సింగర్ శ్రేయా గోషాల్ బిడ్డకి జన్మానించారు ఎమోషనల్ అయ్యి ఏమన్నారంటే.

ప్రతి అమ్మాయి జీవితంలో తల్లి కావడం అనేది ఒక మధురమైన క్షణం బిడ్డకు జన్మనిచ్చాక ఆ బిడ్డని చూసి మురిసిపోతూ తల్లి పొందే ఆనందాన్ని చెప్పడానికి మాటలు చాలవు కాగా తాజాగా ఫేమస్ సింగర్ శ్రేయ గోషాల్ తాను తల్లిని అయ్యాను అని గుడ్ న్యూస్ చెప్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది ఈ మేరకు ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది శ్రేయ గర్భవతి గా ఉన్న సమయం లో తమ ఇంట్లోకి మూడో వ్యక్తి రాబోతున్నారు అని ప్రకటించిన శ్రేయ గోషాల్ తాజాగా తాను పండంటి బిడ్డకు జన్మానించారని తెలిపింది. ఆ దేవుడి ఆశీర్వాదం తో పండంటి మగబిడ్డ పుట్టారు.. నేను శైలాదిత్య కుటుంబ సభ్యులం అందరం చాలా చాలా సంతోషం గా ఉన్నాము గతం లో ఎప్పుడు లేని ఫీలింగ్ ఇది మా చిన్నారికి ఆశీర్వాదాలు పంపిన మీకందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఆమె ఒక పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ చూసి అభినందనలు అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శ్రేయ గోషాల్ ప్లేబాక్ సింగర్ గా కెరీర్ మొదలు పెట్టింది. 2015 సంవత్సరం లో శ్రేయా గోషాల్ వివాహం జరిగింది. తన స్నేహితుడు బిసినెస్ మెన్ శైలాదిత్య తో ఆమె మాట్లాడింది వివాహం తరువాత కూడా కెరీర్ కొనసాగిస్తున్న శ్రేయా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, బెంగాలీ భాషలో పాటలు పడుతూ పలువురి ప్రసంశలు అందుకుంది ఇటీవలే ఉప్పెన సినిమా లో ఆమె పడిన జల జల పాతం నువ్వు అనే పాట యూత్ ఆడియన్స్ ని ఎట్ట్రాక్ట్ చేసింది శ్రేయా అన్ని భాషలో తన పాటలతో ప్రేక్షకులను బాగా అక్కటుకుంది ఆమెకు నేషనల్ వైస్గా నాలుగు నేషనల్ అవార్డు, నాలుగు కేరళ స్టేట్ ఫిలిం అవార్డు, రెండు తమిళనాడు స్టేట్ ఫిలింఫేర్ అవార్డు అలాగే 7 ఫిలిం అవార్డు మరియు 10 ఫిలింఫేర్ సౌత్ అవార్డు లు ఎన్నో అవార్డులు గెల్చుకున్నారు.

శ్రేయా చిన్న వయసు నుండే పాటలు పది ప్లేబాక్ సింగర్ అవ్వాలని ఆకాంక్షించారు, నాలుగు ఏళ్ల వయసు నుండే సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారు అలానే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు,ప్లేబ్యాక్ గానం కాకుండా, శ్రేయ గోషాల్ అనేక టెలివిజన్ రియాలిటీ షోలో జడ్జిగా కనిపించింది మరియు ఆమె మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపిస్తుంది. ఆమె ప్రపంచవ్యాప్తంగా సంగీత కచేరీలలో ప్రదర్శన ఇస్తుంది. ఆమెను యునైటెడ్ స్టేట్స్ స్టేట్ ఓహియో సత్కరించింది, ఇక్కడ గవర్నర్ టెడ్ స్ట్రిక్లాండ్ 26 జూన్ 2010 ను “శ్రేయా ఘోషల్ డే” గా ప్రకటించారు. ఏప్రిల్ 2013 లో, యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క హౌస్ ఆఫ్ కామన్స్ యొక్క ఎంపిక చేసిన సభ్యులు ఆమెను లండన్‌లో సత్కరించారు. ఆమె ఫోర్బ్స్ జాబితాలో ఐదుసార్లు భారత టాప్ 100 ప్రముఖుల జాబితాలో చోటు దక్కించుకుంది.

2017 లో శ్రేయ గోషాల్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను పట్టుకున్న మొదటి భారతీయ సింగర్ అయ్యారు. ఆమె మొట్టమొదటిగా రికార్డ్ చేసిన పాటలు “గణరాజ్ రంగి నాచాటో”, ఇది మరాఠీ పాట యొక్క కవర్ వెర్షన్, మొదట లతా మంగేష్కర్ గారి పాట. ఆమె మొట్టమొదటి స్టూడియో ఆల్బమ్ బెందేచి బెన్నాలో చేసారు. ఇది 1 జనవరి 1998 లో 14 ట్రాక్‌లతో విడుదలైంది.తెలుగు లో చాల పాటలు పది మంచి పేరు తెచ్చుకుంది ఎన్నో హిట్ సాంగ్స్ పడింది. గత ఏడాది రిలీజ్ అయినా అల్లు అర్జున్ హిట్ సినిమా అలా వైకుంఠపురం, మిస్ ఇండియా,” వి” సినిమాలకి పాటలు పాడారు అలానే ఉప్పెన ,యువరత్న,టక్ జగదీష్, దళపతి, థాట్ ఈజ్ మహాలక్ష్మి అలాగా తెలుగు లోనే కాదు హిందీ , తమిళ్, కన్నడ అలా అన్ని భాషలో తన సత్తా చాటుతుంది శ్రేయ టాప్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది బారి రెమ్యూనిరేషన్ అందుకుంది.