విశాల్ తో నిశ్చితార్థం .. మరొకరితో పెళ్లి ఏడడుగులు నడిచిన అనీషా..?

టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి, కోలీవుడ్ లో విశాల్ పెళ్లి వీళ్ల ఇద్దరి పెళ్లి ఎపుడు అవుతుందా అని అభిమానులు గత 10 ఏళ్లగా ఎదురు చూస్తున్నారు, ఏ సినిమా రిలీజ్ ఫంక్షన్ లో అయిన ఈవెంట్ లో అయిన ఇదే ప్రశ్న మీడియా నుంచి వచ్చేది కానీ మీడియా కి సమాధానం చెప్పకుండా ప్రశ్న దాటేసి మరో ప్రశ్నకు వెళ్లిపోతారు ప్రభాస్ మరియు విశాల్. ప్రభాస్ మాత్రం ఇంక పెళ్లి పై ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు ఆ విష్యం గురించి ఎక్కడ అసలు మాట్లాడాడు కూడా మొత్తానికి విశాల్ అయితే గత ఏడాది దీనికి స్టాప్ పెట్టేసారు. అయితే 47 ఏళ్ల విశాల్ గత ఏడాది తెలుగు అమ్మాయి అనీషా రెడ్డి తో నిశ్చితార్థం చేసుకున్నారు, 6 నెలల స్నేహంతోనే ఆమెను పూర్తిగా అర్ధం చేసుకుని పెళ్లి వరకు ఈ విషయాన్ని తీసుకువెళ్లారు.

ఇటు అనీషా రెడ్డి కూడా విశాల్ తో వివాహానికి ముందుకు వచ్చింది,మొత్తానికి ఇద్దరి జంట చూసి అభిమానులు కూడా చాలా బాగున్నారని ప్రసంశలు కురిపించారు. కోలీవుడ్, టాలీవుడ్ నుంచి ప్రముఖులు చాలా మంది వివాహానికి వస్తారని అందరు భావించారు, 2020 లో ఈ కరోనా పాండమిక్ సిట్యుయేషన్ లేకపోతే విశాల్ పెళ్లి ఈ పాటికి అయిపోయేది. ఈ వార్తలు కూడా అందరు నమ్మేవారు కానీ ఇపుడు ఒక షాకింగ్ వార్త వినిపిస్తుంది. తమిళ్ హీరో విశాల్ పెళ్లి రద్దు చేశారట చాలా రోజులుగా దీనిపైన వార్తలు వినిపించాయి కానీ ఇపుడు ఫుల్ క్లారిటీ వస్తుంది,ఎప్పటినుంచో వినిపిస్తునట్టుగానే విశాల్ పెళ్లి ఆగిపోయింది అయిన నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి అనీషా రెడ్డి మరొకరిని పెళ్లి చేసుకుందని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.

విశాల్ అర్జునకు అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు, ఆ తరువాత యాక్టర్ గా మారదు రొమాంటిక్ థ్రిల్లర్ చెల్లమే సినిమాలో మెయిన్ రోల్ లో నటించాడు. ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లో చేసారు అలానే హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా చాలా సినిమాలకి చేసారు మంచి గుర్తుమ్పు తెచ్చుకున్నాడు, విశాల్ సినిమాలు తెలుగు లో రిలీజ్ అవుతాయి. అలానే అర్జున్ రెడ్డి,పెళ్లి చూపులు లాంటి సినిమాలో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో నటించిన తెలుగు అమ్మాయి అనీషా రెడ్డి గత ఏడాది విశాల్ ని నిశ్చితార్థం చేసుకున్నారు వీళ్ల ఇద్దరి పెళ్లి 2019 లో ప్రకటన చేసారు కానీ కుదరలేదు తరువాత పెళ్లి గురించి అసలు టాపిక్ కూడా లేదు ఇపుడు అప్పుడు అంటూ సోషల్ మీడియా లో వార్తలు వచ్చిన తరుణంలో ఏకంగా పెళ్లి ఆగిపోయిందని కాన్ఫర్మషన్ వస్తుంది. నిజానికి నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే తన సోషల్ మీడియా ఎకౌంట్స్ నుంచి ఫొటోస్ అన్ని డిలీట్ చేసింది అనీషా రెడ్డి. అది జరిగిన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య అభిప్రాయాలు గొడవలు వచ్చి ఇద్దరు విడిపోయారని తెలుస్తుంది.

విశాల్ వరుస సినిమాతో బిజీ అయిపోయాడు, ఇది ఇలా ఉంటె మరొక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. విశాల్ తో నిశ్చితార్థం చేసుకున్న అనీషా రెడ్డి కి ఇపుడు మరొకరితో వివాహం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ బుసినెస్ మెన్ ని ఆమె పెళ్లి చేసుకుందని తెలిసింది, ఇద్దరి కుటుంబాలకి నచ్చడం అదే విదంగా పెద్దలు కుదిర్చిన ఈ వివాహం అని తెలుస్తుంది. ఈ విష్యం కూడా బయటకి రాకుండా జాగ్రత పడ్డారు. కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిగిందని వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా విశాల్ తో నిశ్చితార్థం జరిగిన తరువాత మరొకరితో పెళ్లి అని తెలిసి షాక్ అవుతున్నారు ఫాన్స్. అయితే ఇది నిజామా రూమర్ అనేడి తెలియడం లేదు దీనిపైన ఇద్దరిలో ఎవరు ఒక్కరు క్లారిటీ ఇవ్వాలని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.