వరంగల్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బస్టాప్ సినిమా హీరోయిన్ షాక్ లో అభిమానులు

హీరోయిన్స్ దర్శకులతో ప్రేమలో పడటం సహజమే ఇక కొంతమంది అసిస్టెంట్ దర్శకులు కూడా హీరోయిన్ ని ఎట్ట్రాక్ట్ చేయడం కూడా కామన్ అనే చెప్పాలి.. హీరోయిన్ కనెక్ట్ అయ్యారు అంటే బాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోడానికి రెడీ గా ఉంటారు.. ఇక ఒక తెలుగు హీరోయిన్ కూడా ఇటవల ఒక కో- డైరెక్టర్ ని పెళ్లి చేసుకోడం హాట్ టాపిక్ గా మారింది.. ఆ యువ హీరోయిన్ బస్టాప్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దేగ్గరైన ఆనంది.. మారుతీ దాసరి దర్శకత్వం లో తెరకు ఎక్కిన మొదటి సినిమా ఈరోజుల్లో పాటలో కనిపించిన ఆనంది.. ఆ తరువాత బస్టాప్ సినిమాలో సీమ అనే పాత్రలో చేసి మరింత క్రేజ్ అందుకుని. ఆ సినిమా తరువాత కొన్ని రోల్స్ లో నటించి చాలా బిజీ అయింది.

ఆనంది మొదటి సినిమా తో నే తన నటనతో మంచి క్రేజ్ అందుకుంది అయితే ఆమె తెలుగు లో కంటే ఎక్కువగా తమిళ్ లో మంచి ఆఫర్స్ అందుకుంటుంది.. ఇక ఆనంది 2013 నుంచి ఇండస్ట్రీ లో బిజీ గా కనిపిస్తుంది.. ఏడాదికి 2,3 సినిమాలు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది..ఆనంది ప్రస్తుతం జోంబీ రెడ్డి తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తెరకు ఎక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఇపుడు ప్రీ – ప్రొడక్షన్ పనిలో బిజీ గా ఉంది.. సజ్జ తేజ ఆ సినిమాలో హీరో గా నటిస్తున్నారు , ఇప్పటికే విడుదలైన టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. ఇక మొత్తానికి ఆనంది పెళ్లి చేసుకుని తమిళ కోడలు గా మారిపోయింది..

ఇక పెళ్ళికొడుకు సోక్రటీస్ తో గత కొన్ని ఏళ్లుగా ప్రేమ లో ఉన్న ఆనంది మొత్తానికి పెద్దవాళ్లని ఒప్పించి వివాహం చేసుకుంది… సోక్రటీస్ పలు తమిళ సినిమాలకు కో- డైరెక్టర్ గా పని చేసారు..త్వరలోనే దర్శకుడిగా బిజీ అవుతున్నారు.. ఇక ఆనంది మరియు సోక్రటీస్ పెళ్లి వరంగల్ లో చాలా సింపుల్ గా జరిగింది.. కేవలం కుటుంబ సభ్యులు అలాగే తమిళ ఇండస్ట్రీ కి చెందినవారు పెళ్ళిలో పాలుగోన్నారు.. ఆనంది అసలీ పేరు రక్షిత ప్రభు సోలొమన్ దర్శకత్వం వహించిన కమల్ సినిమాలో నటించింది ఆ సినిమాలో టైటిల్ రోల్ లో నటించింది. ఈ సినిమాకోసం రక్షిత నుండి ఆనందిగా పేరు మార్చుకుంది..ఈ సినిమాకి రెండు సార్లు ఆడిషన్ ఇచ్చి ఆ తరువాత సెలెక్ట్ అయింది..

ఆనంది తెలుగు ఇండస్ట్రీ లో ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, నాయక్, గ్రీన్ సిగ్నల్, రుబాయి, పందిగై , విసరనాయి, కడవుల్ ఇరుక్కాన్ కుమారు వంటి చాలా సినిమాలో నటించింది.. అలానే తమిళ్ లో పోరియాలిన్, కమల్ సినిమాకి తమిళ్ నాడు స్టేట్ ఫిలిం అవార్డు స్పెషల్ ప్రైజ్ కి నామినేట్ అయింది.. అలానే బెస్ట్ యాక్ట్రెస్ గా విజయ్ అవార్డు గెల్చుకుంది.. చండి వీరన్, ఏంజెల్, రవాణా కూటం సినిమాలు ఇపుడు షూట్ ప్రారంభం అవుతుంది.. ఇంకా చాలా సినిమాలో నటించి మంచి గుర్తింపు సాధించింది..