వకీల్ సాబ్ సినిమా గురించి మెగాస్టార్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

టాలీవుడ్ మొత్తం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్నా పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు, అంతే కాకుండా అత్తారింటికి దారేది సినిమా తర్వాత సరైన సక్సెస్ కోసం ఆయన అభిమానులు ఎంత ఆకలి తో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా ఒక్కవేల భారీ విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు ఊహకందని రేంజ్ లో ఉంటాయి, అయితే ఫిలిం నగర్ నుండి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వకీల్ సాబ్ సినిమా అవుట్ పుట్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది అని, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది మరో గబ్బర్ సింగ్ రేంజ్ లో పండగ చేసుకునే సినిమా అవుతుంది అని చెప్తున్నారు, ఏప్రిల్ 9 న అభిమానులు థియేటర్స్ కి ఎంత ఉత్సాహం తో అయితే వస్తారో , థియేటర్స్ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు దానికి పదింతలు రెట్టింపు ఉత్సాహం తో ఇంటికి తిరిగి వెళ్తారు అట.

అయితే ఈ సినిమా ప్రివ్యూ ని ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కి చూపించాడు అట దిల్ రాజు, ఈ సినిమాని చూసిన మెగాస్టార్ చిరంజీవి ఒక్క సారిగా షాక్ కి గురి అయ్యాడు అట, పింక్ లాంటి ఆఫ్ బీట్ సినిమాని ఇలా కూడా తియ్యవచ్చా అని అందరూ ఆశ్చర్యపొయ్యే విధంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాని మలిచిన తీరు ని చూస్తుంటే ముచ్చటేస్తుంది, కచ్చితంగా ఈ సినిమా ఆకలి మీద ఉన్న నా తమ్ముడి అభిమానులకు ఒక్క పండగలాగా ఉండబోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు అంటూ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియచేసాడు అట మెగా స్టార్ చిరంజీవి,ఒక్క ఫిమేల్ సెంట్రిక్ మూవీ ని స్టార్ హీరోతో చేసి పొరపాటు చేస్తున్నారు ఏమో, అందులోనే కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న వేణు శ్రీరామ్ ఎలా డీల్ చేస్తాడో అని అనుకున్నాను, కానీ ఈ సినిమాని ఒక్క పవన్ కళ్యాణ్ వీరాభిమాని తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో ఆలా తెరకెక్కించాడు వేణు శ్రీరామ్, అతని పని తనం చూసిన తర్వాత నాకు కూడా అతనితో ఒక్క సినిమా చెయ్యాలి అనే కోరిక నా మనసులో మొదలు అయ్యింది అంటూ చిరంజీవి ఈ సందర్భంగా స్పందించాడు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదేరాబద్ లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఏప్రిల్ 3 వ తారీఖున కనివిని ఎరుగని రీతిలో చెయ్యబోతున్నాడు అట దిల్ రాజు, ఇందుకోసం ఆయన ఏకంగా రెండు కోట్ల రూపాయిలు ఖర్చు చెయ్యనున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం, పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలి అనేది దిల్ రాజు కోరిక అని మన అందరికి తెలిసిందే, గతం లో ఆయన అనేక సందర్భాలలో ఈ విషయాన్ని తెలిపాడు, అందుకు తగ్గట్టు గానే ఈ సినిమాని ఎక్కడ తగ్గకుండా పవన్ కళ్యాణ్ కి ఆయన అభిమానులకు జీవితాంతం గుర్తు ఉండిపొయ్యే విధంగా ఈ సినిమా అవుట్ పుట్ ని రప్పించాడు అట దిల్ రాజు, ఇక ఏప్రిల్ 3 వ తారీఖున జరగబొయ్యే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు అట, ఇప్పటికే ప్రొమోషన్స్ ని ఒక్క రేంజ్ లో ప్రారంభించిన దిల్ రాజు, ఏప్రిల్ మూడవ టీడిన జరగబొయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికి మర్చిపోలేని విధంగా ఒక్క మెమొరబుల్ స్వీట్ మెమరీ గా మార్చబోతున్నారు అట, మరి భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఏప్రిల్ 9 వ తారీకున్ ఆయా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.