వకీల్ సాబ్ రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు

తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక్క ప్రభంజనం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు,సినిమాల్లో ఈయన స్థాయి నేటి తరం లో మెగాస్టార్ చిరంజీవి రేంజ్ అని చెప్పొచ్చు,ఈయనకి ఉన్న స్టార్ దమ్ ని చూసి ఇతర హీరోల అభిమానులు కుళ్ళుకోక తప్పదు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు, పవర్ స్టార్ సినిమాకి హిట్ టాక్ అనేది వస్తే ఎన్ని అడ్డంకులు వచ్చిన కూడా ఆ కలెక్షన్ల సునామి ని ఎవ్వరు తట్టుకోలేరు అని 2013 వ సంవత్సరం లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా నిరూపించింది, మళ్ళీ ఇన్నేళ్లకు ఇటీవల విడుదల అయినా వకీల్ సాబ్ చిత్రం ద్వారా మరో సారి ఎవ్వరు ఎన్ని అడ్డంకులు అడుగడుగునా పెడుతున్న కూడా పవర్ స్టార్ సినిమా ప్రభంజనం ని ఆపడం లో మొదటి రోజు నుండే విఫలం అయ్యారు,ఒక్క పక్క కరోనా మహమ్మారి విజృంభణ ని తట్టుకొని, మరో పక్క అన్హద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజకీయ వత్తిడులను ఎదుర్కొని ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ కథనం లో చూడబోతున్నాము.

మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా బెన్ఫిట్ షోలను అకస్మాత్తుగా క్యాన్సిల్ చేయించి , 2012 మరియు 2013 లో కొనసాగిన టికెట్ రేట్స్ ని అమలు చెయ్యాలి అని అప్పటికి అప్పుడు ఆదేశాలు జారీ చేసిన కూడా మొదటి రోజు ఈ సినిమా 32 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ ఏందో, ఆయన మీద జనాలకి ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలిసేలా చేసాడు, ఇక మొదటి రోజు హై కోర్టు నుండి మూడు రోజుల వరుకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు అని అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేసింది, కానీ అక్కడ కూడా తగ్గని ప్రభుత్వం హై కోర్ట్ లో మరోసారి పిటిషన్ వేసింది,సినిమా నడుస్తున్న ప్రతి చోట థియేటర్ యాజమాన్యాల పై అధికార పార్టీ లీడర్స్ తీవ్రమైన వత్తిడిని పెట్టడం ప్రారంభించారు, అన్ని ఇబ్బందులు పెట్టిన కూడా రెండవ రోజు ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది, ఇప్పటి వరుకు బాహుబలి పార్ట్ 2 తప్ప మన తెలుగు లో ఒక్క సినిమా కూడా రెండవ రోజు ఈ స్థాయి వసూళ్లను రాబట్టలేదు, అలాంటి వసూళ్లను రాబట్టి పవర్ స్టార్ సరికొత్త చరిత్రకి శ్రీకారం చుట్టాడు.

ఇలా కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి ఈ సినిమా అక్షరాలా 45 కోట్ల రూపాయిలు వసూలు చేసింది, ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 50 కోట్ల మార్కుని అందుకొని సరికొత్త చరిత్ర ని సృష్టించింది, బాహుబలి మరియు సాహూ సినిమాల తర్వాత ఈ స్థాయి వసూలు రాబట్టిన సినిమా వకీల్ సాబ్ అని చెప్పడం లో ఏ మాత్రం సందేహం లేదు, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అన్ని చోట్ల ప్రభంజనమే సృష్టిస్తుంది , మొదటి వారం లో 85 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసి ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిలు వసూలు చేసే అవకాశం ఉంది ట్రేడ్ వర్గాల అంచనా, పవన్ కళ్యాణ్ నుండియే ద్భుతమైన నటన రావడం వల్లే ఈ సినిమా ఎన్ని అడ్డంకులు ఎదురు అయినా నిలబడి చరిత్ర సృష్టిస్తుంది అని ఆయన అభిమానులు గర్వం గా చెప్పుకుంటున్నారు, మరి రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్నిల ద్భుతాలు సృష్టిస్తుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.