వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి డైరెక్టర్ వేణు శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ మొత్తం ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రం కోసం ఎంతలా ఎదురు చూస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎక్కడ చూసిన ఇప్పుడు వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు, ఇన్ని రోజులు సినిమాకి ఎలాంటి హైప్ అయితే రావాలని అభిమానులు కోరుకున్నారో, అలాంటి హైప్ వకీల్ సాబ్ ట్రైలర్ తీసుకొచ్చింది, ఇటీవల కాలం లో ఒక్క ట్రైలర్ ఈ స్థాయి సెన్సేషన్ సృష్టించడం ఇదే తొలిసారి అనడం లో ఎలాంటి సందేహం లేదు, కేవలం 24 గంటల్లో రెండు కోట్ల 22 లక్షల వ్యూస్ మరియు 10 లక్షల లైక్స్ ని సాధించి సరికొత్త సంచలనం కి తెర లేపిన ఈ ట్రైలర్, రెండు రోజుల్లో మూడు కోట్ల వ్యూస్ ని సాధించి టాలీవుడ్ లో ఒక్క ప్రభంజనమే సృష్టించింది, ఇక ఈ ట్రైలర్ ని యూట్యూబ్ కంటే అరగంట ముందుగా థియేటర్స్ లో అభిమానుల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి దాదాపు గా 100 కి పైగా థియేటర్స్ లో వకీల్ సాబ్ ట్రైలర్ ప్రత్యేక స్క్రీనింగ్ వెయ్యగా, కనివిని ఎరుగని రెస్పాన్స్ ని సొంతం చేసుకొని పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే ఏమిటో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ఇచ్చిన ఊపుతో అభిమానులు త్వరలో జరగబొయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సమయం లో ఆ చిత్ర యూనిట్ కి హైదరాబాద్ పోలీసులు ఊహించని షాక్ ని ఇచ్చారు,హైదరాబాద్ లో రోజు రోజుకి పెరుగుతన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని, అక్కడ బహిరంగ సభలకు కానీ, బైక్ ర్యాలీలకు గాని ఎలాంటి అనుమతి లేదు అని, వీటిని పరిగణలోకి తీసుకొని వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో జరుపుకోవడానికి అనుమతిని ఇవ్వడం లేదు అని హైదరాబాద్ పోలీసులు చెప్పినట్టు ఆయా చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపాడు,అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హోటల్ నోవాటెల్ లో జరిపేందుకు నిమ్రత దిల్ రాజు గారు ప్రయత్నిస్తున్నారు అని, పోలీసుల అనుమతి దొరకగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియచేస్తాము అని డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సందర్భంగా స్పందించారు, వకీల్ సాబ్ చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా వకీల్ సాబ్ కి ప్రమోషన్స్ కోసం వేణు శ్రీరామ్ వరుసగా ఇంటర్వూస్ ఇస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ ఇంటర్వూస్ లో ఆయన ఈ విషయం గురించి మాట్లాడాడు.

ఇది ఇలా ఉండగా ఇటీవల విడుదల అయినా వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రోజుకో రికార్డుని సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది , తోలి రోజు రెండు కోట్ల 22 లక్షల వ్యూస్ మరియు ఒక్క మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్, ఆ తర్వాత కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా మూడు కోట్ల పైగా వ్యూస్ ని సాధించి టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వేగవంతంగా మూడు కోట్ల వ్యూస్ సాధించిన వీడియో గా సరికొత్త చరిత్ర సృష్టించింది, సాధారణంగా ఇలాంటి రికార్డులు పాన్ ఇండియన్ సినిమాలకు గాని , లేదా మంచి కాంబినేషన్ ఉన్న సినిమాలకు గాని రావడం మనం చూస్తూ ఉంటాము, కానీ నాలుగు సంవత్సరాల క్రితం విడుదల అయినా ఒక్క నాన్ కమర్షియల్ మూవీ పింక్ లాంటి సినిమాని రీమేక్ చేస్తూ ఇలాంటి అద్భుతమైన ఫీట్ ని సాధించడం అంటే మాములు విష్యం కాదు, ఇది కేవలం పవర్ స్టార్ వల్లనే సాధ్యం అని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో సంబరాలు చేసుకుంటున్నారు, మరి భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.