వకీల్ సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ పై ప్రభాస్ సెన్సషనల్ కామెంట్స్

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా మేనియానే కనిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,మూడేళ్ళ తర్వాత ఒక్క నెంబర్ 1 హీరో సినిమా విడుదల అయితే ఎలా ఉంటుందో, దానికి పదింతలు యుఫొరియా ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాకి కనిపిస్తుంది,మూడు సంవత్సరాలు సినిమాలు చెయ్యకపోయినా, 8 ఏళ్ళ నుండి సరైన హిట్టు లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అనడానికి ఇది ఒక్క నిదర్శనం అని చెప్పొచ్చు,ఏప్రిల్ 9 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఇటీవలే హైదరాబాద్ లోని శిల్ప కళావేదిక లో అంగరంగ వైబవంగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జీవితాంతం గుర్తి ఉంది పోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాస్ లో తెరిచిన సంగతి మన అందరికి తెలిసిందే, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి చోట టికెట్స్ అన్ని హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి,బాహుబలి సినిమా తర్వాత అంతతి రాజ్ ని ఈ ఇనిమకే చూస్తున్నాము అని డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఈ సందర్భంగా తెలిపారు.

ఇక వకీల్ సాబ్ మేనియా కి ఒక్క అభిమానులు, ప్రేక్షకులే కాదు, టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు,ఒక్క మాములు రీమేక్ సినిమాకి పవర్ స్టార్ వంటి స్టార్ తోడు అయితే దాని ఫలితం ఇలాం ఉంటుంది అని , ఇలాంటి క్రేజ్ ఇంతకుముందు పాన్ ఇండియన్ లెవెల్ లో భారీ హైప్ తో విడుదల అయినా సినిమాలకి తప్ప , ఒక్క మాములు ఆఫ్ బీట్ సినిమాకి ఎప్పుడు ఈ రేంజ్ చూడలేదు అని, పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఒక్క దండం అంటూ ఎంతో మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు, వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఒక్కడు, ఈయన క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్ లో ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అలాంటి స్టార్ పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడడం విశేషం, ఈయన ర్తన స్నేహితులు వంశి ప్రమోద్ తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ లో చాలా థియేటర్స్ ని నడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే,డిస్ట్రిబ్యూషన్ రంగం లో కూడా వీళ్ళు ఇప్పుడు గొప్పగా రాణిస్తున్న వారిలో ఒక్కరు, లాభాల్లోనూ మరియు నష్టాల్లోనూ ప్రభాస్ తో వీళ్ళు పంచుకుంటూ ఉంటారు.

అయితే యూవీ క్రియేషన్స్ వాళ్ళు గుంటూరు ప్రాంతం లో వకీల్ సాబ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి మన అందేరికి తెలిసిందే, టిక్కెట్టు ధర 300 రూపాయిలు పెట్టిన కూడా జనాలు ఏ మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా బుకింగ్స్ చేసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు, ప్రస్తుతం వకీల్ సాబ్ కి నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని వంశి మరియు ప్రమోద్ లు ప్రభాస్ కి తెలియచెయ్యగ ఆయన ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యాడట, చాలా సెంటర్స్ లో ఇంత రేట్స్ కి బాహుబలి సినిమా కూడా ఫుల్ అవ్వలేదు వకీల్ సాబ్ ఎలా ఫుల్ అవుతున్నాయి అంటూ ప్రభాస్ వాళ్ళతో అన్నాడట, ఇక దిల్ రాజు కి కూడా ప్రభాస్ ఫోను చేసి సినిమా మీద హైప్ మాములుగా లేదు అండీ, కచ్చితంగా రికార్డ్స్ ని బద్దలు కొడుతాది అంటూ దిల్ రాజు కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసాడు అట, మరి ఇంతలా విడుదలకి ముందే జనాల్లో ఆసక్తిని రేపిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 న ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.