వకీల్ సాబ్ ట్రైలర్ గురించి రాజమౌలి సెన్సషనల్ కామెంట్స్

సుమారు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తో మన ముందుకి వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే, దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్నా సినిమా కావడం తో ఈ సినిమా పై ఆయన అభిమానులు కోటి ఆశలే పెట్టుకున్నారు, 2018 వ సంవత్సరం లో విడుదల అయినా అజ్ఞాత వాసి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలైన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమాని అభిమానానులు అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు, అంత చేదు జ్ఞాపకాలను ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు మిగిలించింది, ఇప్పుడు ఆయన అభిమానులు ఒక్క గబ్బర్ సింగ్, ఒక్క అత్తారింటికి దారేది వంటి సినిమాని కోరుకుంటున్నారు, అలాంటి సమయం లో వస్తున్నా వకీల్ సాబ్ చిత్రం పైన ట్రేడ్ వర్గాల్లో అద్భుతమైన టాక్ ఉంది, ఈ సినిమా కచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకోనుంది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ చిత్రానికి సెన్సార్ బోర్డు వాళ్ళు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు, సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం బాగా ఎంజాయ్ చేసాము అని, కచితంగా ఈ సినిమా సెన్సషనల్ హిట్ అవుతుంది అని, ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు వాళ్ళు వకీల్ సాబ్ టీం కి శుభాకాంక్షలు తెలియచేసారు, ఇక ఇటీవలే విడుదల అయినా ట్రైలర్ కి ఎలాంటి అద్భుతమైన స్పందన లభించిందో చెప్పనక్కర్లేదు,పవన్ క్లయం ని సరికొత్త అవతారం లో చూసిన అభిమానులు ఎంతలా అయితే థ్రిల్ అయ్యారో , ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో థ్రిల్ అయ్యారు, ఇక టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా వకీల్ సాబ్ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు,వారిలో దర్శకుడు రాజమౌళి కూడా ఒక్కడు, ఆయన ఈ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే నేను చూడాలి అని కోరుకున్నానో, అలాంటి పాత్రలోనమే చూస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది , అభిమానులు అందరు ఎంతో ఆకలి తో ఉన్నారు, వారి ఆకలి తీర్చే సినిమా గా వకీల్ సాబ్ పక్క నిలుస్తుంది అని గట్టిగ నమ్ముతున్నాను, ఎందుకంటే ఈమధ్యనే నేను ఈ సినిమాకి సంబంధించిన రషెస్ ని చూసాను,పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్స్ అద్భుతంగా వచ్చాయి, ఏప్రిల్ 9 వ తేదీ కోసం అభిమానులు ఎంతలా అయితే ఎదురు చూస్తున్నారో నేను కూడా అంతలా ఎదురు చూస్తున్నాను’ అంటూ రాజమౌళి ఈ సందర్భంగా మాట్లాడారు.

ఇక అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వకీల్ సాయిబు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల నాల్గవ తారీఖున శిల్ప కళా వేదిక లో ఘనంగా జరగనుంది, తొలుత ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో నిర్వహించాలి అని అనుకున్న, రోజు రోజుకి పెరుగుతన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ సభలకు అనుమతి నిరాకరించే ప్రక్రియ లో భాగంగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అనుమతిని ఇవ్వలేదు ప్రభుత్వం, దీనితో నిర్మాతలు శిల్ప కళా వేదిక లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతిని తెచ్చుకున్నారు,ఏప్రిల్ నాల్గవ తేదీన జరగబొయ్యే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కనివిని ఎరుగని రీతిలో జరగనుంది,మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి, మరి భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఏప్రిల్ 9 వ తారీఖున ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.