వకీల్ సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఈ సందర్భంగా నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎలాంటి అద్భుతమైన స్పందన లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ ఈవెంట్ లో దిల్ రాజు మార్త్లదిన మాటలు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు , మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ భక్తుడు మరియు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు యూట్యూబ్ అంతటా ట్రేండింగ్ అవుతున్నాయి, ముఖ్యంగా బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు అభిమానులకు పూనకాలు రప్పించేలా చేసింది, ఇక దిల్ రాజు మాట్లాడిన మాటల్లో సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అర్థం అవుతుంది, ఇలా పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రతి ఒక్క విష్యం పాజిటివ్ ఫీలింగ్ కలిగించిన ఏకైక సినిమాగా అత్తారింటికి దారేది తర్వాత వకీల్ సాబ్ చిత్రం కి అలా అనిపించింది, ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడం తో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెన్ చెయ్యగా , అడ్వాన్స్ బుకింగ్స్ తెరిచినా ప్రతి చోట హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి, ఒక్కసారి అడ్వంయాస్ బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉందొ ఇప్పుడు మనం ఈ కథనం లో చూడబోతున్నాము.

శనివారం నుండి హైదరాబాద్ లో వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని కొన్ని థియేటర్స్ లో విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, బుకింగ్స్ తెరిచిన క్షణం నుండే నిమిషాల వ్యవధిలోనే వేల కొద్ది టికెట్స్ అమ్ముడుపోవడం నిర్మాతలను మరియు డిస్ట్రిబ్యూటర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం, ముఖ్యంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్ ఏఎంబీ సినిమాస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసిన 5 నిమిషాల్లోనే దాదాపుగా 20 షోస్ హౌస్ ఫుల్ అయిపోవడం,మహెష్ బాబు ని సైతం ఆశ్చర్యానికి గురి చేసినా విషయం, సినిమాకి క్రేజ్ మాములుగా లేదు అని ,మా థియేటర్ లో వకీల్ సాబ్ సినిమా ఆల్ టైం రికార్డు సృష్టించింది అని మహేష్ బాబు దిల్ రాజు కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసినట్టు ఫిలిం నగర్ లో గట్టిగ వినిపిస్తున్న టాక్,ఇక అమెరికా బాక్స్ ఆఫీస్ లో కూడా వకీల్ సాబ్ ప్రీమియర్ షోస్ కి కనివిని ఎరుగని అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతూన్నాయి అట, కచ్చితంగా ప్రీమియర్స్ గ్రాస్ లో ఆల్ టైం రికార్డు సృష్టిస్తుంది అని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ బలమైన నమ్మకం తో ఉన్నారు.

ఇక వకీల్ సాబ్ ట్రైలర్ కి మొన్న ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఇటీవల కాలం లో ఈ స్థాయి రెస్పాన్స్ రప్పించుకున్న ట్రైలర్ రాలేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు,కేవలం మొదటి రోజే 22 మిలియన్ వ్యూస్ ని 10 లక్షలకి పైగా లైక్స్ ని సంపాదించుకున్న ఈ ట్రైలర్, కేవలం వారం రోజుల్లోనే మూడు కోట్ల 50 లక్షల వ్యూస్ ని కైవసం చేసుకొని ఆల్ టైం రికార్డు సృష్టించింది,ఒక్క బాహుబలి ట్రైలర్ కి మినహా ఇప్పటి వరుకు మరో టీజర్ కి కానీ ట్రైలర్ కి కానీ ఈ స్థాయి వ్యూస్ రాలేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు,దీనిని బట్టి అర్హం చేసుకోవబచు, పవర్ స్టార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ చెప్పడానికి, కనివిని ఎరుగని భారీ అంచనాలతో ఏప్రిల్ 9 వ తేదీన విడుదల అవ్వబోతున్న వకీల్ సాబ్ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.