సినిమాల్లోకి హీరో గా ఎంట్రీ ఇవ్వనున్న సుధాకర్ కొడుకు లేటెస్ట్ ఫోటోలు చూడండి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతమంది కమెడియన్స్ ఉన్న కొంతమంది కమెడియన్స్ మాత్రం ఎన్ని జెనరేషన్లు మారిన ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర ని వేసిన వాళ్ళు ఉంటారు,అలాంటి కామెడిన్స్ లో ఒక్కరు సుధాకర్ గారు, ఈయన తెలియని తెలుగు ప్రేక్షకుడు అంటూ ఎవ్వరు ఉండరు, సినిమాలకు దూరం అయ్యి దశాబ్దం దాటినా కూడా ఈ జెనరేషన్ జనాలకు కూడా ఆయన సుపరిచితుడే, ఎందుకంటే పాత సినిమాల్లో ఆయన పండించిన హాస్యం అలాంటిది మరి,తమిళం హీరో గా ఒక్క వెలుగు వెలిగి ఆ తర్వాత తెలుగు లోకి అడుగుపెట్టిన సుధాకర్ , ఇక్కడ కూడా తొలుత హీరోగానే ఎంట్రీ ఇచ్చాడు, కాని ఆయనకీ హీరోగా తమిళం లో దొరికిన బ్రేక్ మన టాలీవుడ్ లో దొరకలేదు అనే చెప్పాలి, ఇక్కడ హీరో గా సక్సెస్ కాకపోవడం ఆయన కమెడియన్ వేషాలను అంగీకరించి రెండు మూడు సినిమాలు చేసాడు, ఆయన కామెడీ టైమింగ్ కి అద్భుతమైన మార్కులు పడడం తో ఇక కమెడియన్ బాగా బిజీ అయిపోయాయి దాదాపు 700 చిత్రాలకు పైగా నటించాడు, ఈయన డైలాగ్ మోడ్యులేషన్స్ కి ఎలాంటి ఫాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇంతతి సుదీర్ఘ సినీ ప్రస్థాన ఉన్న సుధాకర్ గారి గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఎక్సక్లూసివ్ గా మీ ముందు ఉంచబోతున్నాము.

కమెడియన్ సుధాకర్ ఆఖరిసారిగా వెండితెర పై కనిపించిన సినిమా 2005 వ సంవత్సరం లో కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన లక్ష్మి కళ్యాణం అనే సినిమా,ఈ సినిమా తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకు దూరం అయ్యాడు, అయితే అందరిలాగానే సుధాకర్ గారు కూడా సినిమాల నుండి రిటైర్ అయిపోయాడు ఏమో, అందుకే సినిమాలు మానేసాడు అని అందరూ అనుకున్నారు, కానీ ఆయన ఆరోగ్య సమస్య వల్లే సినిమాలకు దూరం అయ్యాడు అని, చాలా కాలం ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా కోమాలోకి కూడా వెళ్ళాడు అని, సుధాకర్ గారు ఇటీవల చెప్పిన ఒక్క ఇంటర్వ్యూ ని చూస్తే కానీ చాలా మందికి తెలియదు,ఆరోగ్య పరంగా మళ్ళీ ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాల్లో నటించడానికి సుముఖత చూపించిన పాపం ఆయనకీ అవకాశాలు ఇచ్చేవాళ్ళు కరువు అయ్యారు, 2018 వ సంవత్సరం లో తమిళం లో సూర్య సినిమా లో నటించిన సుధాకర్, మళ్ళీ వెండితెర పై కనిపించలేదు, ఇప్పటికి ఆయన నటించడానికి సిద్ధం గా ఉన్న ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ డైరెక్టర్స్ ఆయనకీ ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అంతుచిక్కని ప్రశ్న.

సుధాకర్ గారికి బెన్నీ అనే కుమారుడు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇతను కూడా ఇటీవల పలు ఇంటర్వూస్ లో పాల్గొన్నాడు, చూడడానికి అచ్చు గూడినట్టు సుధాకర్ గారిలాగా ఉన్న బెన్నీ ఫోటోలు కొన్ని మీరు ఎక్సక్లూయివే గా క్రింద చూడవచ్చు, సుధాకర్ గారు అనేక సార్లు బెన్నీ ని ఒక్క గొప్ప హీరో గా చూడాలి అనేది తన కోరిక అన్నట్టు అనేక సార్లు చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పుడు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే బెన్నీ సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు అని, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా సిద్ధం అయిపోయింది అని , ఈ ఏడాది లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, ప్రస్తుతం ఆయన ఒక్క పర్సముక ఏం యెన్ సి కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.