సంచలన నిర్ణయం తీసుకున్న గెటప్ శ్రీను.. ఇక సెలవు అని ప్రకటన

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గెటప్ శ్రీనుకు ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది. అందులో అతడు వేసే స్కిట్లు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని అందిస్తాయి. బుల్లితెర కమల్‌హాసన్ అంటూ గెటప్ శ్రీను నటనకు ఇప్పటికే అందరూ ప్రశంసలు కురిపించారు. దీంతో బుల్లితెర తెచ్చిన గుర్తింపుతో వెండితెరపై వస్తున్న అవకాశాలను గెటప్ శ్రీను రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి ఇప్పుడు మెయిన్ లీడ్ క్యారెక్టర్‌ల వరకు గెటప్ శ్రీను ఎదిగిపోయాడు. కమెడియన్‌గా నటిస్తూనే హీరోగానూ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే గెటప్ శ్రీను చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.
వీటిలో కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టుగా గెటప్ శ్రీను నటిస్తుండగా.. కొన్నింటిలో మాత్రం లీడర్ రోల్ పోషిస్తున్నాడు. గతంలో ‘త్రీ మంకీస్’ సినిమాలో తన స్నేహితులు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్‌తో కలిసి గెటప్ శ్రీను నటించాడు,. అయితే ఈ సినిమా వర్కవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు మరో సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నాడు. ఆ సినిమానే రాజుయాదవ్. ఈ మూవీకి సంబంధించి గెటప్ శ్రీను ఉన్న పోస్టర్లు, టీజర్ విడుదల కాగా ఆడియన్స్ నుంచే కాకుండా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజు యాదవ్ సినిమాతో గెటప్ శ్రీను బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజు యాదవ్ మూవీ డ్రామా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గెటప్ శ్రీనుతో పాటు అంకిత ఖారత్, ఆనంద చక్రపాణి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు.
అయితే సడన్‌గా గెటప్ శ్రీను సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాకు కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. ‘త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాను.. కీప్ షైనింగ్’ అని అతడు ప్రకటించాడు. దీంతో అతడి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకవేళ గెటప్ శ్రీను అనారోగ్యంతో బాధపడుతున్నాడేమో అని పలువురు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం కరోనా ఏమైనా సోకిందా అని ఆరాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు షూటింగులలో బిజీగా మారిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడా లేదా అనారోగ్యంతో తీసుకున్నాడా అని గెటప్ శ్రీను అభిమానులు హైరానా పడుతున్నారు. సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా బ్రేక్ తీసుకోవడానికి గల కారణాలను గెటప్ వెల్లడిస్తాడేమో వేచి చూడాలి.