వకీల్ సాబ్ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించిన జూనియర్ ఎన్టీఆర్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదల రోజు నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనక వర్షం కురిపిస్తుంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో ఇలాంటి సబ్జెక్టు ఎంచుకోవడమే సాహసం అంటే, అదే స్టోరీ తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో అందరికి అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం, ఒక్క పక్క కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ పోతు జనాలను వాణిస్తున్న సమయం లో విడుదల అయినా ఈ సినిమాని , అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం ఎన్ని విధాలుగా తొక్కాలని చూస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, బెన్ఫిట్ షోస్ ని క్యాన్సిల్ చెయ్యడమే కాకుండా, టికెట్ రేట్స్ ని భారీ గా తగ్గించి వకీల్ సాబ్ చిత్రాన్ని అన్ని విధాలుగా దెబ్బ తియ్యాలని చూసాడు, కానీ పవర్ స్టార్ సినిమాకి టాక్ వస్తే ఎలా ఉంటుందో తెలీదు అనుకుంటా, 2013 వ సంవత్సరం లో అత్తర్నీతికి దారేది సినిమాకి ఇలాంటి అడ్డంకులు ఎన్ని ఎదురుపడ్డ నిలబడి చరిత్ర సృష్టించింది, ఇప్పుడు మళ్ళీ వకీల్ సాబ్ తో అదే చిత్ర ని తిరగ రాస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఇక ఈ సినిమాకి అభిమానుల నుండి మరియు ప్రేక్షుకుల నుండి ఎలాంటి అద్భుతమైన స్పందన లభించిందో, అటు సినీ పరిశ్రమ నుండి కూడా అదే రేంజ్ అద్భుతమైన స్పందన లభించింది,మెగాస్టార్ చిరంజీవి ,సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వాళ్ళు ఈ సినిమాని ఎలా పొగడ్తలతో ముంచి ఎత్తారో మన అందరికి తెలిసిందే, ఇప్పుడు వాళ్ళ జాబితాలోకి చేరిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇటీవలే ఈ సినిమాని చూసిన ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి స్వయంగా వెళ్లి ప్రశంసల వర్షం కురిపించాడు అట,ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, గతం లో కూడా పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ అనేక సార్లు కలుసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఎన్టీఆర్ అరవింద సామెత ఓపెనింగ్ కి ముఖ్య అతిధి గా విచ్చేసిన పవన్ కళ్యాణ్, గతం లో కూడా అనేక సార్లు కలుసుకున్నారు, వీళ్లిద్దరి అభిమానులు ఎలా ఉన్న, ఇద్దరు హీరోలు మాత్రం ఎంతో స్నేహ పూర్వకంగా ఉంటారు.

ఇక ఈ చిత్రం వసూళ్ల విషయానికి వస్తే మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా బెన్ఫిట్ షోలను అకస్మాత్తుగా క్యాన్సిల్ చేయించి , 2012 మరియు 2013 లో కొనసాగిన టికెట్ రేట్స్ ని అమలు చెయ్యాలి అని అప్పటికి అప్పుడు ఆదేశాలు జారీ చేసిన కూడా మొదటి రోజు ఈ సినిమా 32 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ ఏందో, ఆయన మీద జనాలకి ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలిసేలా చేసాడు, ఇక మొదటి రోజు హై కోర్టు నుండి మూడు రోజుల వరుకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు అని అధికారికంగా ఆదేశాలు కూద జారీ చేసింది, కానీ అక్కడ కూడా తగ్గని ప్రభుత్వం హై కోర్ట్ లో మరోసారి పిటిషన్ వేసింది,సినిమా నడుస్తున్న ప్రతి చోట థియేటర్ యాజమాన్యాల పై అధికార పార్టీ లీడర్స్ తీవ్రమైన వత్తిడిని పెట్టడం ప్రారంభించారు, అన్ని ఇబ్బందులు పెట్టిన కూడా రెండవ రోజు ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది, ఇప్పటి వరుకు బాహుబలి పార్ట్ 2 తప్ప మన తెలుగు లో ఒక్క సినిమా కూడా రెండవ రోజు ఈ స్థాయి వసూళ్లను రాబట్టలేదు, అలాంటి వసూళ్లను రాబట్టి పవర్ స్టార్ సరికొత్త చరిత్రకి శ్రీకారం చుట్టాడు.