సినిమాలు లేక ఇండస్ట్రీ ని వదిలి పెట్టి దూరంగా ఉంటున్న హీరోలు ఎవరంటే ?

సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు కానీ ఈ రంగుల లోకంలో ఎవరి స్థానం అయినా సక్సెస్ మీద ఆదారిపడి ఉంటుంది, ఇలా సూపర్ సక్సెస్ అయ్యి కూడా తరువాత కాలం లో సరైన విజయాలను అందుకోలేక వెనక పడిన స్టార్స్ ఎవరంటే అందులో ఒకరు తరుణ్ ఏ ఇండస్ట్రీ లో అయినా ఒక హీరోకి లవర్ బాయ్ ఇమేజ్ రావడం అంత సులభం కాదు కానీ హీరో తరుణ్ కి అతి తక్కువ కాలంలోనే లవర్ బాయ్ గా మంచి క్రేజ్ దక్కింది, బాల నటుడిగా మనసు మమతా సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సంచనాలు సృష్టించిన తరుణ్ పెద్ద అయ్యాక నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే లాంటి సినిమాలతో స్టార్ అయిపోయాడు కానీ తరువాత కాలం లో వరసగా వచ్చిన ఫ్లోప్స్ తరుణ్ కెరీర్ ని దెబ్బ తీసింది అనే చెప్పాలి అందుకే 2018 తరువాత సినిమాలకి దూరం అయిపోయాడు .

ఇక ఈ లిస్ట్ లో మరో హీరో వేణు తోటంపుడి వేణు కూడా మొదట్లో వరస విజయాలను అందుకున్నాడు తరువాత కాలం లో హిట్స్ పడక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు కానీ ఇపుడు వేణు చాలా వరకు సినిమాలకి దూరం అయిపోయాడు చాలా తక్కువ సమయం లోఎక్కువ క్రేజ్ పేరు సాధించిన హర్ వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి కొత్త బంగారు లోకం సినిమాతో వరుణ్ స్టార్ అయ్యాడు కానీ తరువాత వరస పరాజయాలు అయ్యి వెనక్కి పడిపోయాడు, చివరికి బిగ్ బాస్ 3 లో కూడా మెరిశాడు వరుణ్ సందేశ్ అయినా ఇప్పటికి వరసగా ఆఫర్ లు రావడం తగ్గాయి, ఇక బాగా హైలెట్ అయ్యి విజయాలను అందుకోలేక పడిపోయిన మరో స్టార్ నవదీప్ చందమామ, గౌతమ్ ఎస్.ఎస్.సి అనే సినిమాలు బాగా ఆడిన ఈ హీరోకి సరైన అవకాశాలు అందలేదు దీనితో ప్రస్తుతం సినిమాలో సపోర్టింగ్ పాత్రలో నటిస్తూ టీవీ షో లో బిజీ గా ఉన్నాడు.

ఒకోసారి ఎక్కడికో వెళ్లిపోతారు అనుకున్న స్టార్స్ ఒక్కసారిగా వెనక్కి పడిపోతుంటారు అలా ట్రాక్ తప్పిన స్టార్ రాజ్ తరుణ్ హ్యాట్రిక్స్ సక్సెస్ లతో ఇండస్ట్రీకి వచ్చాడు రాజ్ తరుణ్ ఇపుడు ఒక హిట్ కూడా రావడం లేదు ప్రస్తుతం అతనికి సినిమాలు కూడా లేవు అని తెలుస్తుంది, ఇక హీరో రోహిత్ 16 సినిమాతో హీరోగా గా ఎంట్రీ ఇచ్చిన ఈయన తరువాత రోహిత్ చాలా సినిమాలో నటించాడు శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమాలో చిరంజీవి తో కలిసి నటించాడు కానీ రోహిత్ కెరీర్ లో ఒక మాస్ హిట్ కూడా కొట్టలేదు దీనితో ఈయన పూర్తిగా సినిమాలకి దూరం అయిపోయాడు. చిన్న చిన్న హీరోలు మాత్రమే కాదు వద్దే నవీన్ వంటి స్టార్ హీరోలు కూడా హిట్ సినిమాలు లేక పరిశ్రమకి దూరం అయ్యాడు అప్పట్లో నవీన్ కి ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పకర్లేదు ఒకపుడు మంచి టాప్ హీరోలో ఒకరిగా అందరిని అక్కటుకునాడు.

బాల నటుడిగా పరిశ్రమలో సూపర్ సక్సెస్ అయ్యాడు తనీష్ తరువాత హీరోగా కొన్ని సినిమాలో హీరో గా నటించాడు అయినా మంచి అవకాశాలు అయితే అందుకోలేక పోయాడు చివరికి బిగ్ బాస్ 2 లో మెరిసిన తనీష్ సినిమాలో అవకాశాలు కూడా రాలేదు అదృష్టం మాత్రం రాలేదు, ఇక నటన పరంగా శివ బాలాజీ కి మంచి మార్కులు వేశారు కానీ ఆయనకి మాత్రం ఇండస్ట్రీ లో సినిమాలు లేక పోయింది ఆఖరికి బిగ్ బాస్ సీసన్ 1 విన్నర్ గా నిలిచినా శివబాలాజీకి సినిమాలో అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యం అనే చెప్పాలి, ఇక ఒకప్పటి స్టార్ హీరో రాజా ఆనంద్ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు కానీ ఆనంద్ కూడా ఈ లిస్ట్ లో వస్తాడు ఆయనకి కొన్ని సినిమాలో అవకాశాలు ఉన్నపటికీ పరిశ్రమలో ఇబ్బందులు తట్టుకోలేక బయటకి వెళ్ళిపోయాడు, ప్రస్తుతం పాస్టర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.