వకీల్ సాబ్ సినిమా పై విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇటీవలే విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసందే, విడుదల అయినా తోలి రోజు నుండి నేటి వరుకు ఈ సినిమాకి అనేక విధాలుగా అడ్డంకులు ఎదురు అవుతున్న కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్న స్టార్ పవర్ వల్ల ఈ సినిమా రోజుకో సరికొత్త రికార్డుని సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది,తోలి రోజు ఎలాంటి బెనిఫిట్ షోలు , స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోయినా కేవలం రెగ్యులర్ షోస్ నుండి ఈ సినిమా దాదాపుగా 32 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది, కరోనా విజృంభిస్తున్న సమయం లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి, థియేటర్స్ వైపు వెళ్ళాలి అంటేనే వణికిపోతున్న జనాలను థియేటర్స్ వైపు బారులు దీసేలా చేసింది వకీల్ సాబ్ సినిమా,తోలి వారం 91 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ సినిమా, 100 కోట్ల రూపాయిలు కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తోంది.

ఇక వకీల్ సాబ్ సినిమా గురించి టాలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోలు అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, కేవలం తెలీవుడ్ నుండే కాదు, కోలీవుడ్ , బాలీవుడ్ మరియు మాలి వుడ్ నుండి కూడా అదే స్థాయి ప్రశంసలు కురుస్తున్నాయి, ఇక క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ కూడా ఇటీవల వకీల్ సాబ్ సినిమా గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, ఆయన మాట్లాడుతూ ‘నేను సౌత్ సినిమాలు ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతుంటాను, బాహుబలి సినిమాని చాల సార్లు చూసాను, దీనితో పాటు ఆలా వైకుంఠపురం లో సినిమా కూడా చాల సార్లు చూసాను, ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ జీ వకీల్ సాబ్ సినిమా కూడా చూసాను, చాల బాగా నచ్చింది, ఇలాంటి సినిమాలు రావడం చాలా అవసరం’అంటూ ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ స్పందించాడు.

ఇక మొదటి రోజు ఈ సినిమా బెన్ఫిట్ షోలు ఏమి లేకుండా 32 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యగా, రెండవ రోజు 12 కోట్ల రూపాయిలు , మూడవ రోజు 11 కోట్ల రూపాయిలు వసూలు చేసి కేవలం మూడు రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కలిపి 55 కోట్ల రూపాయిలు షేర్ వసూలు చేసింది, సాధారణంగా ఇలాంటి షేర్లు కేవలం సంక్రాంతి సినిమాలకు మాత్రమే వస్తుంటాయి, కానీ వకీల్ సాబ్ కి వచ్చే కలెక్షన్స్ సంక్రాంతి సినిమాలకు మించి ఉండడం తో పవన్ కళ్యాణ్ స్టామినా చూసి ప్రతి ఒక్క విశ్లేషకుడు ఆశ్చర్యపోతున్నారు, ఇక సోమవారం నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం, ఉగాది రోజు మళ్ళీ విజృంభించింది,ఉగాది రోజు ఈ సినిమా ఏకంగా 10 కోట్ల రూపాయిలు వసూలు చేసి ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది, టికెట్ రేట్స్ భారీగా తగ్గించిన కూడా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం టాలీవుడ్ లో ఒక్క పవర్ స్టార్ కి మాత్రమే చెల్లింది అని ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు, ఇక ఆరవ రోజు ఈ సినిమా నాలుగు కోట్ల 88 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా ఆరు రోజులకి కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయిలు వసూలు చేసింది.