విడుదలకు కాకుండా టాలీవుడ్ హీరోలను చుక్కలు చూపించిన సినిమాలు ఏంటి తెలుసా?

ఎంత పెద్ద హీరో అయినా కూడా ఏదోక సమయంలో కొన్ని సినిమాలకి విడుదల సమస్యలు వస్తుంటాయి అవి నిర్మాతల నుంచి కావచ్చు లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉండచ్చు కానీ పేరు ఉన్న హీరోలు సినిమాలకు కూడా ఒకోసారి తిప్పలు తప్పవు, మెగాస్టార్ చిరంజీవి లాంటి సినిమా కూడా ఒకోసారి విడుదలకు ముందు చుక్కలు చూపిస్తూ ఉంటుంది అలాగే బాల్లయ్య ,వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు నటించిన సినిమాలకి కూడా విడుదలకి ముందు కొన్ని సినిమాలు బాగా ఇబ్బంది పెట్టాయి. ఇపుడు గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా ఎలాగైతే విడుదల కాకుండా ఆగిపోయిందో అలా టాలీవుడ్ హీరోల కెరీర్ లో కొన్ని సినిమాలు విడుదల కి ముందు బాగా చుక్కలు చూపించాయి, ముందుగా అందులో హీరో గోపీచంద్ నటించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా నాలుగు ఏళ్లగా విడుదల కావడం లేదు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమా 5 ఏళ్ళు పాటు షూటింగ్ లోనే ఉంది, ఇక నందమూరి బాలకృష్ణ మహారాది సినిమా రిలీజ్ కి ముందు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ రిలీజ్ కాలేకపోయింది, ఇక రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాకి కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, దగ్గుబాటి వెంకటేష్ దేవిపుత్రుడు సినిమా రిలీజ్ కి తరువాత వివాదం కూడా తలెత్తింది, ఇక నాగార్జున నటించిన డమరుకం సినిమా రెండు ఏళ్ల పాటు ఆర్థిక ఇబ్బందులు పది వాయిదా పడింది, ఇక అక్కినేని నాగ చైతన్య ,సమంత జంటగా కలిసి నటించిన ఆటో నగర్ సూర్య సినిమా కూడా రెండు ఏళ్ల పాటు ఆలస్యం అయ్యింది తరువత సినిమా ప్లాప్ లిస్ట్ లో చేరింది, రాజేశేఖర నటించిన పట్టపగలు సినిమా రెండు ఏళ్ల తరువాత విడుదలైంది. ఇక మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా నిర్మాతల సింగనామల రమేష్ కారణంగా వివాదం జరిగింది.

పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి నిర్మాత సింగనామల రమేష్ కారణం గా వివాదం చోటు చేసుకుంది దీనితో ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది. ఇక శర్వానంద్ రాజాధిరాజా రెండు ఏళ్ల పాటు విడుదలకు ఆటంకాలు మొదలయ్యాయి రిలీజ్ అయ్యాక ఈ సినిమా హిట్ అయ్యింది. హీరో నాని నటించిన జెండాపై కపిరాజు షూటింగ్ పూర్తయ్యాక ఏడాదికి విడుదలైంది. ఇక హీరో రామ్ చరణ్ , అల్లు అర్జున్ కలిసి నటించిన ఎవడు సినిమా 6 ఏళ్ళకి పైగా వాయిదా పది రిలీజ్ అయ్యాక హిట్ కొట్టింది.అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ నటించిన ఆర్య 2 సినిమా తెలంగాణ లో వివాదం జరిగింది దానివల్ల ఆలస్యం అయ్యింది, రానా దగ్గుబాటి అరణ్య షూటింగ్ తరువాత ఏడాదికి విడుదలైంది. ఇక విజయ్ దేవరకొండ నటించిన ఏమంత్రం వేసావే షూటింగ్ పూర్తయ్యాక 3 ఏళ్ళకి విడుదలైంది. సందీప్ కిషన్ మహా నగరం సినిమా కూడా యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది.

నాగ శౌర్య నటించిన నిజతలేక సినిమా షూటింగ్ పూర్తయిన రెండు ఏళ్ళకి విడుదలైంది, మంచు విష్ణు ఓటర్ షూటింగ్ అయినా మూడు ఏళ్లకు విడుదలైంది, ఆ సినిమాతో పాటు ఎటాక్ సినిమా కూడా షూటింగ్ అయినా విడుదలకు ఆటంకాలు వచ్చి రిలీజ్ కాలేకపోయింది. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రేయ్ సినిమా షూటింగ్ కి పూర్తయిన తరువాత మూడు ఏళ్ళకి విడుదలైంది, ఇక కళ్యాణ్ రామ్ షేర్ షూటింగ్ పూర్తయిన ఏడాదికి విడుదలైంది, ఇక హీరో నితిన్ నటించిన ” మారో ” షూటింగ్ పూర్తయిన విడుదలకు ముందు ఆటంకాలు వచ్చాయి, ఇక హీరో రవి తేజ నటించిన క్రాక్ సినిమా కూడా ఆర్థిక ఇబ్బందులు కారణం గా విడుదల ఆలస్యం చేసారు రిలీజ్ తరువాత సూపర్ హిట్ అయ్యింది నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా ముద్ర నుంచి టైటిల్ మర్చి ఏర్పడిన తరువాత ఈ సినిమా విడుదల చేసారు.