వకీల్ సాబ్ సినిమా గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఈ ఏడాది విడుదల అయినా ప్రతి సినిమా దాదాపుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వస్ర్హమ్ కురిపించడం తో,దాదాపు ఏడాది తర్వాత వస్తున్నా స్టార్ హీరో సినిమా అవ్వడం తో వకీల్ సాబ్ చిత్రం కోసం ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమేకాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, పైగా పవన్ కళ్యాణ్ మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత చేస్తున్న సినిమా అవ్వడం తో ఈ సినిమా పై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్న అంచనాలకు దీటుగా ఇప్పటి వరుకు విడుదల అయినా వకీల్ సాబ్ చిత్రం టీజర్ మరియు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే,ఇక ఈ నెల 29 వ తారీఖున విడుదల అవ్వబోతున్న వకీల్ సాబ్ ట్రైలర్ ఇప్పటి వరుకు వచ్చిన అంచనాలను పదింతలు ఎక్కువ చేసేలా ఉంటుంది అట.

ట్రైలర్ విడుదల అవ్వకముందే వకీల్ సాబ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని చోట్ల తెరిచారు, బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే క్షణాల్లో టికెట్స్ అన్ని హాట్ కేక్స్ లా సేల్ అయిపోవడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది,ముఖ్యంగా ఆస్ట్రేలియా లో ప్రపంచం లోనే అతి పెద్ద ఐమాక్స్ స్క్రీన్ లో వకీల్ సాబ్ బుకింగ్స్ ఓపెన్ చేసారు, ఈ బుకింగ్స్ ఓపెన్ చేసిన గంట వ్యవధి లోనే ఒక్క రోజు మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది, వాస్తవానికి అక్కడ విడుదల ముందు రోజుకు గాని అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అవ్వవు, అలాంటిది విడుదలకి 15 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన ఒక్క గంట గ్యాప్ లో థియేటర్ మొత్తం ఫుల్ అయిపోవడం ఇదే తోలి సారి అట, పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి మూడేళ్లు గడిచిన, ఇటీవల కాలం లో సరైన సక్సెస్ ఒక్కటి లేకపోయినా కూడా, ఆయన క్రేజ్ చెక్కు చెదరలేదు అని చెప్పడానికి వకీల్ సాబ్ బుకింగ్స్ ఒక్క ఉదాహరణ అని పవన్ కళ్యాణ్ అభిమానులు సిసిల మీడియా లో హల్చల్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక్క ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు అభిమానులకు విసువల్ ఫీస్ట్ గా ఉండబోతుంది అట, ఇటీవల ప్రకాష్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడుతూ ‘నా కెరీర్ లో ఈ సినిమా ఒక్క మెయిలు రాయిగా నిలిచిపోతుంది అని బలంగా చెప్పగలను,దుబ్బింగ్ చెప్తున్నా సమయం లో కొన్ని సన్నివేశాలు చూసాను, డైరెక్టర్ వేణు శ్రీరామ్ నిజంగా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకేకించాడు, హిందీ పింక్ తో పోలిస్తే మన వకీల్ సాబ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ, ఎక్కడ కూడా కథలోని ఆత్మని పోగట్టకుండా ఎంతో ఎమోషనల్ గా, లేడీస్ కి ఒక్క గొప్ప బహుమతి లాగ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇందులో తన నట విశ్వరూపం సీఝూపించాడు అనే చెప్పొచ్చు, ఏప్రిల్ 9 వ తేదీన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతలా అయితే ఎదురు చూస్తున్నారో, నేను కూడా అంతే ఎదురు చూస్తున్నాను’ అంటూ ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా తెలిపాడు.