వకీల్ సాబ్ కి ఎదురు అవుతున్న ఇబ్బందుల గురించి దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇటీవలే విడుదల అయ్యి ఎంతతి ఘానా విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఏప్రిల్ 9 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా తోలి ఆట నుండే అభిమానుల అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ ప్రభంజనం సృష్టించింది,ఒక్క పక్క కరోనా మహమ్మారి సెకను వేవ్ లో తన ప్రతాపం చూపిస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఈ సమయం లో కూడా పవన్ కళ్యాణ్ సినిమా చూడడం కోసం తండోపతండాలుగా థియేటర్స్ వైపు జనాలు పరుగులు తీస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు, ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వకీల్ సాబ్ సినిమాకి ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,కొన్ని చోట్ల థియేటర్స్ కూడా మూత పడిన సందర్భాలు ఉన్నాయి, అయినా కూడా అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది వకీల్ సాబ్ చిత్రం.

ఇక వకీల్ సాబ్ సినిమా సక్సెస్ సాధించడం పై దిల్ రాజు ఎంతలా అనందం గా ఉన్నదో ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా పై ఆయన తోలి నుండి ఎంతో అద్భుతమైన కాంఫిడెన్స్ తో ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే, పింక్ లాంటి ఒక్క సినిమాని పవర్ స్టార్ లాంటి హీరో తో చేసి ఈ స్థాయిలో జనాలను మెప్పించడం అంటే మామూలు విషయం కాదు, ఒక్క ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులను సంతృప్తి పరుస్తూనే మరో పక్క కథ దిస్తుర్బ్ అవ్వకుండా వేణు శ్రీరామ్ ఈ సినిమా కథని అత్యద్భుతంగా తెరకెక్కించాడు,దాని వల్ల వచ్చిన ఫలితమే ఈరోజు వకీల్ సాబ్, ఇక ఈ సినిమా విజయం పై ఈరోజు నిర్మాత దిల్ రాజు ఒక్క ప్రత్యేకమైన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు, ఆయన మాట్లాడుతూ ‘కరోనా టైం లో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను విడుదల చెయ్యడానికి భయపడిపోతున్నారు, కానీ మేము ఒక్క అడుగు ముందుకి వేసి ఈ సినిమాని విడుదల చేసాము, కరోనా సెకండ్ వేవ్ ని తట్టుకొని, ఇంకా ఎన్నో అడ్డంకులను అధిగమించి మా సినిమా ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తోంది, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్టామినా కి నిదర్శనం’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు.

ఇక ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం చాల మందికి నచ్చలేదు అని, ఒక్క సినిమాలో అన్ని అందరికి నచ్చాలి అంతియే కష్టం అని, కొన్ని కొన్ని డ్రా బాక్స్ కచ్చితంగా ఉంటాయి అని, ఎవరి టేస్ట్ వారిది అని దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడాడు, ఈ సినిమా తర్వాత ఆయన వేణు శ్రీరామ్ తోనే అల్లు అర్జున్ ని హీరో గా పెట్టి ఐకాన్ అనే సినిమాని తియ్యబోతున్నాను అని దిల్ రాజు ఈ సందర్భంగా తెలిపాడు, ఈ సినిమాకి సంబంధించిన కథ చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తాము అని నిర్మాత దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడాడు,ఇక ఈ సినిమాని ఏప్రిల్ 22 వ తారీఖున ఓ టీ టీ లో విడుదల చెయ్యబోతున్నాము అని వస్తున్నా వార్హలు పూర్తిగా ట్రాష్ అని, తమకి అలాంటి ఉద్దేశాలే ప్రస్తుతానికి లేవు అని, 50 రోజుల తర్వాతే ఓ టీ టీ విడుదల గురించి ఆలోచిస్తాము అని దిల్ రాజు సందర్భంగా తెలిపాడు.