వరుణ్ తేజ్ ఘని ఫస్ట్ లుక్ పోస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ ..

మెగా కుటుంబం నుంచి వచ్చిన తనదైన స్టైల్ లో నటిస్తూ స్టోరీ సెలక్షన్ లో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్ లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్.. మొదట్లో కథ విష్యం లో చాలా కష్టపడ్డారు వరుణ్ తేజ్.. ఆ తరువాత కొంచెం అలవాటు అయిపోయింది ఇపుడు కొత్త రకం సినిమాలు తీస్తూ ఫాన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు దీనితో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు.. వరుణ్ తేజ్ తన 31వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్బంగా అయిన తాజా చిత్రం ఘనీ ని రిలీజ్ చేసారు.. దానికి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు, ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ బాక్సింగ్ చేస్తూ ఎనర్జిటిక్ లుక్ లో కేక పుట్టిస్తున్నాడు.. ఈ చిత్రం పేరు ని ఘనీ గా కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు ఈ సినిమాతో బాక్సర్ పాత్రలో నటించబోతున్నారు..

వరుణ్ తేజ్, ఘనీ సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా బాక్సింగ్ సెక్షన్ తీసుకున్నారు .. ఈ సినిమా దాదాపు 35 కోట్లు బర్రిగా తెరకు ఎక్కిస్తుంది .. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా సాయి ముఖేర్జీ హీరోయిన్ గా నటిస్తుంది వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్ అందుకుంటున్న తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు… వరుణ్ తేజ్ పోస్టర్ ని చూసి చాలామంది మెగా ఫ్యామిలీ ఆయనని ప్రశంసలు అందిస్తున్నారు.. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా పై సైన్ చేసి 2008 ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన ఇంగ్లాండ్ బాక్సర్ టోనీ డేవిడ్ నుండి శిక్షణ తీసుకున్నాడు వరుణ్ తేజ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేశారు ఘనీ మోషన్ పోస్టర్ చాలా బాగుందని వరుణ్ ని పొగిడారు ఇది సోషల్ మీడియా ద్వారా తెలియ చేసారు..

ఇక ఘనీ టైటిల్ మెగా అభిమానులని విపరీతంగా ఆకర్షిస్తుంది దీనికి కారణం బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు కావడం టైటిల్ కి తగ్గట్టు వరుణ్ తేజ్ లుక్ కూడా అదిరిపోయింది.. ఈ సినిమాను జులై 30న విడుదల చేస్తారని ప్రకటించారు సినిమా యూనిట్ .. గడ్డలకొండా గణేష్ లాంటి కమర్షియల్ హిట్ తరువాత వరుణ్ తేజ్ కొత్త సినిమా ఘని పోస్టర్ పై చిరంజీవి గారు వరుణ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వరుణ్ తీసే సినిమాలు చాలా బాగుంటాయి ఇపుడు నువ్వు తీయబోయే ఈ సినిమా మంచి పేరు తేవాలని ఆశీర్వదిస్తున్నాను అందరు కలిసి మెలిసి ఉండాలి ఎవరి మధ్య మనస్పర్థలు వచ్చిన నా దృష్టికి తీసుకురావాలని నేను దాన్ని పరిష్కరిస్తాను మీరు అందరు కలిసి ఉంటె బాగుంటాడని అని చెప్పారట చిరంజీవి గారు నువ్వు ఇంకా మంచి సినిమాలు తీసి ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆశీర్వదించారు..

ఇపుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వరుణ్ తేజ్ పోస్టర్ చూసి స్పందించారు.. వరుణ్ తేజ్ ఇప్పటిదాకా మంచి సినిమాలు తీసావు ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు చాలా బాగా సినిమాలు తీసి చాలా హ్యాపీ గా ఉండాలని అంటూ అయిన ఆశీర్వదించారు.. మన హీరోలో నువ్వు చాలా ఫేమస్ మరియు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది నీకు అందులోను మంచి కధలు ఎంపిక చేసుకోడం లో నువ్వు ఇపుడు చాలా బాగా రెడీ అవుతున్నావు త్వరలోనే నీ పెళ్లి నేను చేయాలి అంటూ చెప్పారట పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమాలో చేసిన పంచ్ ఇపుడు వరుణ్ తేజ్ చేయబోతున్నారు .. అల్ ది బెస్ట్ నాన్న అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు ఇక వరుణ్ తేజ్ కి మార్నింగ్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారట పవన్ కళ్యాణ్..