వకీల్ సాబ్ సెన్సార్ టాక్ చూస్తే మెంటలెక్కిపోతారు

దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న వకీల్ సాబ్ చిత్రం వచ్చే నెల 9 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, చాలా కాలం నుండి పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూడడం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఇప్పటి వరుకు వకీల్ సాబ్ నుండి విడుదల అయినా టీజర్ కి కానీ సాంగ్స్ కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, పేరు కి పింక్ రీమేక్ అయినా కూడా ఎక్కడ కూడా ఆ ఛాయలకు వెళ్లకుండా పూర్తిగా పవన్ కళ్యాణ్ స్టైల్ లో తెరకెక్కించాడు ఆ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్, దిల్ రాజు కూడా ఈ సినిమా అవుట్ ఫుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు సమాచారం,ఇది ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన ఒక్క వార్త అభిమానుల్లో ఒక్క రేంజ్ ఉత్సహాం ని నింపింది, ఇంతకీ ఆ వార్త ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము.

ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఎడిటెడ్ పార్ట్స్ ని ఇటీవలే దుబాయి సెన్సార్ బోర్డ్ కి చెందిన ఉమర్ సందు అనే అతను చూసాడు,ఈ చిత్రం ఎడిటెడ్ వెర్షన్ చూసిన ఆయన అద్భుతమైన రివ్యూ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ అభిమానులకి ఈ సినిమా ఒక్క పండగ లా ఉంటుంది అని,ఇటీవల కాలం లో విడుదల అయినా పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల కన్నా ఈ సినిమా ది బెస్ట్ అని, పింక్ సినిమాని ఇలా కూడా తియ్యవచ్చా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపొయ్యే విదంగా డైరెక్టర్ ఈ సినిమా తీసాడు అని , కొన్ని సన్నివేశాలకు అయితే థియేటర్ లో సీట్స్ మీద ఎవ్వరు కూర్చోరు అని, పవన్ కళ్యాణ్ కి ఇది మరో గబ్బర్ సింగ్ లాంటిది అని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు, ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తది అట,ఇక హీరోల గా నటించిన నివేద థామస్, అంజలి మరియు అనన్య నటన కూడా ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుంది అట, మొత్తానికి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా చెరువు అయ్యేలా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాని మలిచాడు అట,మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ తో హరిహర వీర మల్లు అనే సినిమా లో కూడా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ కూడా విడుదల అయ్యింది, దానికి అటు ప్రేక్షకుల నుండి ఇటు సినీ అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఇప్పటి వరుకు కనపడని సరికొత గెటప్ లో కనపడేసరికి అభిమానులు పండగ చేసుకున్నారు, సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఆ సినిమా లుక్ వైరల్ గా ట్రెండ్ అవుతుంది, కేవలం సోషల్ మీడియా లోనే కాదు బయట కూడా అభిమానులు పండగ చేసుకున్నారు, ఇటీవల కాలం లో ఒక్క ఫస్ట్ లుక్ ఈ రేంజ్ సెలెబ్రేషన్స్ చేసుకోవడం ఇదే తొలి సారి, ఈ స్థాయి సెలెబ్రేషన్లు మిగతా హీరోలకు సినిమా విడుదల అయినా రోజు కూడా జరగవు అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఇక ఏప్రిల్ 9 వ తారీఖున విడుదల అవ్వబొయ్యే వకీల్ సాబ్ చిత్రం కి ఏ స్థాయిలో సెలెబ్రేషన్లు చేస్తారో ఊహించుకోవచ్చు.