సీరియల్ హీరో రవికృష్ణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

తన అద్భుతమైన యాక్టింగ్ కి తోడు హ్యాండ్సమ్ లుక్స్ తో బుల్లితెరపై స్టార్ హీరో గా వెలుగు అందుతున్నాడు రవి కృష్ణ.. తన కెరీర్ లో ఎన్నో సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మరి ముఖ్యం గా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుని దూసుకుపోతున్నాడు. ఈ క్రేజ్ వల్లే బిగ్ బాస్ 3 సీసన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు, ఆ షో నుండి వచ్చిన తరువాత వరుస ఆఫర్లతో హావ చూపిస్తున్నాడు, తెలుగు రాష్ట్రలో సీరియల్ యాక్టర్ లకు ఉన్న ఫాలోయింగ్ వేరు అందుకే మన బుల్లితెర పై నటించేవారు బిగ్ సెలెబ్రిటీలు గా వెలుగు అందుతున్నారు, ఇలా మొగలి రేకులు అనే సీరియల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు రవికృష్ణ. ఆ తరువాత శ్రీనివాస కళ్యాణం, మనసు మమతా సీరియల్ లో నటించాడు..

ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన అతడు తరువాత హీరో గా మారదు.. ఈ క్రమం లో వరూధిని పరిణయం తో ఏలనేని క్రేజ్ ని సంపాదించుకున్నాడు.. హీరో గా మారిన తరువాత వరస సీరియల్స్ తో తన హావ ని చూపిస్తున్నాడు. హీరో రవి కృష్ణ వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయం లో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 సీసన్ లో ఆఫర్ వచ్చింది.. మొదటి నుంచి చక్కగా ఆడుతూ హౌసెమెట్స్ తో కలిసి మెలిసి ఉంటూ మంచోడిగా పేరు తెచ్చుకున్న రవి మరింత ఫేమస్ అయ్యారు.. బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తరువాత వరుస ఆఫర్లు అందుకుంటున్నారు.. ఈ క్రమం లోనే సినిమాలో అవకాశాలు వచ్చిన కూడా బుల్లితెర పైనే కనిపించేందుకు ఇంటరెస్ట్ చూపారు..

మా టీవీ లో ప్రసారం అవుతున్న ” ఆమె కథ” అనే సీరియల్ ను మొదలు పెట్టారు ఇందులో అతను తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు..ఈ సీరియల్ లో నవ్య స్వామి లీడ్ రోల్ లో నటిస్తుంది.. బిగ్ బాస్ నుండి వచ్చాక వరసగా స్టార్ మ్యూజిక్ , జాతరో జాతర, వావ్, స్టార్ మా పరివార్ తో పాటు చాలా షోస్ లో రవి కృష్ణ పార్టిసిపేట్ చేసారు.. బిగ్ బాస్ 3 షో ద్వారా పరిచయం అయిన శివ జ్యోతి తన సీరియల్ పార్టనర్ నవ్య స్వామి తో కలిసి రవికృష్ణ కొద్దీ రోజుల క్రితం ఈటీవీ లో ప్రసారం అవుతున్న కాష్ షో లో పాలుగోన్నారు.. ఆ షో లో సుమ ఇచ్చిన టాస్క్ ల భాగంగా హీరోయిన్ తో కలిసి లవర్ గా నటించాడు ఇందులో భాగంగా నవస్వామి రవి కృష్ణ కు ప్రొపోజ్ చేసింది.. రవి వెంటనే నవ్య ని హాగ్ చేసుకుని నుదిటి పై ముద్దు పెట్టి అందరికి షాక్ ఇచ్చారు..

బుల్లితెర రంగం లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ గా ఉన్న రవి కృష్ణ కొద్దీ రోజుల గా తరచు వార్తలు లో నిలుస్తున్నాడు.. గతం లో అతడు సీరియల్ హీరోయిన్ నవ్యస్వామి తో ప్రేమాయణం సాగిస్తున్నారని ప్రచారం జరిగింది.. క్యాష్ షో లో చేసిన హడావిడి తో వీళ్ల మధ్య బంధం నిజమే అని అంత అనుకున్నారు.. అదే సమయం లో ఇద్దరు ఒకేసారి కరోనా బారాణా పడటంతో దీనికి లవ్ అని ఫిక్స్ అయ్యారు.. స్టార్ మా లో సంక్రాతి స్పెషల్ గా ఒక ఈవెంట్ చేస్తున్నారు దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది.. ఇందులో రవి కృష్ణ తల్లితండ్రులు కూడా వచ్చారు. ఈ సందర్బంగా లాస్య తన పెళ్లి గురించి ప్రశ్నించగా ఏప్రిల్ లో పప్పు అన్నాలు పెడుతున్నారని అతని తల్లి వెల్లడించారు, దీనితో రవి కృష్ణ పెద్దలు చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలుస్తుంది..