వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అదిరిపొయ్యే న్యూస్ చెప్పిన దిల్ రాజు

సుమారు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం వకీల్ సాబ్, చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 9 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే,డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సిఏమని గబ్బర్ సింగ్ రేంజ్ లో తీసాడు అని , పేరు కి హిందీ సూపర్ హిట్ చిత్రం పింక్ కి రీమేక్ అయినా, ఎక్కడ కూడా పింక్ సినిమా ఛాయలు లేకుండా పవర్ స్టార్ మాస్ ఇమేజి కి తగట్టు ఈ సినిమాని వేణు శ్రీరామ్ తెరకెక్కించారు అని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఊర మాస్ కం బ్యాక్ సినిమా గా నిలుస్తుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త,ఇప్పటి వరుకు విడుదల అయినా టీజర్ మరియు పాటలను చూస్తే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఈ వార్త నిజమే అని నమ్మక తప్పదు, అయితే ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొని, పవన్ కళ్యాణ్ తో సినిమా అనేది నా డ్రీం ప్రాజెక్ట్ అంటూ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా ని నిర్మించిన దిల్ రాజు, ప్రమోషన్స్ విషయం లో చాలా లైట్ గా తీసుకున్నాడు అని,సినిమా విడుదల కి నెల రోజులు కూడా లేకపోయినా, ఇప్పటి వరుకు ప్రొమోషన్స్ ప్రారంభించలేదు అని, కనీసం విడుదల అయినా టీజర్ ని థియేటర్స్ లో కూడా వెయ్యట్లేదు అని అభిమానులు దిల్ రాజు పై చాలా కోపం గా ఉన్నారు.

కానీ దిల్ రాజు తానూ ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఈ సినిమా విషయం లో ప్రొమోషన్స్ ని మాత్రం లైట్ తీసుకుంటాడు అని ఎలా అనుకుంటున్నారు?,పవర్ స్టార్ రీ ఎంట్రీ సినిమాని కనివిని ఎరుగని రీతిలో ప్లాన్ చేసాడు దిల్ రాజు, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి విబరుకు జరగని విధంగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేసాడు అట దిల్ రాజు,ఏప్రిల్ 3 వ తేదీన జరగబొయ్యే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగానే బడ్జెట్ ని కేటాయించాడు అట దిల్ రాజు, ఇక ఈ ప్రీ రిలీజ్ ఏవంటి కి ముఖ్య అతిధులుగా చిరంజీవి మరియు రామ్ చరణ్ మాత్రమే కాకుండా తమిళ సూపర్ స్టార్ అజిత్ మరియు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు అట, అజితగ్ మరియు అమితాబ్ బచ్చన్ హిందీ మరియు తమిళం లో పింక్ సినిమాలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్ళిద్దరిని నిర్మాత బోనీ కపూర్ ఆహ్వానించగా, చిరంజీవి మరియు రామ్ చరణ్ ని స్వయంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించాడు అట, ఇలా ఒక్కే వేదిక పవన్ కళ్యాణ్ కాకుండా మరో నలుగురు సూపర్ స్టార్స్ ని చూడబోతున్నాము అన్నమాట, నిజంగా ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు కనుల పండుగ లాంటిదే అని చెప్పొచ్చు.

వీటితో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు తెలుగు రాష్ట్రాలలలో ప్రతి ఒక్క జిల్లాలోనూ ఎల్ ఈ డీ స్క్రీన్స్ వేసి చూపించబోతున్నారు అట అభిమానులు, మొత్తం మీద దేశం లో ఇప్పటి వరుకు కనివిని ఎరుగని రీతిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపెందుకు సన్నాహాలు చేస్తున్నాడు అట దిల్ రాజు, మరి ఏప్రిల్ మూడవ తేదీన ఎలా ఉండబోతుందో చూడాలి, ఐక్య ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఈ నెల 29 వ తేదీన కానీ, ఏప్రిల్ 1 వ తారీఖున కానీ విడుదల చెయ్యబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం,ఇప్పటికే విడుదల అయినా టీజర్ కి లాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇక ప్రముఖ సంగీత దర్శకుడు తమ్మన్ అందించిన మూడు పాటలు కూడా విడుదల అయ్యి, అభుమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని తెచ్చుకుంది, ముఖ్యంగా మగువ మగువ పాట అయితే ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తుంది, బుల్లితెర మీద కొన్ని టీవీ చానెల్స్ అయితే మగువ మగువ అనే టైటిల్ తో ఏకంగా ప్రోగ్రామ్స్ ని నడుపుతున్నారు, ఇలా ఇప్పటి వరుకు అభిమానుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని సృష్టించిన ఈ సినిమా అభిమానులని గబ్బర్ సింగ్ రేంజ్ లో అలరిస్తుందో లేదో చూడాలి.