వకీల్ సాబ్ మూవీ పై వస్తున్నా అసత్య ప్రచారాలపై కేటీయార్ షాకింగ్ కామెంట్స్

గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన విజృంభణ ఏ స్థాయిలో ఉండిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ప్రపంచం మొత్తం గడగడాలాడించిన ఈ కరోనా మహమ్మారి తీవ్రత గత ఏడాది డిసెంబర్ నెల నుండి తగ్గుముఖం పడుతూ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే,మొత్తానికి ఈ మహమ్మారి పీడా విరగడైంది అని అందరూ కాస్త ఊపిరి పీల్చుకునేలోపు గత నెల మార్చి నుండి కరోనా సేకడఁ వేవ్ ప్రారంభం అయ్యింది, దేశ వ్యాప్తంగా మెల్లిగా కరోనా కేసులు పెరుగుతూ పోతు నేడు ఏకంగా రోజుకి 80 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అవుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది, ఈ మహమ్మారి తీవ్రత మన దేశం లో ఎక్కువగా మహారాష్ట్ర లో ఉండడం వల్ల అక్కడ లోక్ డౌన్ విధించారు, ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రోజుకి వెయ్యికుకి పైగా కేసులు నమోదు అవుతుండడం తో ఇక్కడ స్కూల్స్ కి కాలేజీలకు సెలవలు ప్రకటించేసారు, ప్రతి ఒక్కరు మాస్కులను తప్పనిసరిగా ధరించాలి అని, లేని పక్షం లో వెయ్యి రూపాయిలు ఫైన్ కట్టాల్సిందే అని ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది ఇలా ఉండగా కరోనా మహమ్మారి తాకిడి కి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎంతలా కుదేలు ఐపోయిందో ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు, ప్రతి ఏడాది వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ జరిగే చలన చిత్ర పరిశ్రమ రంగం , అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడం తో షూటింగులు దాదాపుగా ఏడాది పైగా ఆగిపొయ్యి, సినిమాలు విడుదల కాక ఇండస్ట్రీ ని నమ్ముకున్న వేలాది మంది సినీ కార్మికులను మరియు నటీనటులను రోడ్డున పడేలా చేసింది, అయితే ఈ ఏడాది క్రాక్ సినిమా తో ప్రారంభం అయినా టాలీవుడ్ జైత్ర యాత్ర ఉప్పెన మరియు జాతి రత్నాలు వంటి సినిమాల వరుకు కొనసాగి డిస్ట్రిబ్యూటర్స్ కి బయ్యర్స్ కి కాసుల కనకవర్షం కురిపించింది, అయితే ఈ ఏడాది ఇడుప్పటి వరుకు విడుదల అయినా సినిమాలు అన్ని మీడియం బడ్జెట్ సినిమాలే అవ్వడం విశేషం, చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమా వకీల్ సాబ్ ఈ నెల 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతుండడం తో యావత్తు సినీ లోకం మొత్తం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది, పైగా ఫిలిం నగర్ లో సినిమా అద్భుతంగా వచ్చింది అని టాక్ కూడా రావడం, దానితో పాటుగా ఇటీవల విడుదల ఆయన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.

అయితే గత రెండు నుండి సోషల్ మీడియా లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా థియేటర్స్ అన్ని మూసి వేస్తున్నట్టు ఒక్క ఫేక్ జీవో తెగ వైరల్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే,అయితే దీనిని పవన్ కళ్యాణ్ అభిమానులు నిజం అనుకోని తీవ్రమైన నిరాశకి గురి అయ్యారు, ఈ వార్త ఆ చెవిన ఈ చెవిన పడి చివరికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీయార్ చెవిన పడింది, ఆయన దీనిపై చాలా తీవ్రంగా స్పందించాడు, కేటీయార్ మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఫేక్ జీవో నా దృష్టికి రావడం జరిగింది, ఇది ఎవరు చేసారో 24 గానట్లో కనుక్కొని వాళ్ళని బొక్కలో తోయిస్తాను, పనిపాట లేని చిల్లర వెదవలు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు, డాయఁచేసి అసత్య ప్రచారాలను నమ్మి మీరు మోసపోవద్దు, మేము తెహట్రెస్ పై ఎలాంటి ప్రకటన చెయ్యలేదు, తెలంగాణ లో నడుస్తున్న థియేటర్స్ అన్ని 100 శాతం సీటింగ్ కెపాసిటీ తో నడుస్తాయి, కాకపోతే థియేటర్ కి వచ్చే ప్రతి ఒక్కరు మాసుకులను ధరిస్తేనే థియేటర్ యాజమాన్యాలు వారిని లోపాలకి అనుమతించాలి, కరోనా నిబంధలను ఉల్లగించనంత వరుకు ఏ ఒక్క థియేటర్ కి కూడా ఇబ్బంది కలగదు’ అంటూ కేటీయార్ ఈ సందర్భంగా మాట్లాడాడు.