విస్కీ లేకుండా ఉండలేను అనుపమ

‘విస్కీ’ లేకపోతే నేనుండలేను అంటోంది అనుపమా పరమేశ్వరన్. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ షాకయ్యారు . అయితే, ఫస్ట్ లైన్ మాత్రమే చదివి ఊరుకుంటే.. అందమైన అనుపమకు.. ఈ అలవాటు ఏంటి? దాన్ని ఇలా ఓపెన్‌గా చెప్పారేంటి? అని కంగారు పడటంలో అశ్చర్యమేమి లేదు. కానీ, ఇంకో లైన్ చదివిన తర్వాత ‘ హమ్మయ్య’ అనుకుంటారు. ఇంతకీ, విషయం ఏంటంటే… ఆమె పెంచుకునే కుక్క పేరు ‘విస్కీ’ అంట!! అది తెలియగానే చాలామంది నవ్వుకున్నారు. ఈ మధ్య స్టార్స్ తమ పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకోవడం కొంచెం ఎక్కువే అయ్యింది. ఇంటి విషయాల దగ్గర్నుంచి పెంచుకునే పెట్స్ పై ఉండే ప్రేమ వరకు అన్నీ షేర్ చేసుకుంటున్నారు. అదే వరుసలో, సోషల్‌ మీడియాలో కొంచెం ఎక్కువగానే టచ్‌లో ఉండే అనుపమ కూడా చెప్పుకొచ్చింది. తన ‘విస్కీ’కి నాలుగేళ్లు నిండిన సందర్భంగా… బర్త్ డే గ్రాండ్ గా జరిపానని సోషల్ మీడియాలో షేర్ చేసింది. విస్కీతో పాటే పుట్టిన రెండు పెట్స్.. పోయిన సంవత్సరం చనిపోయాయట! ‘‘వాటి మరణం చాలా బాధ కలిగించింది.. అందుకే అప్పటి నుంచి విస్కీని ప్రేమగా చూసుకుంటున్నాను. అది లేకుండా నేను ఉండలేను’ అని పోస్ట్ చేసింది. అనుపమ ఇప్పుడు తెలుగులో ‘రాక్షసుడు’ తర్వాత నిఖిల్‌కి జోడీగా 18 పేజస్, కార్తికేయ –2 చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా ఓ సినిమా చేస్తోంది ఈ కేరళ కుట్టి.