సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత వరుడు ఎవరంటే?

సౌత్ ఇండియా ప్రేక్షకులను తన అందం అభినయంతో అక్కటుకున్న కనడ భామ ప్రణీత సుభాష్ బయటకి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం కోవిద్ పరిస్థితుల కారణంగా ఎవరికి సమాచారం ఇవ్వకుండా తన కుటుంబసభ్యులు ,స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో నితిన్ రాజుని వివాహం చేసుకున్నారు అయితే ఆమె పెళ్లి వార్త ఆలస్యం గా మీడియాలోకి వెలుగు చూసింది. హీరోయిన్ ప్రణీత సుభాష్ వివాహం శుక్రవారం జరిగినట్టు సన్నిహితులు వెల్లడించారు అయితే రెండు రోజుల తరువాత నితిన్ రాజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేయడంతో ప్రణీత సుభాష్ పెళ్లి వార్త మీడియా లో హాల్ చల్ అయ్యింది, ప్రస్తుతం ప్రణీత పెళ్లి కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రణీత సుభాష్ నితిన్ రాజు తమ వివాహాన్ని వైభోవంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం కోవిద్ నిబంధనలు కారణంగా అత్యంత నిరాడంబరంగా పెళ్లిచేసుకున్నారు. కేవలం తమకు సన్నిహితంగా ఉన్నవారిని కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకుని జీవిత భాగస్వాములు గా మారారు అంటూ సన్నిహితంగా తెలిపారు అయితే ఎలాంటి సమాచారం లేకుండా ప్రణతి పెళ్లి చేసుకోవడం మీడియాలో చర్చ నియాంశం అయ్యింది. నితిన్ రాజు విషయానికి వస్తే బెంగళూరుకు చెందిన వారీగా మాత్రమే సమాచారం ఉంది నితిన్ రాజు ఎవరు వారిది ప్రేమ వివాహమా లేక పెద్దలు జరిపించిన వివాహమా అనే విష్యం పై ఇంకా గోప్యత కొనసాగుతుంది. ఇక ప్రణీత సుభాష్ కెరీర్ విషయానికి వస్తే హీరోయిన్ గా మంచి క్రేజ్ తో ఇండస్ట్రీ లో దూసుకెళ్తుంది అటు టాలీవూడ్లోనే కాకుండా బాలీవుడ్లోకి అడుగుపెట్టి రెండు బారి సినిమాలో నటిస్తున్నారు హంగామా 2 ,భుజ్ నటిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలోనే ఆమె అనూహ్యం గా పెళ్లి వార్త చెప్పడంతో ఆమె అభిమానులు షాక్ లో ఉన్నారు.దక్షణాది కెరీర్ విషయానికి వస్తే ప్రణీత సుభాష్ హిందీ, కన్నడ, తెలుగు, తమిళ భాషల చిత్రాల్లో ప్రధానంగా కనిపించే ప్రణిత. ఆమె 2010 కన్నడ చిత్రం పోర్కిలో నటిగా అడుగుపెట్టింది. ఆమె వాణిజ్యపరంగా విజయవంతమైన తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగు లో సిద్దార్ధ్ తో కలిసి బావ అనే సినిమాలో నటించి మంచి పేరు తెచుకుంది అలాగే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సూపర్ హిట్ సినిమా ద్వారా ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మాసు ఎంగిరా మసిలమణి మరియు ఎనక్కు వైతా అడిమైగల్ వంటి అనేక చిత్రాలలో నటించింది. 2012 లో ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన భీమా తీరదల్లి చిత్రంలో నటించింది అలాగే కార్తీ తో కలిసి సాగునీ అనే చిత్రంలో నటించింది.

ప్రణీత తన ఎగ్జిక్యూటివ్ విద్యను పూర్తి చేసి, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుండి ప్రొఫెషనల్ మరియు లీడర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. ప్రణీత సుభాష్ ఒక ఆతిథ్య సంస్థలో వాటాను కొనుగోలు చేసింది మరియు ఇప్పుడు బ్యాంగ్లోర్‌లోని లావెల్లె రోడ్‌లోని బూట్‌లెగర్ అనే రెస్టారెంట్‌ను సహ-యజమానిగా కలిగి ఉంది. ఇక ప్రణీత కన్నడ సినిమా భీమా తీరదల్లి, విజిల్. తెలుగు లో అత్తారింటికి దారేది సినిమాలకి బెస్ట్ యాక్ట్రెస్ గా సీమా అవార్డు ని గెల్చుకుంది అలానే తమిళ్ మాస్ సినిమాలో తన నతనికి ఎడిసన్ అవార్డు గెల్చుకుంది. ప్రణీత సుభాష్ ప్రస్తుతం హిందీ సినిమాలతో పాటు కన్నడలో రిషితో కలిసి రమణ అవతార చిత్రం లో నటిస్తూ వరస సినిమాలతో దూసుకెళ్తుంది అయితే ఈ పెళ్లి వార్త వినగానే ప్రణీత సుభాష్ అభిమానులు షాక్ లో ఉన్నారు ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.