వకీల్ సాబ్ గురించి సెన్సషనల్ న్యూస్ చెప్పిన దిల్ రాజు

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడిప్పుడే అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం ఎట్టకేలకు వచ్చే నెల 9 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కనివిని ఎరుగని రీతిలో విడుదల కానుంది, ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ విషయం లో దిల్ రాజు తనలోని పవన్ కళ్యాణ్ వీరాభిమానిని బయటకి తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, అనుకున్నట్టు వకీల్ సాబ్ చిత్రం అత్యద్భుతంగా రావడం తో ఆ సినిమా ప్రొమోషన్స్ విషయం లో కూడా కంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు అన్నట్టు ఉంది దిల్ రాజు కి ఉన్న ఊపుని చూస్తుంటే,ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకని పవన్ కళ్యాణ్ అభిమానులు జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకం గా మిగిలిపొయ్యే లా ప్లాన్ చేస్తున్నాడు అట దిల్ రాజు, దీనికోసంగా ఆయన ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు అట, హైదరాబాద్ లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో జరగబొయ్యే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు వకీల్ సాబ్ కి సంబంధించిన ఒక్క న్యూస్ సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది, ఈ సినిమా కోసం దిల్ రాజు ఒక్క ప్రత్యేకమైన ప్రమోషనల్ సాంగ్ ని పాలన్ చేస్తున్నాడు అట, ఈ సాంగ్ లో టాలీవడ్ కి హేండిన యంగ్ హీరోలందరూ కలిసి పవన్ కళ్యాణ్ కి ఒక్క ట్రిబ్యూట్ లా ప్లాన్ చేస్తున్నారు అట, ఇప్పటికే ఈ సాంగ్ కోసం నితిన్, వరుణ్ తేజ్ లను సంప్రదించాడు అట దిల్ రాజు, వాళ్ళు ఈ సాంగ్ చెయ్యడానికి ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకున్నారు అట,ఇక ఈ సాంగ్ లో నాని, శర్వానంద్ మరియు కార్తికేయ వంటి వారు కూడా కనపడబోతున్నారు అట, సినిమాలో ప్రస్తుతం ఇది ఒక్క సర్ప్రైజ్ గా ప్లాన్ చేసాడు అట దిల్ రాజు, ఇలాంటి సర్ప్రైజ్ లు సినిమాలో చాలామునే ఉన్నాయి అట, అభిమానులు థియేటర్స్ లో కనివిని ఎరుగని రేంజ్ లో పండగ చేసుకునే సినిమాని దిల్ రాజు ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక ఈరోజు విడుదల ఈ సినిమా ట్రైలర్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, పవన్ కళ్యాణ్ కి మరో గబ్బర్ సింగ్ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ రావడం ఖాయం అని, మూడేళ్ళ అభిమానుల ఆకలి ని ఈ సినిమా తీర్చేస్తుంది అని, బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖయాం అని అభిమానులు ఈ సందర్భంగా సోషల్ మీడియా లో పోస్టింగ్స్ వేసుకుంటున్నారు, ముఖ్యం గా ఈ ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ కి అభిమానులకు పూనకాలు వచ్చే విధంగా చేసాయి అనే చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ ని ఇంత మాస్ గా చూసి ఎన్ని రోజులు అయ్యింది అని అభిమానులు అనందం తో కంటతడి పెట్టుకుంటూన్నారు,విడుదలకి ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ అంచనాలనుఅందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.