వరలక్ష్మి శరత్‌కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆమె గురించి మనకి తెలియని అనేక నిజాలు.

మన సినిమాలో హీరో ఎంత ముఖ్యం అలానే విల్లన్ కూడా అంటే ముఖ్యం అయితే ఈ మధ్య వస్తున్నా సినిమాలో ఆడవాలనే విల్లన్స్ గా చూపించే ట్రెండ్ మొదలైంది,ఇటీవల సీనియర్ నటుడు శరత్ కుమార్ గారి కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ విల్లన్ గా అదరకొడుతుంది ఇటు సినిమాలోనే కాదు బయట కూడా వరలక్ష్మి డేరింగ్ అండ్ డాషింగ్ గానే కనిపిస్తుంది, శరత్ కుమార్ వంటి సెలబ్రిటీ కుమార్తెగా గుర్తింపు ఉన్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు సృష్టించుకుంది, వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ మొదటి భార్య చాయ దంపతులకి పుట్టింది మార్చి 5న 1985లో జన్మించింది తనకి చెల్లి, తమ్ముడు రాహుల్ అయితే శరత్ కుమార్ హీరోయిన్ రాధికా ని పెళ్లి చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు విడిపోయారు కానీ తాను తన తల్లి తోనే నివసిస్తుంది.వరలక్ష్మి చెన్నైలోని హిందూస్తాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుండి మైక్రోబయాలజీలో లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.. ఆ తరువాత ఎడిన్బర్గ్ యూనివర్సిటీ నుండి బిసినెస్ మానేజ్మెంట్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసింది సినిమాలో ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత తండ్రి బాటలో నడుస్తూ సినిమాల మీద ఇంటరెస్ట్ తో ముంబై లోని అనుపమ్ ఖేర్స్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుని ప్రొఫెషనల్ యాక్టర్ గా మారింది.సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ నిర్మించిన బాయ్స్ సినిమాలో లీడ్ రోల్ లో నటించడానికి సెలెక్ట్ అయ్యింది కానీ శరత్ కుమార్ తిరస్కరించమని కోరడంతో ఈ సినిమాలో నటించలేదు, ఆ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు బాలాజీ శక్తివేల్ నిర్మించిన కాదల్ అలానే సరోజ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుంది.. 2012 సంవత్సరం లో వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ్ లో పోదా పొడి సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది, ఆ తరువాత విక్రమ్ వేద,తారై తప్పట్టై, నిబునన్, సత్య, మిస్టర్ చంద్రమౌళి,సర్కార్,మారి 2,వెల్వెట్ నాగారం,దాన్నీ,కాన్ని రాసి,నీయ 2, సినిమాలో నటించింది.. ప్రస్తుతం తమిళ్ లో కాటరీ, పంబన్, చేసింగ్, పిరంతల్ పరాశక్తి , కలర్స్, యానై, వంటి వరస సినిమాలో బిజీ గా నటిస్తుంది. అటు తమిళ్ తో పాటు కన్నడ లో మాణిక్య,రన్న, విస్మయ, కట్టు సినిమాలో నటించింది, మలయాళం లో కసభకట్టు, మాస్టర్ పీస్ సినిమాలో నటించింది.

తెలుగు లో నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన సందీప్ కిషన్ హీరో గా హన్సిక హీరోయిన్ గా నటించిన తెనాలి రామకృష్ణ సినిమాలో వరలక్ష్మి నటించింది, ఇటీవల రిలీజ్ అయినా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ అనే కీలక పాత్రలో నటించి మంచి యాక్టర్ గా ప్రసంశలు పొందింది ఈ సినిమాలో తన నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి. అల్లరి నరేష్ హీరో గా నటించిన ఇటీవల రిలీజ్ అయినా నాంది సినిమా లో లాయర్ గా నటించింది,వరలక్ష్మి ఎన్నో సినిమాలకి అవార్డు లు పొందింది,బెస్ట్ యాక్ట్రెస్ గా పోద్దా పొడి సినిమాకి విజయ అవార్డు,ఎడిసన్ అవార్డు,తారై సినిమా సీమ అవార్డు ఎన్నో అవార్డు లు పొందారు.ఇపుడు ఏ సినిమా లో చుసిన వారలక్ష్మి నటిస్తూనే ఉంది.2018 లో ఇంగ వీటు మ్పిళ్ళై అనే రియాలిటీ షో లో చేసింది అలానే ఉన్నై అరిందాల్,కోడెస్స్వరి, తెలుగు లో హై ప్రైస్ట్స్,అద్దం లో నటిస్తుంది.

2020 సంవత్సరంలో ఆహా ప్లాటుఫార్మ్ లో రిలీజ్ అయినా అద్దం వెబ్ సిరీస్ చేస్తుంది, అటు సినిమాలో టాప్ రేటెడ్ యాక్టర్ గా నిలుస్తుంది. ఇలా ఎన్నో సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అందరి సూపర్ స్టార్స్ హీరోలతో పోటీగా సినిమాలో ఛాన్స్ కోటేసింది అందరిని అక్కటుకుంది అన్ని భాషలో లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో హీరో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి ఒక రాజకీయ నాయకురాలిగా కీలక పాత్రలో నటిస్తుంది అయితే ఏంటో సక్సెస్ అందుకుంటున్న వరలక్ష్మి..ఇంకా మరెన్నో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో సక్సెస్ అవాలని కోరుకుంటున్నారు. ఈరోజు పుట్టినరోజు సందర్బంగా ఫాన్స్ అందరు తనకి సోషల్ మీడియా లో విషెస్ తెలియచేస్తున్నారు అయితే పుట్టినరోజు సందర్బంగా పార్టీలో దిగిన ఫోటోలు, వీడియోలు ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.