వకీల్ సాబ్ 4 రోజుల వసూలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుధి

ఏప్రిల్ 9 వ తారీఖున విడుదల అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రబంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఒక్క పక్క కరోనా మహమ్మారి విజృంభణ వల్ల సినిమాలు అన్ని వాయిదా పడుతుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం లక్షల మంది జనాలను థియేటర్స్ వైపు తన స్టామినా తో లాగుతున్నాడు, ఇండస్ట్రీ లో ఇంత క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న మరో టాలీవుడ్ హీరో లేదు అని ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి, మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న ఈ చిత్రం , తొలిరోజు ఏకంగా 32 కోట్ల రూపాయిలు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది, తోలి రోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేసిన కూడా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అంటే మాములు విషయం కాదు అని అందరు అనుకుంటూ ఉన్నారు, ఇక ప్లాన్ ప్రకారం అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటె ఈ సినిమా ఏకంగా 42 కోట్ల రూపాయిలు మొదటి రోజే వసూలు చేసి ఉండేది అని ట్రేడ్ పండితుల అంచనా.

ఇక తోలి రోజు 32 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు 12 కోట్ల రూపాయిలు వసూలు చేసి బాహుబలి 2 తర్వాత ఆ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది, ఇక అదే ఊపు న్మి మూడవ రోజు కూడా కొనసాగించిన ఈ సినిమా , నాల్గవ రోజు అనగా అమావారం ఎలా ఉంటుంది అనే దాని పై ట్రేడ్ వర్గాలు అన్ని ఆసక్తిగా ఎదురు చూశాయి, కానీ ఈలోపే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్స్ తగ్గించాలి అని, లేకపోతే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పడం తో చాల సెంటర్స్ లో 2009 నాటి టికెట్ రేట్స్ ని పెట్టారు, దీనితో కొన్ని సి సెంటర్స్ లో ఉన్న థియేటర్స్ మూత పడ్డాయి, అయినా కూడా పవర్ స్టార్ సునామి ని ఆపలేకపోయింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం,ప్రీ ఫెస్టివల్ రోజు కూడా ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 5 కోట్ల రూపాయలకు పైగానే షేర్ ని వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

మొత్తానికి నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా ఏకంగా 75 కొలత రూపాయిల షేర్ ని వసూలు చేసి పోవె స్టార్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది,బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్థాయి సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా పై సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి కొన్ని గాసిప్స్ షికారు చేస్తున్నాయి, అదేమిటి అంటే వకీల్ సాబ్ సినిమా ఈ నెల 23 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు అని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రాబోతున్నాయి అని పుకార్లు షికార్లు చేసాయి, అయితే ఈ పుకార్లను గమనించిన దిల్ రాజు వెంటనే ఒక్క వీడియో ద్వారా స్పందించాడు ,ఆయన మాట్లాడుతూ ‘వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో రికార్డు బద్దలు కొడుతూ చరిత్ర తిరగరాస్తుంది, అలాంటి సినిమాని అంత తొందరగా ఎలా ఓ టీ టీ లోకి వదులుతాము, దయచేసి సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని పట్టించుకోకండి, వకీల్ సాబ్ ని 50 రోజుల వరుకు వదిలేది లేదు, ఆంధ్రప్రదేశ్ లో మా సినిమాకి ఎవ్వరు ఎన్ని అడ్డంకులు పెట్టాలి అని చూస్తున్న కూడా పవర్ స్టార్ స్టామినా ముందు ఆ అడ్డంకులు అన్ని పవర్ స్టార్ ముందు నిలబడలేకపోయింది’ అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడాడు.