వకీల్ సాబ్ సినిమా గురించి విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ మేనియా నే కనిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే , దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ సినిమాని రీమేక్ చేస్తూ పవన్ కళ్యాణ్ తీసిన వకీల్ సాబ్ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఇటీవల హైదరాబాద్ లోని శిల్ప కళావేదిక లో నిర్వహించిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమా పై అంచనాలను భారీ స్థాయిలో పెంచేసాయి,ఇక ఇప్పటి వరుకు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ వరుకు ప్రతి ఒక్కటి అటు అభిమానులను ఆనందపరచడమే కాకుండా, ఇటు ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ముఖ్యంగా ట్రైలర్ అయితే ఒక్క సునామీని సృష్టించింది అని చేరప్పొచు, విడుదల రోజు నుండి రోజుకి ఒక్క సరికొత్త రికార్డు సృష్టిస్తూ కేవలం వారం రోజుల్లోనే 35 మిలియన్ వ్యూస్ ని సాధించి ఆల్ టైం రికార్డుగా నిలిచింది.

ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల ఓపెన్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే,అడ్వాన్స్ బుకింగ్స్ తెరిచినా స్ఖలనం నుండి నిమిషాల వ్యవధి లో టికెట్స్ అన్ని అమ్ముడుపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది,గడిచిన మూడు సంవత్సరాలలో ఒక్క సినిమా పై ఈ రేంజ్ క్రేజ్ ఉండడం సాహో తర్వాత వకీల్ సాబ్ కి మాత్రమే చూడడం అని అందరూ అంటున్నారు, ఇది ఇలా ఉండగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు కొంతమంది ఆసియన్ సినిమాస్ తో కలిసి థియేటర్స్ ఓపెన్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ ఓపెన్ చేసి హైదరాబాద్ లోనే మోస్ట్ క్రేజీ థియేటర్ గా మార్చేశాడు, ఇక విజయ్ దేవరకొండ కూడా ఆసియన్ సినిమాస్ తో కలిసి ఏవీడీ సినిమాస్ ని ఒక్క మాల్ కట్టేసాడు, ఈ థియేటర్ ఏప్రిల్ 9 వ తేదీన వకీల్ సాబ్ సినిమా తో ప్రారంభం కానుంది, ఈ థియేటర్ లో పవర్ స్టార్ ఫాన్స్ తో కలిసి సినిమా చూడబోతున్నాడు అట విజయ్ దేవరకొండ, ఒక్కసారి విజయ్ దేవరకొండ మాల్ ఎలా ఉందొ మీరు కూడా ఒక్క లుక్ వెయ్యండి.

ఇక వకీల్ సాబ్ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, కేన్సర్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు, సినిమా మొత్తం అద్భుతంగా వచ్చింది అని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలకు మాకు తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు వచ్చేసాయి అని, పవన్ కళ్యాణ్ గారి నటన చాలా అద్భుతంగా ఉంది అని ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు మూవీ టీం కి శుభాకాంక్షలు తెలియచేసారు అట,ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం నగర్ మొత్తం చక్కర్లు కొడుతోంది, పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా మరో గబ్బర్ సింగ్ లాంటి మాస్ కంబ్యాక్ సినిమాగా నిలుస్తుంది అని, చాలా సన్నివేశాలు అభిమానులకు పూనకాలు రప్పించే విధంగా ఉండబోతున్నాయి అట, పవన్ కళ్యాణ్ నుండి సరైన హిట్ కోసం అభిమానులు దాదాపుగా 8 ఏళ్ళ నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు, 2013 వ సంవత్సరం లో విడుదల అయినా అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి సరైన హిట్ లేదు, ఇక ఆయన ఆఖరి సినిమా అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన ప్లాప్ గా నిలిచి అభిమానులకు ఒక్క మర్చిపోలేని పీడకల గా నిలిచింది,ఒక్క మంచి సక్సెస్ కోసం తీరని ఆకలి తో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ ఆ ఆకలిని తీరుస్తుందా లేదా అనేది చూడాలి.