సాయి పల్లవికి పోటీగా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇస్తున్న తన చెల్లి సంతోషం లో అభిమానులు!

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తన అందం తో పాటు యాక్టింగ్,డాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో అభిమానం గెల్చుకుంది, తనకి అద్భుతమైన నటిగా ఎంతో మంచి పేరు ఉందని తెలిసిందే, తెలుగు లో శేఖర్ కమల దర్శకత్వం లో వచ్చిన ఫిదా సినిమాలో తన నటన తో తెలుగు ప్రేక్షకులను ఎంతో అక్కటుకుంది, ఈ సినిమాలో తెలంగాణ భాషలో మాట్లాడుతూ అదరకొట్టింది సాయి పల్లవి అంటే కాదు తాను ఎంచుకున్న సినిమాలా ద్వారా మంచి నటిగా పాత్రకి తగ్గట్టు హావ భావాలను చక్కగా ప్రదర్శించగలదు అనే పేరుని కూడా సంపాదించుకుంది సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరం గా ఉంటూనే ప్రేక్షకులకు దెగ్గర అవ్వడం ఆమెకు మాత్రమే సాధ్యం అని చెప్పాలి ఇక సాయి పల్లవి ఏ సినిమాలో నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది ఎందుకంటే ఆమె యాక్టింగ్ ఏ హీరోతో అయినా అంత అద్భుతం అనే చెప్పాలి ఫిదా సినిమా తనకి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది.

ఇక సాయి పల్లవి చెల్లి పూజ కూడా సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి, స్టంట్ కొరియోగ్రాఫర్, స్టంట్ సిల్వా దర్శకుడిగా తెరకు ఎక్కిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా పూజ కన్నన్ సెలెక్ట్ అయిన్నట్టు తెలుస్తుంది, ఈ సినిమాలో సముథిరాకని ఒక ముఖ్యమైన ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు ఏఎల్ విజయ్ ఈ సినిమాకి స్టోరీ, డైలాగ్స్ రాస్తున్నారు ఇక పూజ కూడా మంచి డాన్సర్ ఆచం అక్క సాయి పల్లవి లాగానే ఉంటుంది,ఈ సినిమా దర్శకుడు స్టంట్ శివ గతం లో యమదొంగ,ఏ మాయ చేసావే, మాస్టర్ వంటి పలు చిత్రాలకు స్టంట్ మాస్టర్ గా చేసారు, సిల్వాకి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం ఇందులో సిల్వా కూడా ఒక కీలక పాత్రలో లో నటిస్తున్నాడు. యాక్టర్ గా సిల్వా 7 జి రెయిన్బో కాలనీ లో నటించాడు ఏ తరువాత యమదొంగ లో స్టంట్ మాన్ గా చేసారు, ఇలా చాలా సినిమాలో పని చేసారు, సిల్వా బెస్ట్ స్టంట్ కోఆర్డినేటర్ గా తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు కూడా పొందారు.

ఇక సాయి పల్లవి సినిమాలా విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం విరాటపరవం చిత్రం లో నటిస్తుంది.తెలంగాణ నేపథ్యం లో ఆవర్తన ప్రేమకథ గా రాజకీయ థ్రిల్లర్ గా వస్తుంది ఈ సినిమా అటు హిందీ,తమిళ భాషలో విడుదల కానుంది ఈ సినిమాతో పాటు సాయి పల్లవి నాగ చైతన్య హీరోగా లవ్ స్టోరీ పేరుతో వస్తున్న సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాకి శేఖర్ కమల దర్శకుడు హైదరాబాద్ నేపథ్యం లో ఒక ప్రేమ కథను తెరకు ఎక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 16 న థియేటర్ లో విడుదల కానుంది,ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు మంచి హిట్ అయ్యాయి ముఖ్యం గా సారంగా దారియా అనే పాట 5 కోట్లు దాక వ్యూస్ రాబట్టింది సూపర్ హిట్ గా నిలిచింది అయితే ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్,అమిగో క్రియేషన్స్ సంస్థలు సంయుతంగా నిర్మిస్తున్నాయి, నారాయణ్ దాస్,కే.నారంగ్ పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నాడు ఈ చిత్రానికి ఏ.అర్ రెహ్మాన్ శిశుడు పవన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు సాయి పల్లవి నాని తో కలిసి శ్యామ్ సింగరాయ లో కూడా నటిస్తుంది ఆ తరువాత అయ్యపునం కోషియం రీమేక్ లో కూడా నటిస్తుంది,సాయి పల్లవి తెలుగు తో తమిళ్,మలయాళ భాషలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది,సాయి పల్లవి కస్తూరిమాన్ మరియు ధామ్ ధూమ్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.2 కోట్లు విలువైన స్కిన్ లైటెనింగ్ ఆడ్ ని తిరస్కరించింది. డాన్స్ మీద ఇష్టం తో 2009 సంవత్సరంలో టీవీ లో ప్రసారం అయినా ఢీ డాన్స్ షో లో ఎంట్రీ ఇచ్చి పార్టిసిపేట్ చేసింది ఫినాలే వరకు చేరుకుంది. తెలుగు,మలయాళం సినిమాలకి ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు,సీమ అవార్డు,వనిత అవార్డు లు సాధించింది. మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది,ఇపుడు వరస సినిమాలతో బిజీ గా ఉంది సాయి పల్లవి తనలాగే తన చెల్లి పూజ ని కూడా సినిమాలో ఎంట్రీ ఇచ్చి అక్కలాగే వరస ఆఫర్లతో బిజీ ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని అందరు కోరుకుంటున్నారు.