వకీల్ సాబ్ పై జగన్ చేస్తున్న కుట్రకి దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా తో ఎలా ఊగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, సుమారు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 9 వ తేదీన వకీల్ సాబ్ సినిమా తో మన ముందుకి వచ్చాడు,విడుదల రోజు తోలి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న ఈ చిత్రం మొదటి ఆట నుండే రికార్డుల మోత మోగిస్తూ ముందుకి దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, అత్తారింటికి దారేది సినిమా తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ చిత్రం రూపం లో 8 ఏళ్ళ ఆకలి ని తీర్చింది అనే చెప్పాలి, పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత పూర్తి శ్రద్ద పెట్టి ఈ సినిమా ద్వారా తన నట విశ్వరూపం చూపించాడు అనే చెప్పాలి, ఈరోజు ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టడానికి ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటనే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, లాయర్ సత్య దేవ్ గా పవర్ స్టార్ చూపించిన నట విశ్వరూపం కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలు నీరాజనాలు పలికారు.

బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్థాయి సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా పై సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి కొన్ని గాసిప్స్ షికారు చేస్తున్నాయి, అదేమిటి అంటే వకీల్ సాబ్ సినిమా ఈ నెల 23 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు అని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రాబోతున్నాయి అని పుకార్లు షికార్లు చేసాయి, అయితే ఈ పుకార్లను గమనించిన దిల్ రాజు వెంటనే ఒక్క వీడియో ద్వారా స్పందించాడు ,ఆయన మాట్లాడుతూ ‘వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో రికార్డు బద్దలు కొడుతూ చరిత్ర తిరగరాస్తుంది, అలాంటి సినిమాని అంత తొందరగా ఎలా ఓ టీ టీ లోకి వదులుతాము, దయచేసి సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని పట్టించుకోకండి, వకీల్ సాబ్ ని 50 రోజుల వరుకు వదిలేది లేదు, ఆంధ్రప్రదేశ్ లో మా సినిమాకి ఎవ్వరు ఎన్ని అడ్డంకులు పెట్టాలి అని చూస్తున్న కూడా పవర్ స్టార్ స్టామినా ముందు ఆ అడ్డంకులు అన్ని పవర్ స్టార్ ముందు నిలబడలేకపోయింది’ అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడాడు.

ఇక ఈ చిత్రం వసూళ్ల విషయానికి వస్తే మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా బెన్ఫిట్ షోలను అకస్మాత్తుగా క్యాన్సిల్ చేయించి , 2012 మరియు 2013 లో కొనసాగిన టికెట్ రేట్స్ ని అమలు చెయ్యాలి అని అప్పటికి అప్పుడు ఆదేశాలు జారీ చేసిన కూడా మొదటి రోజు ఈ సినిమా 32 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ ఏందో, ఆయన మీద జనాలకి ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలిసేలా చేసాడు, ఇక మొదటి రోజు హై కోర్టు నుండి మూడు రోజుల వరుకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు అని అధికారికంగా ఆదేశాలు కూద జారీ చేసింది, కానీ అక్కడ కూడా తగ్గని ప్రభుత్వం హై కోర్ట్ లో మరోసారి పిటిషన్ వేసింది,సినిమా నడుస్తున్న ప్రతి చోట థియేటర్ యాజమాన్యాల పై అధికార పార్టీ లీడర్స్ తీవ్రమైన వత్తిడిని పెట్టడం ప్రారంభించారు, అన్ని ఇబ్బందులు పెట్టిన కూడా రెండవ రోజు ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది, ఇక ఇప్పటి వరుకు 5 రోజులకు కలిపి ఈ సినిమా ఏకంగా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే 66 కోట్ల రూపాయిలు వసూలు చేసింది, ఇక రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఫుల్ రన్ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.