విడుదలకి నోచుకోని రామ్ చరణ్ సినిమాల లిస్ట్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులతో చుడుగుడు ఆడుకొని నెంబర్ 1 హీరో రేసులోకి వచ్చిన నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇతని బాక్స్ ఆఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఒక్క మాములు యావరేజే సినిమాని కూడా ఇండస్ట్రీ లో కమర్షియల్ హిట్ ని చెయ్యగల సత్తా ఉన్న హీరోలలో రామ్ చరణ్ ప్రధాన వరుస లో ఉంటాడు, ఇక సరైన హిట్ తగిలితే ఇండస్ట్రీ లో ఒక్క రికార్డుని కూడా మిగలకుండా కొడతాడు, దానికి ఉదాహరణ రంగస్థలం సినిమా,ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అప్పటి వరుకు ఇండస్ట్రీలు లో ఉన్న నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నిటిని వదలకుండా బ్రేక్ చేసి రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా మరోసారి చూపించింది,ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన వినయ్ విధేయ రామ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా మంచి వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ కి తక్కువ నష్టాలతో బయటపడేలా చేసింది, ఇది ఇలా ఉండగా ఇప్పటి విబరుకు రామ్ చరణ్ తన కెరీర్ లో షూటింగ్ ని ప్రారంబించి మధ్యలో ఆపేసిన సినిమాలు చాలానే ఉన్నాయి, ఒక్కసారి ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము.

మగధీర తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరంజ్ అనే సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా అప్పట్లో పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఈ సినిమాతో పాటు ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం లో ప్రముఖ నిర్మాత ఆర్ బీ చౌదరి అప్పట్లో ఘనంగా ప్రారంబించాడు, ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు, కానీ అప్పటికే ఆరంజ్ సినిమా విడుదల అయ్యి భారీ ఫ్లాప్ అవ్వడం తో, మెరుపు సినిమా కూడా కాస్త అలాగే కొత్త రకం కాన్సెప్ట్ కాబట్టి జనాలకు మల్లి రీచ్ అవ్వము ఏమో అని అనుకోని ఈ సినిమాని మధ్యలోనే నిలిపివేశారు, ఈ సినిమా బదులుగా అయాన్ రచ్చ సినిమా చేసాడు, అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా అప్పట్లో ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి టాప్ 3 గా నిలిచింది,ఇక ఆ తర్వాత రామ్ చరణ్ ప్రయోగాల జోలికి పోకుండా ఎక్కువగా మాస్ సినిమాలే చేసుకుంటూ వచ్చి తిరుగులేని మాస ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడు.

ఇక మగధీర సినిమా తో మ్రం చరణ్ కి ఇండియా వైడ్ గా మంచి పాపులారిటీ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే,హిందీ లో ఆయన అప్పట్లో జంజీర్ అనే సినిమా కూడా చేసాడు,కానీ ఆ చిత్తిరమ్ అప్పట్లో ఘోర పరాజయం పాలైన రామ్ చరణ్ ఇమేజి కి ఎలాంటి డ్యామేజీ జరగలేదు, ఇప్పటికి రామ్ చరణ్ సినిమాలని అక్కడి ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకీ ఉన్న క్రేజ్ ఎలాంటిదో,అప్పట్లో రామ్ చరణ్ కి ఉన్న ఫేమ్ ని కాష్ చేసుకోడానికి బాలీవుడ్ లో దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు, అలా రామ్ చరణ్ మరియుఈ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఒక్క మంచి ముల్టీస్టార్ర్ర్ సినిమాని అప్పట్లో ప్లాన్ చేసారు, కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ప్రారంభం అయితే అయ్యింది కానీ, రెగ్యులర్ షూటింగ్ ముని మాత్రం జరుపుకోలేకపోయింది, అలా ఆయన ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది, అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే హిందీ లో పీకే, 3 ఇడియట్స్ వంటి సెన్సషనల్ హిట్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ త్వరలో మెగా పవర్ స్టార్ ర్క్మ్ చరణ్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అట, త్వరలోనే దీనికి సంబధానించి అధికారిక ప్రకటన కూడా రానుంది.