వకీల్ సాబ్ మూడు రోజుల కలెక్షన్స్ చూస్తే నోరెళ్లబెడుతారు

టాలీవుడ్ లో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత వెండితెర మీదకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జనాలు నీరాజనాలు పలికారు, ఎన్ని ఇబ్బందులు ఎదురు అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి టాక్ వస్తే జనాలు థియేటర్స్ వైపు తండోపతండాలుగా కదులుతారు అని 2013 వ సమ్వబత్సరం లో మనం అత్తారింటికి దారేది సినిమా ద్వారా చూసాము, అప్పట్లో ఎన్ని అడ్డంకులు ఎదురు అయినా కూడా ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఇప్పటికి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఇప్పుడు వకీల్ సాబ్ విషయం లో కూడా మరోసారి అదే రిపీట్ అయ్యింది, విడుదల రోజు నుండి ఈ సినిమాని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన కూడా మొదటి రోజు నుండి ప్రభంజనం సృష్టిస్తూ , రికార్డుల వర్షం కురిపిస్తూ ముందుకి దూసుకుపోతుంది, ఇప్పటికే మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరుకు ఎంత వసూలు చేసిందో చూద్దాం.

మొదటి రోజు ఆంధ్ర మరియు తెలంగాణ లో 32 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు 12 కోట్ల రూపాయిలు, మూడవ రోజు 11 కోట్ల రూపాయిలు వసూలు చేసి, నాన్ బాహుబలి రికార్డుగా నిలిచింది, కేవలం మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం, నాలగవ రోజు కూడా ప్రీ ఫెస్టివల్ సీజన్లో అదే స్థాయి వసూళ్లను రాబడుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది,ఎన్ని కుట్రలు చేసిన, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కూడా ఈ సినిమా వాటి అన్నిటిని ఎదురుకొని ప్రభంజనం సృష్టిస్తుంది, ఇలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ కి రికార్డ్స్ సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య లాంటిది అని అందరికి అర్థం కేవలం మూడు రోజుల్లో 63 కొలత రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయిలు వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం , ఇదే కానీ జరిగితే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ధామ్ ఉన్న హీరో టాలీవుడ్ లో ఇంకొకడు లేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఎందుకంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో 100 కోట్లు కొట్టడం అంటే మాములు విషయం కాదు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ప్రీమియర్స్ నుండే అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది, ఎందుకంటే అక్కడ థియేటర్స్ అన్ని 30 శాతం ఆక్యుపెన్సీ తో నడుస్తున్నాయి, టికెట్ రేట్ కూడా కేవలం 14 డాలర్స్ పెట్టడం తో ఈ సినిమా తోలి రోజు 5 లక్షల డాలర్స్ వసూలు చేసింది,ఇక రెండవ రోజు మూడవ రోజు కూడా చెరో లక్ష డాలర్స్ వసూలు చేసి ఇప్పటి వరుకు 7 లక్షల డాలర్స్ ని వసూలు చేసి కోవిద్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా 1 మిలియన్ వైపు దూసుకుపోతుంది, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ స్థాయి వసూలు రాబట్టడం ఒక్క పవర్ స్టార్ కి మాత్రమే చెల్లింది అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం పడ్డారు.