సినిమా షూటింగ్ కోసం వెళ్లి మంచు కొండల్లో చిక్కుకున్న బెల్లంకొండ షాక్ లో సినీ ఇండస్ట్రీ..

ఈ సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయి అని ఎవరైనా అడిగితే వకీల్ సాబ్ రావట్లేదని ఎంత గట్టిగా చెప్తారో. రెడ్, క్రాక్, అల్లుడు అదుర్స్ వస్తున్నాయి అని కూడా అంటే గట్టిగా చెప్తారు మరి రెడ్, క్రాక్ రావడం తో అనుమానాలు లేదు.. కానీ అల్లుడు అదుర్స్ నిజంగానే వస్తుందా అనేది ఇపుడు చాలామందికి అనుమానం, చివరి నిమిషం లో అనుమానం ఎందుకు వచ్చిందా అని డౌట్ లు వస్తున్నాయి. రామ్ కి సంబంధించిన రెడ్ ప్రమోషన్ పీక్స్ లో నడుస్తున్నాయి. ఎపుడు ప్రమోషన్ లో వెనక ఉండే రవితేజ కూడా మొన్న ఈమధ్యనే ప్రీ- రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టుకున్నారు, మరోవైపు చెన్నై నుంచి వచ్చే విజయ్ కూడా గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఫిక్స్ చేసుకున్నాడు.

మరి సంక్రాంతికి బరిలో దుకే పండం కోడీలని ప్రమోషన్ ల మీద వేగం పెంచేస్తుంటే బెల్లంకొండ ఎక్కడ అని అందరు ఈ విషయాన్ని ఆరాతీస్తున్నారు.. రీసెంట్ గా ఒక సాంగ్ షూట్ కోసం కాశ్మీర్ వెళ్లిన బెల్లంకొండ శ్రీను అక్కడే ఇరుక్కుపోయాడు అయిన ఒక్కడే కాదు ఆయనతో పాటు హీరోయిన్ కూడా అక్కడే ఉంది.. హైదరాబాద్ కి రావాలంటే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి.. అందుకు ఇపుడు ప్రమోషన్ లో కూడా పార్టిసిపేట్ చేయలేని సిట్యుయేషన్ మరో వైపు సినిమా ఇంకా ఫస్ట్ కాపీ కాలేదు అని టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది అటు క్రాక్ ఇటు రెడ్ తమ సినిమా సెన్సార్ కాపీలను కూడా ప్రమోషన్ లో వాడుకుంటే ఇంకా అల్లుడు అదుర్స్ ఫైనల్ మిక్సింగ్ కాలేదు అనే టాక్ కూడా స్ప్రెడ్ అవుతుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ గురించి తెలియని వారు ఉండరు.. 21 సంవత్సరానికి చిన్న వయసులో 2014 లో అల్లుడు శీను సినిమాతో సమంత పక్కన జోడి కట్టి ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టారు.. ఈ సినిమాకి ఫిలింఫేర్ అవార్డు ని పొందారు..ఆ తరువాత రభస , స్పీడునోడు ,జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు కానీ రాక్షషుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో రాబోతున్న అల్లుడు అదుర్స్ సినిమా ఒక థ్రిల్లర్ చిత్రం.. హీరోయిన్ గా నాభ నటేష్, అను ఇమ్మానుయేల్ నటించబోతున్నారు.. సోను సూద్ , ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.అలానే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ లో తెలియ చేసారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 2020 లో రావాల్సింది, కరోనా కారణం గా వాయిదా పది ఇపుడు సంక్రాంతికి విడుదల కానుంది… లాస్ట్ మినిట్ టేషన్ వల్ల సినిమా ఔట్పుట్ మీద చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అసలే బాలీవుడ్ లో అడుగు పెట్టాల్సిన హీరో ఇపుడు ఎన్ని టెన్షన్ అవసరమా అంటున్నారు బెల్లం శ్రేయోభిలాషులు.. మరి బెల్లంకొండ వెనక్కి వచ్చేదాకా వాలా ఫాన్స్ కి టెన్షన్ అనే చెప్పాలి.

2.

3.