వకీల్ సాబ్ చిత్రం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

సుమారు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవర్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం వకీల్ సాబ్, తమ ఆరాధ్య దైవం ని ఇక వెండితెర మీద చూడలేమా అని అభిమానులు అనుకుంటున్న సమయం ఎంతో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాని ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే, బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరో గా తెరకెక్కిన పింక్ సినిమాకి రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ చిత్రానికి తొలుత అంచనాలు పెద్దగా లేకపోయినా టీజర్ నుండి నిన్న ట్రైలర్ వరుకు విడుదల అయినా ప్రతి ఒక్కటి అభిమానులను విశేషంగా అలరించడం తో సినిమా పై అంచనాలు కనివిని ఎరుగని రీతిలోకి చేరింది , ఒక్క మాములు రీమేక్ సినిమాకి ఈ స్థాయి అంచనాలు ఏర్పడడం అంటే పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం అని చెప్పొచ్చు, ఇక నిన్న విడుదల అయినా ట్రైలర్ కి ఎలాంటి అద్భుతమైన స్పందన లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ అంటే ఇలా ఉంటుంది అని అందరికి అర్థం అయ్యే రేంజ్ లో నిన్న ఈ ట్రైలర్ సెన్సేషన్ సృష్టించింది, ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇటీవల సోషల్ మీడియా లో బయటపడి అభిమానులకు పూనకాలు వచ్చేలా చేస్తోంది.

ఇక అసలు విషయానికి విబస్తే ఇటీవల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఈ ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ మాట్లాడిన కొన్ని మాటలు పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు రప్పించే విధంగా ఉన్నాయి, ఆయన మాట్లాడుతూ ‘ఇటీవల వకీల్ సాబ్ సినిమాకి నా దుబ్బింగ్ ని పూర్తి చేశాను, నాకు టాలీవుడ్ లో అన్నయ్య చిరంజీవి గారు తప్ప ఫేవరెట్ హీరో ఎవ్వరు లేరు, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కూడా కాదు, కానీ ఈ సినిమాలో దుబ్బింగ్ చెప్తున్నప్పుడు చూస్తున్న కొన్ని సన్నివేశాలకు తెలియకుండానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి,పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఒక్క గబ్బర్ సింగ్ రేంజ్ లో నిలబడగలడు అని నమ్మకంగా చెప్పగలను,వాళ్ళ మూడేళ్ళ ఆకలిని ఈ సినిమా తీరుస్తుంది, ఏప్రిల్ 9 వ తేదీ కోసం అభిమానులతో పాటు నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను, చాలా కాలం తర్వాత ఒక్క అద్భుతమైన పాత్ర ని ఇచ్చాడు వేణు శ్రీరామ్’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్.

ఇది ఇలా ఉండగా నిన్న ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ లో ఘనంగా విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ ట్రైలర్ కి జరిగిన సెలెబ్రేషన్స్ ఇప్పటి వరుకు ఇతర హీరోలకు మొదటి రోజు కూడా జరగలేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు, పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు, సాధారణంగా పాన్ ఇండియా పరంగా క్రేజ్ ని సంపాదించుకున్న సినిమాలకు ఈ స్థాయి సెలెబ్రేషన్స్ ని చూసి ఉంటాము, కానీ ఒక్క రీమేక్ సినిమాకి ఈ స్థాయి సంబరాలు చూడడం ఇదే తొలిసారి అనడం లో ఏ మాత్రం అతి సయోక్తి లేదు, పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఎలాంటిదో ఈ సినిమా ట్రైలర్ సృష్టిస్తున్న రికార్డ్స్ ని బట్టి చెప్పేయొచ్చు, ఇక భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.