వకీల్ సాబ్ ఆరు రోజుల కలెక్షన్స్ చూస్తే మెంటలెక్కిపోతారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9 వ తేదీన అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదల అయినా కూడా సూపర్ హిట్ టాక్ ని కైవారం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనక వర్షం కురిపించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా విడుదల అయినా రోజు నుండి నేటి వరుకు ఒక్క పక్క కరోనా మహమ్మారి విజృంభణ ని తట్టుకొని, మరోపక్క జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర రాజకీయాలను నిలదొక్కుకొని రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది,పవన్ కళ్యాణ్ సినిమాకి టాక్ వస్తే ఎన్ని అవరోధాలు వచ్చిన నిలబడవు అని మరోసారి నిరూపితమైంది, గతం లో కూడా 2013 వ సంవత్సరం లో అత్తారింటికి దారేది సినిమా కి కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదురు అయ్యినప్పటికీ పవన్ కళ్యాణ్ స్టామినా వల్ల అది ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది, ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రం విష్యం లో కూడా అదే రిపీట్ అవ్వడం తో ట్రేడ్ పండితులు అసైతం ఆశ్చర్యానికి గురి అయ్యారు.

ఇక మొదటి రోజు ఈ సినిమా బెన్ఫిట్ షోలు ఏమి లేకుండా 32 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యగా, రెండవ రోజు 12 కోట్ల రూపాయిలు , మూడవ రోజు 11 కోట్ల రూపాయిలు వసూలు చేసి కేవలం మూడు రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కలిపి 55 కోట్ల రూపాయిలు షేర్ వసూలు చేసింది, సాధారణంగా ఇలాంటి షేర్లు కేవలం సంక్రాంతి సినిమాలకు మాత్రమే వస్తుంటాయి, కానీ వకీల్ సాబ్ కి వచ్చే కలెక్షన్స్ సంక్రాంతి సినిమాలకు మించి ఉండడం తో పవన్ కళ్యాణ్ స్టామినా చూసి ప్రతి ఒక్క విశ్లేషకుడు ఆశ్చర్యపోతున్నారు, ఇక సోమవారం నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం, ఉగాది రోజు మళ్ళీ విజృంభించింది,ఉగాది రోజు ఈ సినిమా ఏకంగా 10 కోట్ల రూపాయిలు వసూలు చేసి ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది, టికెట్ రేట్స్ భారీగా తగ్గించిన కూడా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం టాలీవుడ్ లో ఒక్క పవర్ స్టార్ కి మాత్రమే చెల్లింది అని ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు, ఇక ఆరవ రోజు ఈ సినిమా నాలుగు కోట్ల 88 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా ఆరు రోజులకి కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయిలు వసూలు చేసింది.

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్థాయి సంచలనం సృష్టిస్తున్న వకీల్ సాబ్ సినిమా పై సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి కొన్ని గాసిప్స్ షికారు చేస్తున్నాయి, అదేమిటి అంటే వకీల్ సాబ్ సినిమా ఈ నెల 23 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు అని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రాబోతున్నాయి అని పుకార్లు షికార్లు చేసాయి, అయితే ఈ పుకార్లను గమనించిన దిల్ రాజు వెంటనే ఒక్క వీడియో ద్వారా స్పందించాడు ,ఆయన మాట్లాడుతూ ‘వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో రికార్డు బద్దలు కొడుతూ చరిత్ర తిరగరాస్తుంది, అలాంటి సినిమాని అంత తొందరగా ఎలా ఓ టీ టీ లోకి వదులుతాము, దయచేసి సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని పట్టించుకోకండి, వకీల్ సాబ్ ని 50 రోజుల వరుకు వదిలేది లేదు, ఆంధ్రప్రదేశ్ లో మా సినిమాకి ఎవ్వరు ఎన్ని అడ్డంకులు పెట్టాలి అని చూస్తున్న కూడా పవర్ స్టార్ స్టామినా ముందు ఆ అడ్డంకులు అన్ని పవర్ స్టార్ ముందు నిలబడలేకపోయింది’ అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడాడు.