సెన్సషనల్ కాంబినేషన్ కి ముహూర్తం సిద్ధం..పవన్ ఫాన్స్ కి ఇక పండగే

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ కి నిలయం అయ్యింది, బాలీవుడ్ ఇండస్ట్రీ కంటే మన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ అన్ని విధాలుగాను పది అడుగులు ముందు ఉంది, ఇప్పుడు భారత దేశ సినీ ప్రియులు అందరు మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి రాబోతున్న సినిమాల గురించే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, వాటిల్లో ఆర్ ఆర్ ఆర్, కె జీ ఎఫ్ చాప్టర్ 2 గురించి అందరూ ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పక్కర్లేదు, ఇక మల్టీస్టార్ర్ర్ సినిమాలు కూడా మన సౌత్ ఇండియా నుండే క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి,ఆర్ ఆర్ ఆర్ నుండి ప్రారంభం అయినా ఈ మల్టీస్టార్ర్ర్ ట్రెండ్ ఇప్పుడు సరికొత్త క్రేజీ కాంబినేషన్స్ కి దారి తీస్తుంది, ఇది ఇలా ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక్క వార్త అభిమానులను ఉర్రూతలూ ఊగిస్తుంది, అది ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

సౌత్ ఇండియా లో శంకర్ మరియు రాజమౌళి తర్వాత అదే స్థాయి ఫేమ్ ని మరియు బ్రాండ్ ఇమేజి ని సంపాదించుకున్న దరకుడు మురగదాస్, ఈయన తీసిన సినిమాలు కొన్ని మన టాలీవుడ్ లో కూడా ఎలాంటి సెన్సషనల్ హిట్స్ గా నిలిచాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, వాటిలో గజినీ, సెవెన్త్ సెన్స్, తుపాకీ మరియు స్టాలిన్ వంటి సినిమాలు మన టాలీవుడ్ లో సంచలన విజయాలు సాధించాయి, కానీ చాలా కాలం విరామం తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో డైరెక్ట్ గా తెలుగు లో చేసిన స్పైధర్ చిత్రం మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లో ఘోరంగా విఫలం అయ్యి మహేష్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది,అయితే ఇప్పుడు మురగదాస్ రెండో ప్రయత్నం గా ఈసారి తెలుగులో ఎలా అయినా హిట్ కొట్టాలి అనే కసితో ఒక్క అద్భుతమైన స్టోరీ ని సిద్ధం చేసాడు అట, ఈ స్టోరీ లో ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యం ఉండే అవకాశం ఉండడంతో ఈ సినిమాని పవన్ కళ్యాణ్ మరియు కమల్ హస్సన్ లతో తీద్దాం అనే ప్లాన్ లో మురగదాస్ ఉన్నట్టు సమాచారం.

ఇందులో పవన్ కళ్యాణ్ సిబిఐ ఆఫీసర్ గాను మరియు కమల్ హస్సన్ హీరోయిన్ కి తండ్రిగాను నటించనున్నారు అట, ఈ కాంబినేషన్ కానీ కార్య రూపం దాలిస్తే సౌత్ ఇండియా లో ఒక్క సెన్సేషన్ రోస్టించడం కాయం అని చెప్పవచ్చు, అయితే ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మరో వార్త ఏమిటి అంటే మురగదాస్ ఆలోచనలో మహేష్ బాబు కూడా ఉన్నట్టు సమాచారం, మహేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒక్కరిని కచ్చితంగా ఈ సినిమాలో తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాడట మురగదాస్, గతం లో మురగదాస్ పవన్ కళ్యాణ్ తో తుపాకీ సినిమాని చెయ్యాల్సి ఉంది, కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ అప్పటికే కాలిగా లేకపోవడం తో ఈ సినిమాని తమిళ స్టార్ హీరో విజయ్ తో తీసి బీబర్ హిట్ కొట్టాడు, కేవలం తమిళం లో మాత్రమే కాదు , తెలుగు లో కూడా ఆ చిత్రం అనువాదం అయ్యి మంచి విజయం సాధించి విజయ్ కి తెలుగు లో మార్కెట్ ని తెచ్చిపెట్టింది, మరి ఒక్కసారి మిస్ అయినా పవన్ కళ్యాణ్ మరియు మురగదాస్ కలయిక ఈసారి అయినా కుదురుతుందో లేదో తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.