఆయన, స్క్రీన్ ప్లే పరంగా తర్వాత ఏమి జరుగుతుంది అనే ఆత్రుతని దర్శకుడు రాజేంద్ర జనాల్లో కలిగించడం వల్లే ఈ సీరియల్ అంత పెద్ద విజయం సాధించడానికి కారణం, ఇక ఈ సీరియల్ లో వంటలక్క పాత్రకి ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ పాత్ర చేసిన ప్రేమి విశ్వనాధ్ కి ఫామిలీ ఆడియన్స్ లో ఏర్పడిన క్రేజ్ ఇటీవల కాలం లో ఏ సీరియల్ నాటికీ కానీ నటుడికి కానీ రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఇది ఇలా ఉండగా ప్రేమి విశ్వనాధ్ అలియాస్ వంటలక్క గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము,వంటలక్క భర్త మరెవరో కాదు, ప్రపంచం లోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గొప్ప జోతిష్య నిపుణుడు అయినా డాక్టర్ వినీత్ భట్, ఈయన మన అందరికి సుపరిచితమే, తన భర్త ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే తాను నటిగా ఈ స్థాయికి చేరుకోగలిగాను అని, ఆయన ఇచ్చిన ప్రోత్సహం ని నేను ఎప్పటికి మర్చిపోలేను అని ప్రేమి విశ్వనాధ్ అనేక ఇంటర్వూస్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే,వీళ్లిద్దరికీ సంబంధించిన ఫోటో ని మీరు క్రింద ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు, కేరళలో పుట్టి పెరిగిన ప్రేమి విశ్వనాధ్ మలయాళం దాదాపుగా 9 మలయాళం సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది, అక్కడ అన్ని సీరియల్స్ లో నటించిన రాని క్రేజ్ మరియు క్రేజ్, ఫేమ్ కేవలం కార్తీక దీపం సీరియల్ తో సంపాదించుకుంది ప్రేమి విశ్వనాధ్.

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్ ఇప్పటి వరుకు వెయ్యి ఎపిసోడ్స్ కి పైగా పూర్తి చేసుకుంది,ఇంకా 400 ఎపిసోడ్స్ పైగానే ఉంటుంది అట,ఇక ఈ సీరియల్ క్లైమాక్స్ పై సాయిల్ మీడియా లో రకరకాలుగా వినిపిస్తున్నాయి,క్లైమాక్స్ కి జనాలు అందరూ కంటతడి పెట్టేవిధంగా డైరెక్టర్ ప్లాన్ చేసాడు అట, ఇక అసలు విషయానికి వస్తే క్లైమాక్స్ లో వంటలక్క పాత్ర చనిపోతుంది అని, డాక్టర్ బాబు వంటలక్క ని అర్థం చేసుకొని తన దగ్గరకి వచ్చేలోపు వంటలక్క తన ప్రాణాలను విడిచి వేస్తుంది అని, డాక్టర్ బాబు మోనిత నిజస్వరూపం తెలుసుకొని మోనిత ని తిరస్కరించేలోపు ఆమె కూడా అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది అని రకరకాలుగా వార్తలు వచ్చాయి, మరి లక్షలాది అభిమానులను సంపాదించుకున్న వంటలక్క చనిపోతే జనాలు తీసుకోగలరా అనేది ప్రశ్న, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.