సుడిగాలి సుధీర్ అసలు పేరు, అతడి వయసు గురించి మీకు తెలుసా?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న నటుల్లో సుడిగాలి సుధీర్ ఒకడు. 1987లో మే 19న జన్మించిన అతడికి ప్రస్తుతం 34 ఏళ్లు. సుధీర్‌కు బుల్లితెరపై మంచి ఇమేజ్ ఉంది. వరుసపెట్టి టీవీ షోలు చేస్తుండటంతో నెలకు లక్షల్లో, ఏడాదికి కోట్లలో సుడిగాలి సుధీర్ సంపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈటీవీ పూర్తిగా సుడిగాలి సుధీర్ మీదే ఆధారపడిందంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రతి ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్ కనిపిస్తుంటాడు. దీంతో అతడు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కెరీర్ ప్రారంభంలో జబర్దస్త్ షోకి రాకముందు మ్యాజిక్‌లు చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడిన సుధీర్‌కు జబర్దస్త్ అవకాశం రాగానే తన సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం సుధీర్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

అయితే సుడిగాలి సుధీర్ అసలు పేరు సుధీర్ అని చాలామంది భావిస్తారు. కానీ అది నిజం కాదట. నిజానికి జబర్దస్త్ సెట్‌లో కూడా చాలా మందికి సుధీర్ అసలు పేరు తెలియదు. అంతా సుడిగాలి సుధీర్ అని మాత్రమే పిలుస్తుంటారు. అయితే అతడి అసలు పేరు ఏంటో తెలుసా.. సిద్దూ అట. ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు ఇటీవల సుధీర్ అక్క హాజరైంది. ఆమె సుధీర్ అసలు పేరును బయటపెట్టింది. స్టేజీపై అందరూ చూస్తుండగానే సిద్ధూ అని పిలిచింది. దాంతో అక్కడున్న వాళ్ళతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.. అక్కడ సిద్ధూ ఎవరబ్బా అని అటూ ఇటు దిక్కులు చూశారు. ఆ తర్వాత సుధీర్ అక్క అసలు విషయం చెప్పింది. తాము ఇంట్లో చిన్నప్పటి నుంచి తమ తమ్ముడిని సిద్దూ అని పిలుస్తున్నట్లు వెల్లడించింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సుధీర్‌గా అందరికీ పరిచయం కావడంతో ఆ పేరు పాపులర్ అయిందని ఆమె తెలిపింది. కాగా సుడిగాలి సుధీర్ ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అతడు నటించిన త్రీ మంకీస్, సాఫ్ట్‌వేర్ సుధీర్ ఇప్పటికే విడుదలయ్యాయి. ప్రస్తుతం కాలింగ్ సహస్ర అనే సినిమాలో అతడు నటిస్తున్నాడు. అంతేకాకుండా రష్మీతోనూ సుధీర్ త్వరలో ఓ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.