వకీల్ సాబ్ ట్రైలర్ పై జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం కోసం ఎంతలా ఎదురు చూస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఒక్క పాన్ ఇండియన్ బిఫ్గ్ బడ్జెట్ సినిమాకి ఎంత క్రేజ్ అయితే ఉంటుందో, పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రానికి కూడా అంతే క్రేజ్ ఉండడం విశేషం,దీనికి నిన్న విడుదల అయినా ట్రైలర్ ఒక్క ఉదాహరణ, ఈ ట్రైలర్ ని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 100 కి పైగా థియేటర్స్ లో అభిమానుల కోసం విడుదల చేసారు, విడుదల చేసిన ప్రతి ఒక్క థియేటర్ దగ్గర మొదటి రోజు ఎలాంటి హుంగామ అయితే చేస్తారో, దానికి మించిన హుంగామని చేసారు పవన్ కళ్యాణ్ అభిమానులు, కొన్ని చోట్ల అయితే థియేటర్ గోడలు మరియు అద్దాలు కూడా పగిలిపోయాయి, ఒక్క సాధారణ రీమేక్ సినిమాకి ఈ స్థాయి అంతే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు, మూడు సంవత్సరాలు సినిమాలు లేకపోయినా, 8 ఏళ్ళ నుండి ఒక్క హిట్ లేకపోయినా ఈ క్రేజ్ మరో హీరో కి సాధ్యపడదు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఆడవాళ్ళ పై జరుగుతన్న అత్యాచారాలను ఫోకస్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ కి అటు అభిమానుల నుండి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో, ఇటు టాలీవుడ్ సెలబ్రిటీస్ నుండి కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది, చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరుకు ప్రతి ఒక్కరు ఈ ట్రైలర్ పై పొగడ్తల వర్షం కురిపించారు, అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక్కడు, ఆయన మాట్లాడుతూ ‘ఇలాంటి సామజిక స్పృహ ని రేపే సినిమాలు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ చెయ్యడం ఎంతో అభినందించదగ్గ విషయం, దేశ వ్యాప్తంగా ఆడవాళ్ళ పై జరుగుతున్నా అన్యాయాలు మనం రోజు టీవీలలోను, న్యూస్ పేపర్స్ లోను చూస్తూనే ఉన్నాం,అలాంటి సబ్జెక్టు ని ఎంచుకోడానికి చాలా ధైర్యం ఉండాలి, ట్రైలర్ నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది, కచ్చితంగా ఈ సినిమా ఘానా విజయం సాధిస్తుంది అని గట్టిగ నమ్ముతున్నాను’ అంటూ అఆయన ఏ సందర్భంగా స్పందించాడు, ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఎంతటి సన్నిహిత్య సంబంధం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, గతం లో ఎన్టీఆర్ అరవింద సామెత ట్రైలర్ లాంచ్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యాడు,అప్పట్లో ఇరువురి హీరోల అభిమానులు ఎంతలా సంతోషించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇప్పుడు మల్లి ఎన్టీఆర్ వకీల్ సాబ్ ట్రైలర్ కి విషెస్ చెప్పడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.

ఇక వకీల్ సాబ్ ట్రైలర్ యూట్యూబ్ లో అయితే ఒక్క ప్రభంజనం సృష్టిస్తుంది అనే చెప్పాలి, విడుదల అయినా అతి కొద్దీ గంటలకే ఈ ట్రైలర్ 8 లక్షల కి పైగా లైక్స్ మరియు ఒక్క కోటి 40 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకొని సౌత్ లోనే ఆల్ టైం రికార్డుగా నిలిచింది, ఈ స్థాయి రికార్డులు మాములుగా అయితే పాన్ ఇండియన్ సినిమాలకు రావడం మనం చూస్తూ ఉంటాం, కానీ తోలి సారి ఒక్క మాములు రీమేక్ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం అంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటి అనేది అర్థం చేసుకోవచ్చు, చాలా కాలం తర్వాత ఆయన అభిమానులు సంతోషంగా పండగ చేసుకుంటున్నారు, కచ్చితంగా ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టి పవన్ కళ్యాణ్ అభిమానుల మూడేళ్ళ ఆకలి ని తీరుస్తుంది అని ఆ చిత్ర బృందం చాలా నమ్మకం తో ఉంది, మరి భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9 న విడుదల అవ్వబోతున్న వకీల్ సాబ్ చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.